వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రయాన్ -2 తో రిపోర్టర్ గా ....కేరళ రాష్ట్ర మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ జర్నలిస్ట్ సాదియా

|
Google Oneindia TeluguNews

సమాజంలో హిజ్రాలను చిన్నచూపు చూస్తున్నారని చాలా సందర్భాల్లో హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాంటి హిజ్రాల పట్ల లింగ వివక్ష లేదని , సామర్ధ్యం ఉంటే వాళ్ళు ఏ వృత్తిలో అయినా రాణిస్తారని నిరూపించింది కేరళ రాష్ట్రానికి చెందిన హైడీ సాదియా . సోమవారం చంద్రయాన్ -2 కక్ష్య నుండి ల్యాండర్ 'విక్రమ్' వేరు కావడం భారతదేశంలో ఒక చారిత్రాత్మక ఘట్టం . భారత్ చంద్ర మిషన్‌కు ఒక అడుగు దగ్గరగా ఉండగానే, కేరళకు చెందిన 22 ఏళ్ల హైడీ సాదియా కూడా చరిత్ర సృష్టించింది.

మా నాన్నకు వివేకా హత్యతో సంబంధం లేదు .. పోలీసులు వేధించారని శ్రీనివాసులు రెడ్డి కుమారుడి ఆవేదనమా నాన్నకు వివేకా హత్యతో సంబంధం లేదు .. పోలీసులు వేధించారని శ్రీనివాసులు రెడ్డి కుమారుడి ఆవేదన

 కేరళ రాష్ట్ర మొదటి ట్రాన్స్ జెండర్ జర్నలిస్ట్ సాదియా .. చంద్రయాన్ 2 పై అద్భుతమైన రిపోర్టింగ్

కేరళ రాష్ట్ర మొదటి ట్రాన్స్ జెండర్ జర్నలిస్ట్ సాదియా .. చంద్రయాన్ 2 పై అద్భుతమైన రిపోర్టింగ్

చంద్రయాన్ 2 కక్ష్య నుండి ల్యాండర్ వేరు అయిన రోజే విలేకరిగా అడుగుపెట్టిన సాదియా, కేరళ రాష్ట్రం నుండి వచ్చిన మొదటి ట్రాన్స్ జెండర్ జర్నలిస్ట్. "చవక్కాడ్ ప్రాంతం నుండి వచ్చిన సాదియా చంద్రయాన్ 2 ల్యాండర్, 'విక్రమ్', కక్ష్య నుండి విజయవంతంగా విడిపోయిన క్షణంలో అద్భుతమైన రిపోర్టింగ్ ఇచ్చింది. చంద్రయాన్ 2 ల్యాండర్ కక్ష్య నుండి వేరు అయిన సందర్భంలో సాదియా ఇచ్చిన రిపోర్టింగ్ అందరినీ ఆకర్షించింది. కేరళ ఆరోగ్య మంత్రి కెకె శైలజ ఫేస్‌బుక్‌లో సాదియాను అభినందించారు . ఒక ట్రాన్స్ జెండర్ చేసిన రిపోర్టింగ్ చాలా బాగుందన్నారు. సాదియా భారతీయులందరికీ గర్వకారణం అన్నారు.

ట్రాన్స్ జెండర్ సమాజానికి సాదియా ఒక ప్రేరణ అని కొనియాడిన కేరళ మంత్రి శైలజ

ట్రాన్స్ జెండర్ సమాజానికి సాదియా ఒక ప్రేరణ అని కొనియాడిన కేరళ మంత్రి శైలజ

ఆమె కేరళకు చెందిన మొదటి ట్రాన్స్ జెండర్ జర్నలిస్ట్, "అని శైలజ పేర్కొన్నారు. మిగతా హిజ్రాలకు, ట్రాన్స్ జెండర్ సమాజానికి సాదియా ఒక ప్రేరణ అని అన్నారు. దీంతో ట్రాన్స్ జెండర్ ల పట్ల సమాజంలో వివక్ష లేదని భావిస్తున్నానని మంత్రి శైలజ పేర్కొన్నారు. హిజ్రాలు, ట్రాన్స్ జెండర్ లు ఏ రాష్ట్రంలో అయినా రైళ్ళలో భిక్షాటన చెయ్యటానికే పరిమితం అని భావిస్తున్న తరుణంలో ఇలా ఒక ట్రాన్స్ జెండర్ మీడియాలో స్థానం దక్కించుకుని సమర్ధవంతంగా పని చెయ్యటం మిగతా ట్రాన్స్ జెండర్ ల సమాజానికి ప్రేరణ. ట్రాన్స్ జెండర్ లలో చాలా మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు. అవకాశాలు ఎవరూ ఇవ్వక తమ పరిస్థితి దారుణంగా ఉందని బాధ పడే వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే సమాజంలో మార్పు వస్తుందని సాదియా ను చూస్తే అర్ధం అవుతుంది.

ప్రజలు హిజ్రాలకు సమాజంలో స్థానం ఇవ్వటం సంతోషంగా ఉందన్న సాదియా

ప్రజలు హిజ్రాలకు సమాజంలో స్థానం ఇవ్వటం సంతోషంగా ఉందన్న సాదియా

ఇక సాదియా తన మొదటి నియామకంగా, ఆగస్టు 31 న మలయాళ న్యూస్ ఛానల్ కైరాలి న్యూస్ టివిలో లాంఛనంగా చేరిన సాదియా చంద్రయాన్ -2 అభివృద్ధిపై జర్నలిస్ట్ గా తన మొదటి రిపోర్ట్ అందించింది . తరువాత రోజు సాదియా, ప్రజలు లెస్బియన్, గే, ద్విలింగ, ట్రాన్స్‌జెండర్ మరియు క్వీర్ కమ్యూనిటీకి సంబంధించిన వారికి కూడా సమాజంలో స్థానం ఇవ్వటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. "త్రివేండ్రం ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం నుండి ఎలక్ట్రానిక్ మీడియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు తరువాత, కైరాలి టివి లో ఇంటర్న్ షిప్ చేస్తున్నారు సాదియా . ఒక వారం పాటు ఇంటర్న్ షిప్ చేసిన తరువాత, నా పనితీరును అంచనా వేసిన సదరు మీడియా కంపెనీ నాకు ‘న్యూస్ ట్రైనీ' పోస్టును ఇచ్చింది, "అని సాదియా చెప్తోంది .

 తన తల్లిదండ్రులు తను ఏం చేస్తున్నానో చూడాలని కోరుకుంటున్నానన్న సాదియా

తన తల్లిదండ్రులు తను ఏం చేస్తున్నానో చూడాలని కోరుకుంటున్నానన్న సాదియా

మీడియా తనకు రెండవ ఇల్లు అనిపిస్తుందని , భవిష్యత్తులో హిజ్రాల కమ్యూనిటీకి మరింత వర్క్‌స్పేస్‌ లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తుంది. సాదియా , . 18 ఏళ్ళ వయసులో ఇంటి నుంచి వెళ్లిన సాదియా, తనను అంగీకరించడానికి నిరాకరించిన తల్లిదండ్రులపై తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవని చెప్పి తానెన్నో సమస్యలను తట్టుకుని నిలబడ్డానని పేర్కొంది. అయితే తాను ప్రస్తుతం ఏమి చేస్తున్నానో తన తల్లిదండ్రులు చూడాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపింది.

English summary
Heidi Saadiya, who formally joined Malayalam news channel Kairali News TV on August 31, made her debut with her reportage on Chandrayaan-2 development.Kerala’s First Transwoman Broadcast Journalist Saadiya Makes Her Debut with Chandrayaan-2 Reportage
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X