వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sabarimala: శబరిమలలో హై అథారిటీ కమిటి భేటీ, హైకోర్టు అనుమతి ఇస్తే ఏం చెయ్యాలి, తేడా వస్తే ఇంటికి !

|
Google Oneindia TeluguNews

శబరిమల/ కొచ్చి/ పతనంమిట్ట: భారతదేశంలో ఎంతో పేరు పొందిన పుణ్యక్షేత్రం శబరిమలకు ఎక్కువ మంది భక్తులు వెళ్లడానికి అవకాశం వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు, చర్యలపై శబరిమలో హైఅథారిటీ కమిటి సమావేశం జరిగింది. శబరిమలకు ప్రతిరోజు 5, 000 మంది భక్తులను అనుమతించాలని కేరళ హైకోర్టు ఆదేశిస్తే అప్పుడు ఎలాంటి చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై చర్చించడానికి హై అథారిటీ సమావేశం నిర్వహించి చర్చించామని శబరిమల ఆలయం సీనియర్ అధికారి అరుణ్, శబరిమల స్పెషల్ పోలీసు ఆఫీసర్ ఎఎస్. రాజు అన్నారు. ఉద్యోగుల విషయంలో చిన్న తేడా వచ్చినా శబరిమల కొండను దింపి ఇంటికి పంపించాలని అధికారులు డిసైడ్ అయ్యారు.

Sabarimala: అయ్యప్పకు 453 సవర్ల బంగారు నగలతో అలంకరణ, భక్తులకు నో చాన్స్, మండల పూజ రోజు!Sabarimala: అయ్యప్పకు 453 సవర్ల బంగారు నగలతో అలంకరణ, భక్తులకు నో చాన్స్, మండల పూజ రోజు!

 శబరిమలలో వారానికి ఒకసారి

శబరిమలలో వారానికి ఒకసారి

శబరిమలలో జరిగిన హైఅథారిటీ కమిటీ సమావేశంలో అన్ని విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. శబరిమలలోని కోవిడ్ విజిలెన్స్ అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులకు అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు అందరూ సహకరించాలని హైఅథారిటీ కమిటీ ఆదేశించింది. శబరిమలలో పని చేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులు అందరికి వారానికి ఒకసారి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని హైఅథారిటీ కమిటీ తీర్మానించింది.

 చిన్నతేడా వచ్చినా కొండ దిగేయాలి

చిన్నతేడా వచ్చినా కొండ దిగేయాలి

శబరిమలలో ఉద్యోగం చేస్తూ సాటి ఉద్యోగులు, శబరిమలకు వచ్చి వెలుతున్న అయ్యప్పస్వామి భక్తులతో నిత్యం టచ్ లో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది అందరికి కచ్చితంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని శబరిమల హైఅథారిటీ కమిటీ నిర్ణయించింది. ఎవరికైనా కరోనా వైరస్ పాజిటివ్ అని తెలిస్తే కచ్చితంగా వారిని శబరిమల కొండ కిందకు పంపించేయాలని, వారు మళ్లీ విధులకు హాజరు కానివ్వకుండా చూడాలని శబరిమల దేవస్వం బోర్డు నిర్ణయించింది.

 టచ్ లో ఉంటే ఇంటికి

టచ్ లో ఉంటే ఇంటికి

కొన్ని రోజుల క్రితం శబరిమలలోని సన్నిధానంలోని డయాగ్నొస్టిక్ క్యాంపులో కొంత మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో టచ్ లో ఉన్నవారు, వారితో పరిచయం ఉన్న ఉద్యోగులను వెంటనే విధుల నుంచి తప్పించాలని శబరిమల ఆలయ కమిటీ నిర్వహకులు, శబరిమల దేవస్వం బోర్డు నిర్ణయించింది.

 కచ్చితంగా పాటించాలి..... వేరే మార్గం లేదు

కచ్చితంగా పాటించాలి..... వేరే మార్గం లేదు

కోవిడ్ విజిలెన్స్ అధికారులు, ఆరోగ్య శాఖ అధికారుల సూచనలు సలహాలు సాటి ఉద్యోగులు కచ్చితంగా పాటించాలని దేవస్వం బోర్డు నిర్వహకులు ఆదేశాలు జారీ చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో టచ్ లో ఉన్న వారు అందర్నీ సన్నిధానంలో విధుల నుంచి తప్పించాలని, ప్రస్తుతానికి వేరే మార్గం లేదని ఆలయ కమిటీ నిర్వహకులు తెలిపారు.

 నెయ్యి కోసం ప్రత్యేక కౌంటర్లు

నెయ్యి కోసం ప్రత్యేక కౌంటర్లు

శబరిమలకు వెలుతున్న భక్తుల సంఖ్య పరిమితం చెయ్యబడింది. శబరిమలకు అయ్యప్పస్వామి భక్తులు తీసుకువస్తున్న నెయ్యి (ఇరుముడిలోని నెయ్యి) సేకరించడానికి సన్నిధానంలోని ఉత్తర ప్రాంగంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. సన్నిధానం- మాలికపురం మార్గంలోని ఫ్లై ఓవర్ మీద అయ్యప్పస్వామి భక్తులు ఎక్కువ సమయం ఉండకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 నీటి నాణ్యత ఎలా ఉంది

నీటి నాణ్యత ఎలా ఉంది

శబరిమలకు సరఫరా అవుతున్న నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు. శబరిమలలో జరిగిన హైఅథారిటీ సమావేశంలో శబరిమల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సురేష్, డ్యూటీ మెజిస్ట్రేట్ మనోజ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపకుమార్, దేవస్వం బోర్డు అధికారులు, వివిద శాఖలకు చెందిన సీనియర్ అధికారులు సమావేశం అయ్యారని శబరిమల సీనియర్ అధికారి అరుణ్, స్పెషల్ పోలీసు ఆఫీసర్ ఎఎస్ రాజు తెలిపారు.

English summary
Sabarimala: Sabarimala: Even if 5000 people are allowed to visit, necessary steps will be taken, says High Authority Committee
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X