చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sabarimala:అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, శబరిమలలో పడిపూజలు పొడగింపు, మిస్ అయితే సమాచారం!

|
Google Oneindia TeluguNews

శబరిమల/ పంబా/ కేరళ: శబరిమలకు అయ్యప్పస్వామి భక్తులు పోటెత్తుతున్నారు. అయ్యప్పస్వామి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోవడంతో అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి వ్యాధి వ్యాపించకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శబరిమలలో పడిపూజలు, ఉదయాస్థాన పూజలు ఐదు రోజులు నిర్వహించాలని అధికారులు మొదట నిర్ణయించారు. అయ్యప్ప స్వామి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో పడి పూజలు, ఉదయాస్థాన పూజలు ఎక్కువ రోజులు జరిపించాలని, ముందు తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని మార్పులు చెయ్యాలని శబరిమల ఆలయ కమిటీ నిర్వహకులు నిర్ణయించారు.

Sabarimala: కేరళ ప్రభుత్వం దివాళా తీసిందా ?, రూ. 7 లక్షలు లేవా ?, ఆయుర్వేదం, స్వామియే శరణమయ్యప్ప!Sabarimala: కేరళ ప్రభుత్వం దివాళా తీసిందా ?, రూ. 7 లక్షలు లేవా ?, ఆయుర్వేదం, స్వామియే శరణమయ్యప్ప!

మలయాళ మాసం

మలయాళ మాసం

శబరిమలకు అయ్యప్పస్వామి భక్తుల తీర్థయాత్ర మొదలైయ్యింది. సాధారణంగా మలయాళ మాసంలో శబరిమలలో ఐదు రోజులు మాత్రమే పడిపూజ, ఉదయాస్థాన పూజలు నిర్వహిస్తారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి వ్యాపించకుండా చూడటానికి, అయ్యప్ప భక్తులు నిరాశ చెందకుండా ఉండటానికి పడిపూజలు, ఉదయాస్థాన పూజలు వీలైనంత ఎక్కువగా నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్వహకులు నిర్ణయించారని మలయాళం మీడియా తెలిపింది.

పూజలలో మార్పులు

పూజలలో మార్పులు

శబరిమలలో డిసెంబర్ 15 వరకు ప్రతిరోజూ పడిపూజ, ఉదయాస్థాన పూజలు నిర్వహిస్తారు. కరోనా వైరస్ కారణంగా అయ్యప్పస్వామి భక్తులకు అనేక నియమ నిబంధనలు విధించారు. ఈ కారణంగా పడిపూజ, ఉదయాస్థాన పూజలు డిసెంబర్ 31 నుంచి జనవరి 10వ తేదీ వరకు, తరువాత జనవరి 15 నుంచి జనవరి 19వ తేదీ వరకు నిర్వహించాలని శబరిమల ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుందని మలయాళం మీడియా తెలిపింది.

కరోనా కారణంగా భక్తులకు ఇబ్బందులు

కరోనా కారణంగా భక్తులకు ఇబ్బందులు

కరోనా వైరస్ కారణంగా అనుకున్న సమయానికి అయ్యప్పస్వామి భక్తులు శబరిమల చేరుకోవడానికి చిన్నచిన్న ఇబ్బందులు ఎదురౌతున్నాయని తెలిసింది. కరోనా వైరస్ కారణంగా శబరిమలలో మీనామాస పూజలు రద్దు చేయబడుతున్నాయి. పడిపూజ, ఉదయాస్థాన పూజలలో పాల్గొనడానికి ముందుగా పేర్లు నమోదు చేసుకున్న భక్తులు ఇప్పుడు వారు అనుకున్న సమయానికి గమ్యం చేరుకోలేకపోతున్నారని తెలిసింది.

Recommended Video

Tungabhadra Pushkaralu తుంగభద్ర పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.2.5 కోట్లు విడుదల....!! || Oneindia
భక్తులకు సమాచారం

భక్తులకు సమాచారం

పూజలు రద్దు అయిన తరువాత సంబంధిత భక్తులకు సమాచారం ఇవ్వడానికి అధికారులు సిద్దం అవుతున్నారు. సరైన సమయంలో గమ్యం చేరుకోలేని భక్తుల జాబితాను పరిశీలించి మళ్లీ వారు పూజలలో పాల్గొనేలా అవకాశం ఇవ్వాలా ? లేక ఏం చెయ్యాలి ? అని సంబంధిత అధికారులు ఆలోచిస్తున్నారని మలయాళం మీడియా తెలిపింది.

English summary
Sabarimala: Kerala Sabarimala Pilgrimage, Rituals in Sabarimala temple will be extended for more days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X