బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sabarimala: అయ్యప్ప సన్నిధానం ఖాళీ, 18వ దశాబ్దంలో ఒకసారి, ఆ మార్గంలో ఒక్క భక్తుడు రాలేదు, చాన్స్!

|
Google Oneindia TeluguNews

శబరిమల/ పతనంపట్టి/ కొచ్చి: శబరిమలలో అయ్యప్పస్వామి భక్తులతో ప్రతిరోజూ కిటకిటలాడే సన్నిధానంలో భక్తులు చాలా తక్కువ మంది కనపడుతున్నారు. ఇంతకాలం అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి పోటీ పడిన అయ్యప్ప భక్తులు ఇప్పుడు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకుని సన్నిధానంలో ప్రార్థనలు చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా అనేక నియమాలు అమలులోకి తీసుకురావడంతో అయ్యప్పస్వామి భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయితే ప్రతిఏడాది కొన్ని వేల మంది కాలినడకన వెళ్లే అయ్యప్పన్ రోడ్డులో ఇంత వరకు ఒక్క అయ్యప్పస్వామి భక్తుడు కూడా ఆ మార్గంలో వెళ్లలేదని అధికారులు అంటున్నారు.

Sabarimala: కేరళ ప్రభుత్వం దివాళా తీసిందా ?, రూ. 7 లక్షలు లేవా ?, ఆయుర్వేదం, స్వామియే శరణమయ్యప్ప!Sabarimala: కేరళ ప్రభుత్వం దివాళా తీసిందా ?, రూ. 7 లక్షలు లేవా ?, ఆయుర్వేదం, స్వామియే శరణమయ్యప్ప!

COVID-19 నియమాలు

COVID-19 నియమాలు

శబరిమలకు అయ్యప్పస్వామి భక్తుల తీర్థయాత్ర మొదలైన తరువాత ఎరిమేళి, పంబా, శబరిమల, పతనంపట్టి తదితర ప్రాంతాలు అయ్యప్పస్వామి భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రతిఏడాది కొన్ని లక్షల మంది అయ్యప్పస్వామి భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకుని వారి కోరికలు తీర్చమని దేవుడిని వేడుకుంటారు. కొవిడ్ -19 నియమాల కారణంగా ఇప్పుడు కేవలం కొన్ని వేల మంది మాత్రమే అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి భక్తులు వెలుతున్నారు.

 18వ దశాబ్దంలో ఒకసారి

18వ దశాబ్దంలో ఒకసారి

ప్రస్తుతం శబరిమల సన్నిధానం ఎన్నడూ లేని విధంగా ఖాళీగా దర్శనం ఇస్తోంది. 18వ దశాబ్దంలో ఒకసారి శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానంలో చాలా తక్కువ మంది భక్తులు ఉన్నటువంటి ఇలాంటి దృశ్యాలు చూశామని, ఇప్పుడు మరోసారి అలాంటి దృశ్యాలు చూస్తున్నామని పతనంపట్టిలోని స్థానికులు, అయ్యప్పస్వామి ఆలయలంలోని అర్చకులు అంటున్నారు.

ఆ మార్గంలో ఒక్క భక్తుడు రాలేదు

ఆ మార్గంలో ఒక్క భక్తుడు రాలేదు

అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ప్రతిఏడాది కొన్ని లక్షల మంది అయ్యప్ప భక్తులు దీక్ష చేపట్టి అటవి మార్గంలో నడుచుకుంటూ శబరిమల చేరుకుని స్వామివారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకుంటుంటారు. అలాంటిది కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ఈ ఏడాది సోమవారం వరకు అటవి మార్గంలో నడుచుకుంటూ అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ఒక్క భక్తుడు కూడా రాలేదని అయ్యప్పస్వామి ఆలయ కమిటి నిర్వహకులు అంటున్నారు.

శరణ ఘోషలు లేవు

శరణ ఘోషలు లేవు

అయ్యప్పస్వామి భక్తులు ధీక్ష చేపట్టి కఠిననియమాలు పాటించి అటవి మార్గంలో తలమీద ఇరుముడి పెట్టుకుని కాలినడకన స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణఘోషతో శబరిమల చేరుకుంటారు. అయితే ఈ ఏడాది కాలినడకన ఇంత వరకు అయ్యప్పస్వామి భక్తులు ఒక్కరుకూడా అలా వెళ్లకపోవడంతో ఆ ప్రాంతంలో శరణఘోషలు వినపడటం లేదని, ఇలాంటి సన్నివేశాలు తాము ఇంత వరకు చూడలేదని స్థానిక అధికారులు అంటున్నారు.

Recommended Video

#SabarimalaTemple : సరికొత్త నిబంధనలతో.. భక్తుల కోసం తెరుచుకోనున్న Sabarimala ఆలయ తలుపులు!
సన్నిధానంలో ఇదే పరిస్థితి

సన్నిధానంలో ఇదే పరిస్థితి

శబరిమలలోని అయ్యప్పస్వామి సన్నిధానంలో ఇంతకు ముందు ఎక్కువ సమయం అయ్యప్పస్వామి భక్తులు ఉండటానికి అవకాశం లేదు. ఇప్పుడు భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో అయ్యప్పస్వామి భక్తులు ఎక్కువ సమయం సన్నిధానంలో గడుపుతున్నారు. మా కోరికలు తీర్చు స్వామి అంటూ అయ్యప్పస్వామి భక్తులు స్వామివారిని వేడుకుంటూ ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుని వెనుతిరుగుతున్నారు.

English summary
Sabarimala: Sabarimala pilgrimage: No crowd seen in Sabarimala Temple due to COVID-19 spread.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X