వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘తొలుత భారతీయుడ్ని’: సల్మాన్‌పై శివసేన పత్రిక ‘సామ్నా’ ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు సల్మాన్ ఖాన్‌పై శివసేన పార్టీ అధికారిక పత్రిక సామ్నా ప్రశంసల వర్షం కురిపించింది. కృష్ణ జింకలను వేటాడిన కేసులో జోథ్‌పూర్ కోర్టుకు హాజరైన సల్మాన్.. తాను తొలుత భారతీయుడినని చెప్పడాన్ని సామ్నా కొనియాడింది.

కోర్టు కుల, మతపరమైన గుర్తింపును ప్రశ్నించగా.. సల్మాను తాను మొదట చివర భారతీయుడినని, హిందూ ముస్లింనని తెలిపారని సామ్నా కార్యనిర్వాహక సంపాదకుడు సంజయ్ రౌత్ గురువారం రాసిన తన వ్యాసంలో పేర్కొన్నారు.

Saamna toasts Salman for ‘I am Indian’ retort

తన తండ్రి ముస్లిం అని, తన తల్లి హిందువు అని సల్మాన్ వివరించినట్లు తెలిపారు. జోథ్‌పూర్ న్యాయస్థానం అడిగిన ప్రశ్నకు సల్మాన్ ఖాన్ సరైన సమాధానం ఇవ్వకపోయినా, భారతీయుడినని గట్టిగా చెప్పాడని, అందుకు అభినందిస్తున్నామని రౌత్ చెప్పారు.

కాగా, సల్మాన్ ఖాన్ కుటుంబానికి శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధినేత రాజ్‌థాక్రేలతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఇది ఇలా ఉండగా బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఫ్లాట్‌కు వెళ్లిన రాజ్ థాక్రే.. సల్మాన్, అతని తండ్రిని కలిసి పరామర్శించారు.

English summary
Saamna has heaped praise on Salman Khan for calling himself an Indian while deposing in the Jodhpur sessions court recently in the blackbuck shooting case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X