వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sabarimala:అయప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెబుతాం, సీఎం ఆలోచిస్తున్నారు, కేరళ మంత్రి సురేంద్రన్ క్లారిటీ

|
Google Oneindia TeluguNews

శబరిమల/ పతనంపట్టి/ కొచ్చి: శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. పశ్చిమ కనుమల్లోని పావన పంపా నదీ తీరాన శబరిగిరుల్లో కొలువైన అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ 5 వేల మందికి అవకాశం ఇచ్చే విషయంలో ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని, అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెబుతామని కేరళ దేవస్వం శాఖా మంత్రి కడకంపల్లి సురేంద్రన్ స్పష్టం చేశారు.

శబరిమలలో అయప్పస్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ 5 వేల మంది అయ్యప్ప భక్తులకు అవకాశం ఇవ్వాలని ఇటీవల శబరిమల ఆలయ కమిటీ బోర్డు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు మనవి చేసింది.

Sabarimala: కేరళ ప్రభుత్వం దివాళా తీసిందా ?, రూ. 7 లక్షలు లేవా ?, ఆయుర్వేదం, స్వామియే శరణమయ్యప్ప!Sabarimala: కేరళ ప్రభుత్వం దివాళా తీసిందా ?, రూ. 7 లక్షలు లేవా ?, ఆయుర్వేదం, స్వామియే శరణమయ్యప్ప!

అయ్యప్ప భక్తుల సంఖ్య చాలా తగ్గింది

అయ్యప్ప భక్తుల సంఖ్య చాలా తగ్గింది

పశ్చిమ కనుమల్లోని పావన పంపా నదీ తీరాన శబరిగిరుల్లో కొలువైన అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య ప్రతిఏడాది పెరుగుతూనే ఉంటుంది, అయితే ప్రస్తుత కరోనా వైరస్ దెబ్బకు అయ్యప్ప భక్తుల సంఖ్య చాలా తగ్గిపోయింది. కేరళ ప్రభుత్వం COVID-19 నియమ నిబంధనలు అంటూ అయ్యప్ప భక్తులకు అనేక నియమాలు విధించడం భక్తుల సంఖ్య తగ్గిపోవడానికి మరో ప్రధాన కారణం అయ్యింది.

ఇంత తక్కువ మందికి అవకాశమా!

ఇంత తక్కువ మందికి అవకాశమా!

కరోనా వైరస్ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు వెయ్యి మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి అనుమతి ఇస్తున్నారు. శనివారం, ఆదివారం రోజుల్లో రెండు వేల మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ఆలయ కమిటి నిర్వహకులు, కేరళ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అయితే గతంలో ప్రతిరోజు వేల సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకుని స్వామివారిని దర్శించుకునే వాళ్లు.

అవకాశం ఇవ్వండి

అవకాశం ఇవ్వండి

శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు గతంలో ఉన్న నియమాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. కరోనా వైరస్ మహమ్మారి వ్యాపించుకుండా కేరళ ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. మండలపూజ, మకరవిలక్కం సీజన్ ప్రారంభం అయిన సందర్బంగా పరిమితి సంఖ్యలో శబరిమలలోకి అయ్యప్పస్వామి భక్తులను అనుమతి ఇస్తున్నారు. ఎకువ మంది అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఇవ్వాలని, అందుకు తగ్గట్లు తాము ఏర్పాట్లు చేశామని శబరిమల దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్. వాసు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు మనవి చేశారు.

భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాము

భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాము

అయ్యప్ప భక్తులకు నీలక్కల్, పంపా, శబరిమలలోని అయ్యప్పస్వామి సన్నిధానంలో అయ్యప్ప భక్తులు బస చెయ్యడానికి ఎక్కువ అవకాశం ఉందని శబరిమల అయ్యప్పస్వామి బోర్డు కమిటీ అంటోంది. అయ్యప్ప భక్తులకు వైద్యసేవలు అందించడానికి నీలక్కల్, పంపా, సన్నిధానంలో అన్ని ఏర్పాట్లు చేశామని, ఐపీయూ, ఫార్మసీ, వెంటిలేటర్, ఆర్థో, కార్డియాలజీ తదితర సేవలు, సదుపాయాలు అన్నీ ఉన్నాయని, అందువలన అయ్యప్పభక్తులు ప్రతిరోజు 5 వేల మంది స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఇవ్వాలని దేవస్థానం బోర్డు అధ్యక్షుడు వాసు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు మనవి చేశారు.

Recommended Video

#SabarimalaTemple : సరికొత్త నిబంధనలతో.. భక్తుల కోసం తెరుచుకోనున్న Sabarimala ఆలయ తలుపులు!
కేరళ మంత్రి క్లారిటి

కేరళ మంత్రి క్లారిటి

శబరిగిరుల్లో కొలువైన అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ 5 వేల మందికి అవకాశం ఇచ్చే విషయంలో ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కేరళ దేవస్వం శాఖా మంత్రి కడకంపల్లి సురేంద్రన్ స్పష్టం చేశారు. ఇప్పటికే దేవస్వం బోర్డు కమిటీ సభ్యులు ప్రభుత్వానికి చేసిన మనవి పరిశీలనలో ఉందని, ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటారని మంత్రి కడకంపల్లి సురేంద్రన్ స్థానిక మీడియాకు చెప్పారు.

English summary
Sabarimala: Kerala minister Kadakampally Surendran said that the admission of 5,000 pilgrims per day is under consideration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X