వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sabarimala: కేరళ ప్రభుత్వం దివాళా తీసిందా ?, రూ. 7 లక్షలు లేవా ?, ఆయుర్వేదం, స్వామియే శరణమయ్యప్ప!

|
Google Oneindia TeluguNews

శబరిమల/ కేరళ: శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి వెలుతున్న భక్తుల ఆరోగ్యం గురించి కేరళ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వెలుగు చూసింది. కరోనా వైరస్ (COVID-19) తాండవం చేస్తున్న సందర్బంగా అయ్యప్ప భక్తులకు అనేక నియమాలు విధించిన కేరళ ప్రభుత్వం వారి ఆరోగ్యం కాపాడటంలో, వారి అవసరాలు తీర్చడంలో విఫలం అవుతోందని మలయాళం మీడియా కోడైకూస్తోంది.

శబరిమల అయ్యప్ప భక్తులు కోసం ప్రతి సంవత్సరం అందుబాటులోకి తీసుకు వచ్చే ఆయుర్వేద ఆసుపత్రులను ఇంత వరకు తెరవకపోవడం అనేక విమర్శలకు దారి తీసింది. కేరళ ప్రభుత్వం దగ్గర రూ. 7 లక్షల నిధులు లేవా ? అంటూ మలయాళం మీడియా ప్రశ్నిస్తోంది. ఆయుర్వేద ఆసుపత్రులు అందుబాటులో లేకపోవడంతో అయ్యప్ప భక్తులు స్వామియే శరణమయ్యప్ప అంటున్నారు.

Kangana VS Roopa: నటి, ఐపీఎస్ దీపావళి మాటల యుద్దం, నీ పని నువ్వు చేసుకో, కంగనా..... నీకేం పనిలేదా?Kangana VS Roopa: నటి, ఐపీఎస్ దీపావళి మాటల యుద్దం, నీ పని నువ్వు చేసుకో, కంగనా..... నీకేం పనిలేదా?

 లక్షల మంది అయ్యప్ప భక్తులు

లక్షల మంది అయ్యప్ప భక్తులు

ప్రతిసంవత్సరం కేరళలోని అయ్యప్ప స్వామిని దర్శించుకుని వారిపాపాలు కడిగేసుకోవాలని చాలా మంది భక్తులు కేరళలోని శబరిమలకు వెలుతుంటారు. అయ్యప్ప భక్తులు ఆకస్మికంగా అనారోగ్యానికి గురైతే కేరళ ప్రభుత్వం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, ఆయుర్వేద ఆసుపత్రులు, అలోపతి (మూలికల వైద్యం) ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటారు.

అయ్యప్ప తీర్థయాత్ర మొదలైనా!

అయ్యప్ప తీర్థయాత్ర మొదలైనా!

శబరిమలకు అయ్యప్ప భక్తుల తీర్థయాత్ర మొదలైయ్యింది. ప్రతిఏడాది శబరిమల, పంబా, ఎరిమేళి తదితర చోట్ల కేరళ ప్రభుత్వం ఆయుర్వేద ఆసుపత్రులు ప్రారంభించి అయ్యప్ప భక్తులకు చికిత్స అందించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం అయ్యప్ప భక్తుల తీర్థయాత్ర మొదలైనా కేరళ ప్రభుత్వం ఇంత వరకు ఒక్కచోట కూడా ఆయుర్వేద ఆసుపత్రులు భక్తులకు అందుబాటులోకి తీసుకురాలేదని, ఆయుర్వేద ఆసుపత్రులు తియ్యడంలేదని మలయాళం మీడియా కథనాలు ప్రచురించాయి.

జిల్లా కలెక్టర్ చెప్పినా పట్టించుకోలేదు

జిల్లా కలెక్టర్ చెప్పినా పట్టించుకోలేదు

శబరిమల అయ్యప్ప భక్తులకు చికిత్స అందించడానికి ఆయుర్వేద ఆసుపత్రులు ప్రారంభించాలని పతనమిట్ట జిల్లా కలెక్టర్ నెల రోజుల క్రితమే కేరళ ప్రభుత్వానికి మనవి చేస్తూ లేఖ రాశారని మలయాళం మీడియా అంటోంది. అయితే జిల్లా కలెక్టర్ లేఖ రాసినా కేరళ ఆరోగ్య శాఖా మంత్రి, ప్రభుత్వ అధికారులు ఆయుర్వేద ఆసుపత్రులు ప్రారంభించడంపై అసలు ఆసక్తి చూపించలేదని మలయాళం మీడియా ఆరోపించింది.

ప్రభుత్వం దివాళా తీసిందా ? రూ. 7 లక్షలు లేవా

ప్రభుత్వం దివాళా తీసిందా ? రూ. 7 లక్షలు లేవా

అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు శబరిమలకు వెలుతుంటారు. అయ్యప్ప మాల వేసిన మలయాళీలకంటే ఇతర రాష్ట్రాల అయ్యప్ప భక్తులు ఆయుర్వేద వైద్యం చేయించుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. గత ఏడాది అయ్యప్ప భక్తులకు ఆయుర్వేద చికిత్స అందించడానికి కేరళ ప్రభుత్వం రూ. 7 లక్షల నిధులు విడుదల చేసింది. అయితే ఈ ఏడాది కేరళ ప్రభుత్వం ఆయుర్వేద ఆసుపత్రుల నిర్వహణ కోసం రూ. 7 లక్షలు విడుదల చెయ్యకుండా నిర్లక్షం చేస్తోందని మలయాళం మీడియా ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసింది.

Recommended Video

#SabarimalaTemple : సరికొత్త నిబంధనలతో.. భక్తుల కోసం తెరుచుకోనున్న Sabarimala ఆలయ తలుపులు!
స్వామియే శరణమయ్యప్ప

స్వామియే శరణమయ్యప్ప

కనీసం ఆయుర్వేద ఔషదాలు సరఫరా చెయ్యడంలేదని, అయ్యప్ప భక్తుల ఆరోగ్య అవసరాలు తీర్చడంలో కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మొత్తం మీద కేరళ ఆరోగ్య శాఖ దగ్గర రూ. 7 లక్షల నిధులు కూడా లేవా ? కేరళ ప్రభుత్వం దివాళా తీసిందా ? అంటూ అయ్యప్ప భక్తులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని మలయాళం మీడియా అంటోంది.

English summary
Sabarimala: Sabarimala pilgrimage, Kerala government Homeo clinics not opened in Sabarimala
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X