వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sabarimala: నిన్న రోజుకు రూ. 3. 5 కోట్లు ఆధాయం, నేడు రూ. 10 లక్షలు, ప్రభుత్వం వింతనియమాలు!

|
Google Oneindia TeluguNews

శబరిమల/ కొచ్చి, పంపా: శబరిమలలోని అయప్పస్వామిని దర్శించుకునే అయ్యప్పస్వామి భక్తుల సంఖ్య కేరళ ప్రభుత్వం ఊహించనిదానికంటే చాలా తక్కువ సంఖ్యకు చేరుకుంది. కేరళ ప్రభుత్వం తీసుకున్ని వింతనియమాలు, వింతపొకడల నిర్ణయాలతో శబరిమలకు వెళ్లడానికి సిద్దం అయిన అయ్యప్ప భక్తులు స్థానిక అయ్యప్ప ఆలయాల్లోనే ప్రత్యేక పూజలు నిర్వహించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. గతంలో శబరిమల దేవస్థానం బోర్డుకు గతంలో ప్రతిరోజూ రూ. 3. 5 కోట్లు ఆధాయం వచ్చేదని, ఇప్పుడు రోజుకు రూ. 10 లక్షల ఆధాయం కూడా రావడం లేదని శబరిమల ఆయలం బోర్డు అధికారులు అంటున్నారు.

Recommended Video

#SabarimalaTemple : అయ్యప్ప స్వామి ఆలయంలో కొత్త ఆంక్షలతో బోసిపోతోన్న శబరి గిరులు...!

Sabarimala: కేరళ ప్రభుత్వం దివాళా తీసిందా ?, రూ. 7 లక్షలు లేవా ?, ఆయుర్వేదం, స్వామియే శరణమయ్యప్ప!Sabarimala: కేరళ ప్రభుత్వం దివాళా తీసిందా ?, రూ. 7 లక్షలు లేవా ?, ఆయుర్వేదం, స్వామియే శరణమయ్యప్ప!

అయ్యప్ప భక్తులకు లేనిపోని నియమాలు

అయ్యప్ప భక్తులకు లేనిపోని నియమాలు

కేరళలోని పశ్చిమ కనుమల్లో కొలువైన శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం నవంబర్ నెల నుంచి జనవరి మూడో వారం వరకు కొన్ని లక్షల మంది అయ్యప్ప భక్తులు కఠిన దీక్షలు చేపట్టి స్వామిని దర్శనం చేసుకోవడానికి శబరిమలకు వెలుతుంటారు. COVID-19 నియమాలు అంటూ కేరళ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అయ్యప్ప భక్తులకు అనేక నియమ నిబంధనలు జారీ చేసింది.

స్థానిక అయ్యప్ప ఆలయాలకు భక్తులు

స్థానిక అయ్యప్ప ఆలయాలకు భక్తులు

కేరళ ప్రభుత్వం జారీ చేసిన నియమ నిబంధనలు పాటించాలంటే అయ్యప్ప భక్తులు చాలా మందికి సాధ్యం కావడంలేదు. కొన్ని అనుమతులు ఆన్ లైన్ లో తీసుకోవడానికి అవకాశం ఉండటంతో సామాన్య భక్తులు అలాంటి అనుమతులు తీసుకోవడానికి నానా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వసోంది. ఇలాంటి సమయంలో అయ్యప్ప ధీక్ష చేపట్టిన అయ్యప్ప భక్తులు వారివారి రాష్ట్రాల్లోని అయ్యప్పస్వామి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి దీక్షను విరమించుకుంటున్నారు.

రూ. 3. 5 కోట్ల నుంచి రూ. 10 లక్షలకు పడిపోయిన ఆధాయం

రూ. 3. 5 కోట్ల నుంచి రూ. 10 లక్షలకు పడిపోయిన ఆధాయం

అయ్యప్పస్వామి భక్తులకు అనేక నియమాలు విధించడంతో అయ్యప్పమాల వేసుకుని శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్యల చాలా తగ్గిపోయింది. నవంబర్ నెల నుంచి జనవరి మూడో వారం వరకు కొన్ని లక్షల మంది శబరిమల చేరుకుని అయ్యప్పస్వామిని దర్శించుకుంటుంటారు. గతంలో ప్రతిరోజూ సరాసరి రూ. 3. 5 కోట్లు దేవస్థానం బోర్డుకు ఆధాయం ఉండేది. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇప్పటి వరకు ప్రతిరోజు సరాసరి రూ. 10 లక్ష్లల కన్నా తక్కువగానే దేవాలయానికి ఆధాయం వస్తోందని వెలుగు చూసింది.

రెండు రోజుల్లో రూ. 18 లక్షలు మాత్రమే

రెండు రోజుల్లో రూ. 18 లక్షలు మాత్రమే

అయ్యప్పస్వామి మండలపూజ ప్రారంభం అయిన సీజన్ రెండు రోజుల్లో దేవాలయానికి కేవలం రూ. 18 లక్షల ఆధాయం మాత్రమే వచ్చిందని ఆలయ బోర్డు కమిటీ చెప్పిందని మలయాళం మీడియా తెలిపింది. మొత్తం మీద ప్రతిరోజు 5 వేల మంది అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లడానికి అవకాశం ఇస్తే ఇటు భక్తులు, ఆలయ కమిటి బోర్డుకు లాభం ఉంటోందని అయ్యప్ప భక్తులు, ఆలయ కమిటి బోర్డు నిర్వహకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని మలయాళం మీడియా తెలిపింది. మొత్తం మీద ఇకనైనా కేరళ ప్రభుత్వం తీరు మార్చుకుంటుందని అయ్యప్ప భక్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

English summary
Sabarimala Ayyappa Deeksha: Kerala Travancore Devaswom Board Services at Sabarimala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X