వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sabarimala: కళ్లు తెరిచిన ప్రభుత్వం, రూ. 20 కోట్లు విడుదల, కుంటిసాకులతో భక్తులకు ఇబ్బంది, లక్ష మంది!

|
Google Oneindia TeluguNews

శబరిమల/ పందలం/ కొచ్చి: భారతదేశంలోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య దాదాపు తగ్గిపోవడంతో దేవస్వం బోర్డుకు ఆధాయం రావడం లేదు. ఇదే సమయంలో ఇంతకాలం శబరిమల దేవస్వం బోర్డు గురించి పట్టించుకోని కేరళ ప్రభుత్వం ఇప్పుడు కళ్లు తెలిరిచినట్లు ఉంది. శబరిమల ఆయలం నిర్వహణ కోసం, మకరవిలక్కు పండుగ నిర్వహణ కోసం కేరళ ప్రభుత్వం రూ. 20 కోట్లు విడుదల చేసింది. కేరళ ప్రభుత్వం కుంటిసాకులతో అయ్యప్పస్వామి భక్తులు ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Sabarimala: అయ్యప్పస్వామితో పెట్టుకుని అడ్రస్ లేకుండా పోయారు, పందలం బీజేపీ వశం, తిక్క కుదిరింది!Sabarimala: అయ్యప్పస్వామితో పెట్టుకుని అడ్రస్ లేకుండా పోయారు, పందలం బీజేపీ వశం, తిక్క కుదిరింది!

ఇప్పటికి లక్ష మంది రాలేదు

ఇప్పటికి లక్ష మంది రాలేదు

కరోనా వైరస్ సాకుతో శబరిమలకు వెళ్లే భక్తులను దాదాపుగా తగ్గించేశారు. ప్రతి సంవత్సరం ఇదే సమయానికి శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి వెళ్లేవాళ్లు అయితే ఈ సారి డిసెంబర్ 21వ తేదీ సోమవారం వరకు లక్ష మంది భక్తులు కూడా శబరిమలకు వెళ్లలేకపోయారు.

దెబ్బకు కళ్లు తెరిచిన ప్రభుత్వం

దెబ్బకు కళ్లు తెరిచిన ప్రభుత్వం

ఈ దెబ్బతో ప్రతి ఏడాది శబరిమలకు వచ్చే కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడిందని శబరిమల దేవస్వం బోర్డు అధికారులు అంటున్నారు. ఈ ఏడాది శబరిమలలో పని చేసే వివిద శాఖల ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎదురైయ్యింది. ఇప్పటికే శబరిమలను ఆదుకోవాలని దేవస్వం బోర్డు నిర్వహకులు కేరళ ప్రభుత్వానికి పదేపదే మనవి చేశారు. పందలం మునిసిపాలిటీ చెయ్యి దాటిపోయిందనే షాక్ లో ఉన్న కేరళ ప్రభుత్వం ఇప్పుడు కళ్లు తెరించింది.

ఇచ్చామంటే ఇచ్చాం అనే సామెత ?

ఇచ్చామంటే ఇచ్చాం అనే సామెత ?

శబరిమల ఆలయ నిర్వహణ కోసం, మకరవిలక్కు పండుగ నిర్వహణ కోసం సోమవారం కేరళ ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేసింది. ఆరు నెలల కాలంలో కేరళ ప్రభుత్వం ఇంతకు ముందు కేవలం రూ. 30 కోట్లు, ఇప్పుడు రూ. 20 కోట్లు శబరిమల నిర్వహణ కోసం విడుదల చేసింది. త్వరలో మకరవిలక్కు, అయ్యప్పస్వాములు మకరజ్యోతి యాత్ర మొదలు కానున్న సందర్బంగా రూ. 20 కోట్లు విడుదల చేసింది.

అయ్యప్ప భక్తుల మకరజ్యోతి యాత్ర

అయ్యప్ప భక్తుల మకరజ్యోతి యాత్ర

జనవరి 18వ తేదీ వరకు అయ్యప్పస్వాముల మకర జ్యోతి యాత్రకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద పందలం మునిసిపాలిటిలో ఘోరపరాజయం చవిచూసిన తరువాత త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అయినా పరువు కాపోవడుకోవడానికి కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు.

English summary
Sabarimala: Kerala government has sanctioned Rs. 20 crore for Travancore Devaswam Board to conduct Makaravilakku festival at Sabarimala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X