Sabarimala: శబరిమలలో నియమాలు కఠినం, నకిలి సర్టిఫికెట్లకు చెక్. థర్మల్ ఫాగింగ్ యంత్రాలు, మంత్రి!
శబరిమల/ కొచ్చి/ హైదరాబాద్: పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలలో కోవిడ్ (COVID-19) నియమాలు చాల కఠినతరం చేశామని కేరళ దేవోసం మంత్రి కందకంపల్లి సురేంద్రన్ స్పష్టం చేశారు. శబరిమలతో పాటు అయ్యప్పస్వామి సన్నిధానంలో కోవిడ్ నియమాలు కఠినతరం చేశామని, ఆ ప్రాంతాలు మొత్తం కోవిడ్ థర్మల్ ఫాగింగ్ యాత్రాలు ఏర్పాటు చేశామని, అయ్యప్పస్వామి భక్తులు, శబరిమలలో పని చేసే ఉద్యోగులు అందరూ సహకరించాలని దేవస్వం మంత్రి కందకంపల్లి సురేంద్రన: మనవి చేశారు.
Sabarimala: కంటోన్మెంట్ జోన్ లోకి శబరిమల ?, ఆరు మంది అర్చకులు, సన్నిధానంలో 37 మందికి కరోనా

మకరవిలక్కు ఉత్సవాలు
శబరిమలలో మకరవిలక్కు పండుగ ఉత్సవాలు మొదలైనాయి. 2021 జనవరి 19వ తేదీ వరకు మకరలవిలక్కు యాత్ర జరుగుతుంది. ఇప్పటికే శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి అయ్యప్పస్వామి భక్తులు కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. మకరవిలక్కు యాత్రకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం అనేక నియమాలు విధించింది.

అయ్యప్ప భక్తులకు నియమాలు కఠినతరం
మకరవిలక్కు 41 అయ్యప్ప భక్తుల యాత్ర మొదలైయ్యింది. శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానం ప్రధాన అర్చకుడితో పాటు ఆరు మంది అర్చకులు, సన్నిధానంలో 37 మందికి కరోనా పాజిటివ్ రావడంతో శబరిమల ఆయలం బోర్డు అధికారులు అలర్ట్ అయ్యారు. మకరలవిలక్కు యాత్ర సందర్బంగా శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య ప్రతిరోజూ 5 వేలకు పెంచడంతో భక్తుల రద్ది ఎక్కువ అయ్యింది.

తేడా వస్తే క్వారంటైన్
శబరిమలకు వెలుతున్న అయ్యప్పస్వామి భక్తులు ప్రతి ఒక్కరికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు ఎవరికైనా ఉంటే కచ్చితంగా వారిని వెంటనే క్వారంటైన్ ఐసోలేషన్ వార్డులకు పంపిస్తున్నామని. శబరిమలో ముందుకంటే ప్రస్తుతం కరోనా పరీక్షలు కఠినతరం చేశామని కేరళ దేవోసం మంత్రి కందకంపల్లి సురేంద్రన్ అన్నారు.

శబరిమలలో థర్మల్ ఫాగింగ్ యంత్రాలు
శబరిమలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోవడంతో ఆ పరిసర ప్రాంతాల్లో థర్మల్ ఫాగింగ్ యంత్రాలతో కరోనా వైరస్ ను అరికట్టడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కేరళ దేవోసం మంత్రి కందకంపల్లి సురేంద్రన్ చెప్పారు. శబరిమలతో పాటు సన్నిధానంలోని అన్ని ప్రాంతాల్లో థర్మల్ ఫాగింగ్ యంత్రాలు ఏర్పాటు చేసి ప్రతిఒక్క భక్తుడికి పరీక్షలు చేయిస్తున్నామని మంత్రి సురేంద్రన్ స్పష్టం చేశారు.

లక్షణాలు ఉంటే సౌండ్స్
శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తులతో పాటు అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిలో ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే థర్మల్ ఫాగింగ్ యంత్రాల్లో ప్రత్యేక కారణంగా తెలిసిపోతుందని, ఆ యంత్రాలకు ఏర్పాటు చేసి అలారమ్ మోగుతుందని, వెంటనే కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించడానికి అవకాశం ఉంటుందని మంత్రి సురేంద్రన్ స్పష్టం చేశారు. శబరిమలలో థర్మల్ ఫాగింగ్ యంత్రాలతో పాటు కోవిడ్ వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించడానికి ప్రత్యేక యంత్రాలు, పరికరాలు, హ్యాండ్ స్పేయర్ యంత్రాలు ఏర్పాటు చేశామని మంత్రి సురేంద్రన్ వివరించారు.