వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sabarimala: అయ్యప్ప భక్తులకు అవకాశం ఇవ్వండి, సీఎంకు మనవి, కోవిడ్ నియమాలు, దేవస్థానం బోర్డు !

|
Google Oneindia TeluguNews

శబరిమల/ పతనంతిట్ట/ కొచ్చి: శబరిమలలో అయ్యప్పస్వానిమి దర్శించుకోవడానికి ఎక్కువ మంది భక్తులకు అవకాశం కల్పించాలని శబరిమల దేవస్థానం బోర్డు నిర్వహణ కమిటి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు మనవి చేసింది. ప్రతిరోజు కనీసం 5, 000 మంది శబరిమలలో శ్రీ అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఆలయ కమిటి అధ్యక్షుడు ఎన్. వాసు కేరళ సీఎం పినరయి విజయన్ కు మనవి చేశారు. ప్రస్తుతం ప్రతిరోజు వెయ్యి మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి అనుమతి ఇస్తున్నారు. శనివారం, ఆదివారం రెండు వేల మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ఆలయ కమిటి నిర్వహకులు, కేరళ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

Sabarimala:అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, శబరిమలలో పడిపూజలు పొడగింపు, మిస్ అయితే సమాచారం!Sabarimala:అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, శబరిమలలో పడిపూజలు పొడగింపు, మిస్ అయితే సమాచారం!

 వెయ్యి మందికి అవకాశం

వెయ్యి మందికి అవకాశం

కరోనా వైరస్ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు వెయ్యి మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి అనుమతి ఇస్తున్నారు. శనివారం, ఆదివారం రోజుల్లో రెండు వేల మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ఆలయ కమిటి నిర్వహకులు, కేరళ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

 మకరవిలక్కు సీజన్

మకరవిలక్కు సీజన్

శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు గతంలో ఉన్న నియమాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. కరోనా వైరస్ మహమ్మారి వ్యాపించుకుండా కేరళ ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. మండలపూజ, మకరవిలక్కం సీజన్ ప్రారంభం అయిన సందర్బంగా పరిమితి సంఖ్యలో శబరిమలలోకి అయ్యప్పస్వామి భక్తులను అనుమతి ఇస్తున్నారు. ఎకువ మంది అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఇవ్వాలని, అందుకు తగ్గట్లు తాము ఏర్పాట్లు చేసుకుంటున్నామని శబరిమల దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్. వాసు అంటున్నారు.

 అన్నీ మేమే చూసుకుంటాం

అన్నీ మేమే చూసుకుంటాం

ప్రస్తుతం అయ్యప్ప భక్తులకు నీలక్కల్, పంపా, శబరిమలలోని అయ్యప్పస్వామి సన్నిధానంలో అయ్యప్ప భక్తులు బస చెయ్యడానికి ఎక్కువ అవకాశం ఉందని శబరిమల అయ్యప్పస్వామి బోర్డు కమిటీ అంటోంది. అకస్మికంగా ఎవైనా ప్రమాదాలు జరిగినా ప్రతిరోజు 24 గంటలు ( 24X7) వైద్యసేవలు అందించడానికి నీలక్కల్, పంపా, సన్నిధానంలో అన్ని ఏర్పాట్లు చేశామని, ఐపీయూ, ఫార్మసీ, వెంటిలేటర్, ఆర్థో, కార్డియాలజీ తదితర సేవలు, సదుపాయాలు అన్నీ ఉన్నాయని, అందువలన అయ్యప్పభక్తులు ఎక్కువ మంది స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఇవ్వాలని దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు మనవి చేశారు.

 కరోనా స్క్రీనింగ్ టెస్టులు

కరోనా స్క్రీనింగ్ టెస్టులు

పంపా నుంచి శబరిమల సన్నిధానం వరకు ఉన్న అయ్యప్పన్ రోడ్డులో ఇప్పటికే ఐదు అత్యవసర ఆసుపత్రులు ఏర్పాటు చేశామని, ఆక్సిజన్ సిలిండర్ లు అందుబాటులో ఉన్నాయని, ప్రతిరోజు వేకువ జామున 3 గంటల నుంచి 7 గంటల వరకు, మద్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు COVID-19 ప్రోట్ కాల్ ప్రకారం ముగ్గురు ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది భక్తులకు కరోనా స్క్రీనింగ్ టెస్టులు చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేశామని శబరిమల దేవస్థానం బోర్డు కేరళ ప్రభుత్వానికి వివరించింది.

 అయ్యప్ప భక్తుల కోసం

అయ్యప్ప భక్తుల కోసం

అయ్యప్పస్వామి భక్తులు భౌతికదూరం పాటించి శబరిమల చేరుకుని అయప్పస్వామిని దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కాలినడకన వెలుతున్న అయ్యప్ప భక్తులు దిగువ తిరుమట్టం, ఎగువ తిరుమట్టం, మాలికప్పురం, ప్రసాందం కౌంటర్లు, అన్నదానం కాంప్లెక్స్ తదితర చోట్ల సామాజిక దూరం పాటించే విధంగా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని శబరిమల ఆలయ కమిటీ బోర్డు అధ్యక్షుడు వాసు చెప్పారు.

Recommended Video

Sabarimala Temple Reopened : Covid Protocals And Other Details | Kerala || Oneindia Telugu
 అయ్యప్ప ఆలయం కమిటీ, భక్తుల ఆశ

అయ్యప్ప ఆలయం కమిటీ, భక్తుల ఆశ

కాలినడకన వెలుతున్న అయ్యప్ప భక్తులు ఎప్పటికప్పుడు కాళ్లు శుభ్రం చేసుకోవడానికి దారిపోడవున మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు చేశామని, చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిజైర్లు అందుబాటులోకి తీసుకువచ్చామని దేవస్థానం కమిటీ అధ్యక్షుడు ఎన్. వాసు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు మనవి చేస్తూ లేఖ రాశారు. ప్రతిరోజు 5 వేల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోవడానికి కేరళ ప్రభుత్వం అవకాశం ఇస్తుందని శబరిమల ఆలయ కమిటీ నిర్వహుకులు, అయ్యప్పస్వామి భక్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

English summary
Sabarimala: Sabarimala Pilgrimage: Admission for 2,000 people tow days in Sabarimala Temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X