హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sabarimala: శబరిమలలో సంక్రాంతి రోజు ఎంతమందికి అయ్యప్ప దర్శనం, పక్కాక్లారిటీ, జ్యోతి దర్శనం!

|
Google Oneindia TeluguNews

శబరిమల/ సంక్రాంతి/ హైదరాబాద్: హిందువులు ఎంతగానో భక్తిశ్రద్దలతో పవిత్రంగా పూజించే శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే అయ్యప్ప భక్తులకు శబరిమల అయ్యప్పస్వామి ఆలయం కమిటి నిర్వహకులు పక్కా సమాచారం ఇచ్చారు. శబరిమలలో మకరవిలక్కు ప్రత్యేక పూజలకు, సంక్రాంతి పండుగ రోజు, అయ్యప్పస్వామి జ్యోతి దర్శం ఇచ్చే రోజుకూడా ముందుగా అనుమతి తీసుకున్న అయ్యప్పస్వామి భక్తులకు మాత్రమే అవకాశం ఇస్తామని, ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకోని అయ్యప్పస్వామి భక్తులు శబరిమలలో ప్రవేశించడానికి ఎలాంటి అవకాశం లేదని శబరిమల ఆలయ కమిటీ బోర్డు అధ్యక్షుడు వాసు తేల్చి చెప్పారు. మకరవిలక్కు సందర్బంగా అనుమతి లేని ఏ ఒక్క భక్తుడు సన్నిధానంలోకి ప్రవేశించడానికి అవకాశం లేదని TBD అధికారులు స్పస్టం చేశారు.

Recommended Video

#SabarimalaTemple: కేరళలో భక్తుల సంఖ్య పెంచాలని నిర్ణయం ... మకరవిలక్కు పూజకు 5 వేలమందికి అనుమతి !

Sabarimala: శబరిమలలో తంక-అంకికి శ్రీకారం, అయ్యప్ప నగలు ఊరేగింపు, జీవితం ధన్యం, భక్తులకు!Sabarimala: శబరిమలలో తంక-అంకికి శ్రీకారం, అయ్యప్ప నగలు ఊరేగింపు, జీవితం ధన్యం, భక్తులకు!

పవిత్రమైన మకరవిలక్కు యాత్ర

పవిత్రమైన మకరవిలక్కు యాత్ర

కేరళలోని శబరిమలలో మకరవిలక్కు పండుగ ఉత్సవాలు మొదలైనాయి. 2021 జనవరి 19వ తేదీ వరకు మకరలవిలక్కు యాత్ర జరుగుతుంది. ఇప్పటికే శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి అయ్యప్పస్వామి భక్తులు కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు.

ఆన్ లైన్ రిజర్వేషన్

ఆన్ లైన్ రిజర్వేషన్

మకరవిలక్కు యాత్రకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం అనేక నియమాలు విధించింది. భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన అయ్యప్పస్వామి భక్తులు ఇప్పటికే శబరిమలలో మకరవిలక్కు ఉత్సవం రోజు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ఆన్ లైన్ లో టిక్కెట్లు రిజర్వు చేసుకున్నారు.

 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భక్తులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భక్తులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రతో సహ దేశంలోని వివిద రాష్ట్రాలకు చెందిన అయ్యప్పస్వామి భక్తులు మకరవిలక్కు (సంక్రాంతి) పండుగ రోజు శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకుని జ్యోతి దర్శనం చేసుకోవడానికి ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకుని ఆరోజు శబరిమలకు వెళ్లడానికి సిద్దం అయ్యారు.

అనుమతి లేకుంటే నోచాన్స్

అనుమతి లేకుంటే నోచాన్స్

సంక్రాంతి పండుగ రోజు శబరిమలకు వెళ్లడానికి అవకాశం చిక్కని అయ్యప్పస్వామి భక్తులు కొంత నిరాశ చెందుతున్నారు. ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రమే మకరవిలక్కు పండుగ సందర్బంగా శబరిమలకు రావాలని, టిక్కెట్లు బుక్ చేసుకోని వారు ఎవ్వరూ శబరిమలకు రాకూడదని, శబరిమలకు వచ్చి ఇబ్బందులకు గురి కాకూడదని శబరిమల ఆలయ కమిటీ బోర్డు అధ్యక్షుడు వాసు అయ్యప్పస్వామి భక్తులకు మనవి చేశారు.

భక్తుల సంఖ్యపై పక్కా క్లారిటీ

భక్తుల సంఖ్యపై పక్కా క్లారిటీ

మకరవిలక్కు ఉత్సవాల సందర్బంగా శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్యను ఇప్పటికే 5,000కు పెంచారు. అయితే మకరవిలక్కు యాత్రలో ముఖ్యమైన సంక్రాంతి (2020 జనవరి 14వ తేదీ) రోజు 5 వేల మంది భక్తుల కంటే ఏ ఒక్కరు అక్కడికి ప్రవేశించడానికి అవకాశం ఇవ్వడం లేదని, ఆరోజుకూడా 5 వేల మంది మాత్రమే అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి అవకాశం ఇస్తున్నామని శబరిమల దేవాలయం ఆలయ కమిటీ బోర్డు అధ్యక్షుడు ఎన్. వాసు పక్కా క్లారిటీ ఇచ్చారు.

కఠిన నియమాలు పాటించాలి

కఠిన నియమాలు పాటించాలి

శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానం ప్రధాన అర్చకుడితో పాటు ఆరు మంది అర్చకులు, సన్నిధానంలో 37 మందికి కరోనా పాజిటివ్ రావడంతో శబరిమల ఆయలం బోర్డు అధికారులు అలర్ట్ అయ్యారు. శబరిమలకు వెలుతున్న అయ్యప్పస్వామి భక్తులు ప్రతి ఒక్కరికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు ఎవరికైనా ఉంటే కచ్చితంగా వారిని వెంటనే క్వారంటైన్ ఐసోలేషన్ వార్డులకు పంపిస్తున్నామని. శబరిమలో ముందుకంటే ప్రస్తుతం కరోనా పరీక్షలు కఠినతరం చేశామని TDB అధికారులు చెప్పారు.

English summary
Sabarimala: The Travancore Devaswom Board has informed that only 5,000 pilgrims will be allowed at the Lord Ayyappa temple here for darshan on January 14, the Makaravilakku festival day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X