వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sabarimala: కంటోన్మెంట్ జోన్ లోకి శబరిమల ?, ఆరు మంది అర్చకులు, సన్నిధానంలో 37 మందికి కరోనా !

|
Google Oneindia TeluguNews

శబరిమల/ పంపా/ కొచ్చి: శబరిమల మకరవిలక్కు ఉత్సవాలకు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు (TDB) సర్వం సిద్దం చేస్తోంది. ఇప్పటికే శబరిమలలో మకరవిలక్కు పూజలు మొదలైనాయి. శబరిమల ఆలయంలో ప్రధాన అర్చకుడితో పాటు ఆయన ఆరు మంది సహాయకులకు కోవిడ్ పాజిటివ్ రావడంతో అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. శబరిమల అర్చకులతో పాటు సన్నిధానంలో 37 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్ లోకి తీసుకురావాలా ? లేదా ? అనే విషయంపై దేవస్వం బోర్డు అధికారులు చర్చిస్తున్నారని తెలిసింది.

Recommended Video

Sabarimala : కరోనా నెగిటివ్ ఉంటేనే శబరిమల దర్శనానికి అనుమతి!

Sabarimala: అయ్యప్పకు 453 సవర్ల బంగారు నగలతో అలంకరణ, భక్తులకు నో చాన్స్, మండల పూజ రోజు!Sabarimala: అయ్యప్పకు 453 సవర్ల బంగారు నగలతో అలంకరణ, భక్తులకు నో చాన్స్, మండల పూజ రోజు!

శబరిమల ప్రధాన అర్చకుడు

శబరిమల ప్రధాన అర్చకుడు

శబరిమల ప్రధాన అర్చకుడు (చీఫ్) వికే. జయరాజ్ హోట్టేతో సహ ఆయన ఆరు మంది సహాయకులకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్ వచ్చిన ముగ్గురితో ఈ అర్చకులు టచ్ లోకి రావడం వలనే వారికి కరోనా వైరస్ సోకిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది. శబరిమల ప్రధాన అర్చకుడు వికే. జయరాజ్ తో పాటు ఆయన సహాయకులు ప్రస్తుతం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారని శబరిమల దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు.

అర్చకులు అందరికీ కరోనా పరీక్షలు

అర్చకులు అందరికీ కరోనా పరీక్షలు

శబరిమల సన్నిధానంలో పని చేస్తున్న ప్రధాన అర్చకులతో పాటు ఆరు మంది అర్చకులకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసిన వెంటనే సన్నిధానంలో పని చేస్తున్న అర్చకులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించామని శబరిమల దేవస్వం బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో అయ్యప్పస్వామి భక్తులతో టచ్ లో ఉన్న అర్చకులు, అక్కడి సిబ్బందికి కచ్చితంగా ఎప్పటికప్పుడు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని శబరిమల దేవస్వం బోర్డు అధికారులు నిర్ణయించారు.

కంటోన్మెంట్ జోన్ లోకి శబరిమల ?

కంటోన్మెంట్ జోన్ లోకి శబరిమల ?

శబరిమల సన్నిధానంలో ప్రధాన అర్చకుడితో పాటు అర్చకులకు వంట చేసే అర్చకుడు ఆయన సహాకులకు కోవిడ్ పాజిటివ్ రావడంతో అధికారులు హడలిపోయారు. పవిత్ర పుణ్యక్షేత్రం, అయ్యప్ప భక్తుల యాత్ర కొనసాగుతున్న సందర్బంలో శబరిమల సన్నిధానం ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్ లో పెట్టాలా ? వద్దా ? అనే విషయం దేవస్వం బోర్డు అధికారులు చర్చిస్తున్నారు.

అయ్యప్ప భక్తులకు హామీ

అయ్యప్ప భక్తులకు హామీ

శబరిమలలో అయ్యప్ప భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తామని, శబరిమలలో కోవిడ్ వ్యాధి వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, మకరవిక్కు ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూస్తామని శబరిమల దేవస్వం బోర్డు అధికారులు అంటున్నారు.

English summary
Sabarimala: Health Department in Kerala said they have received recommendation to declare Sabarimala pilgrimage area as containment zone after Covid surge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X