వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sabarimala: అయ్యప్ప భక్తులకు శుభవార్త, జనవరి 19 వరకు మంచి చాన్స్, TDB సంచలన నిర్ణయం, అయితే !

|
Google Oneindia TeluguNews

శబరిమల/కొచ్చి/ పందలం: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో మకరవిలక్కు పూజలు నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. శరిమలకు వచ్చే భక్తులు కచ్చితంగా కేరళ ప్రభుత్వం ఆదేశాలు, సూచనలు పాటించాలని శబరిమల ఆలయం, దేవస్వం బోర్డు నిర్వహకులు తెలిపారు. శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానంలో పర్చువల్ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 30వ తేదీ నుంచి శబరిమలలోకి 5,000 మంది అయ్యప్పస్వామి భక్తులను అనుమతించాలని దేవస్వం బోర్డు (TDB) నిర్ణయించింది. అయితే శబరిమలకు వెళ్లే భక్తులు కచ్చితంగా RTPCR పరీక్షలు చేయించుకుని ఆ సర్టిఫికెట్ ఉంట తీసుకువెళితేనే అనుమతి ఇస్తామని, కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ఉంటే కుదరదని శబరిమల దేవస్వం బోర్డు నిర్వహకులు తేల్చిచెప్పారు.

Sabarimala: శబరిమలలో మకరవిలక్కుంకు ఏర్పాట్లు, స్వామియేశరణం అయ్యప్ప, ఆరోజు రాజకుటుంబం!Sabarimala: శబరిమలలో మకరవిలక్కుంకు ఏర్పాట్లు, స్వామియేశరణం అయ్యప్ప, ఆరోజు రాజకుటుంబం!

 అయ్యప్ప భక్తులకు ఎన్నో మార్పులు

అయ్యప్ప భక్తులకు ఎన్నో మార్పులు

శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి వెలుతున్న భక్తులకు మొదటి నుంచి అనేక నియమ నిబంధనలు విదిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి మొదట కేవలం వెయ్యి మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. తరువాత శబరియలకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తుల సంఖ్య రెండు వేలకు పెంచారు.

 ఆదాయం రావడం లేదు

ఆదాయం రావడం లేదు

శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తుల సంఖ్య రెండు వేలు మాత్రమే ఉండటం, కోవిడ్ నియమాలు కఠినంగా ఉండటంతో శబరిమలకు ప్రతిఏడాది వచ్చే ఆదాయం దాదాపుగా తగ్గిపోయింది. ఇదే సమయంలో శని, ఆదివారం రోజుల్లో అయ్యప్పస్వామిని దర్శించుకునే వారి సంఖ్యను కేరళ ప్రభుత్వం మూడు వేలకు పెంచినా డిసెంబర్ 25వ తేదీ వరకు ఆదాయం మాత్రం అంతంతమాత్రంగా వచ్చింది.

 హైకోర్టు చెప్పినా కేరళ ప్రభుత్వం వాదన

హైకోర్టు చెప్పినా కేరళ ప్రభుత్వం వాదన

శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తుల సంఖ్య ప్రతిరోజు 5 వేలకు పెంచాలని ఇటీవల కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేరళలో కరోనా వైరస్ తాండవం చేస్తోందని, ఇతర రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రతిరోజు 5 వేల మంది వస్తే కరోనా మరింత వ్యాపించే అవకాశం ఉందని, హైకోర్టు ఆదేశాలను రద్దు చెయ్యాలని కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

దేవస్వం బోర్డు సంచలన నిర్ణయం

దేవస్వం బోర్డు సంచలన నిర్ణయం

శబరిమలకు ప్రతిరోజు 5 వేల మంది భక్తులను అనుమతి ఇవ్వాలని శబరిమల దేవస్వం బోర్డు కమిటి డిసెంబర్ 29వ తేదీ సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నెగటివ్ దృవీకరణ పత్రం తీసుకుని వెళితే అయ్యప్పస్వామి దర్శనానికి అనుమతి ఇచ్చే వారు. అయితే ఇక ముందు శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు కచ్చితంగా RTPCR పరీక్షలు చేయించుకుని ఆ సర్టిఫికెట్ తీసుకుని వస్తేనే అయ్యప్పస్వామి దర్శానికి అనుమతి ఇస్తామని శబరిమల దేవస్వం బోర్డు అధ్యక్షుడు వాసు తేల్చి చెప్పారు.

జనవరి 19 వరకు అవకాశం

జనవరి 19 వరకు అవకాశం

జనవరి 19వ తేదీ వరకు మకరవిలక్కు ఉత్సవాల సందర్బంగా శబరిమలకు ప్రతిరోజు 5 వేల మంది భక్తులను అనుమతి ఇవ్వాలని శబరిమల దేవస్వం బోర్డు కమిటి నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం నుంచి శబరిమలకు ప్రతిరోజు 5 వేల మంది దర్శనం చేసుకోవడానికి అనుమతి ఇస్తున్నామని, అందుకోసం పర్సువల్ క్యూలైన్లు ఏర్పాటు చేశామని శబరిమల దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు.

అయ్యప్ప భక్తులకు చక్కటి అవకాశం

అయ్యప్ప భక్తులకు చక్కటి అవకాశం

అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి జనవరి 19వ తేదీ వరకే అవకాశంఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని శబరిమల దేవస్వం బోర్డు అధ్యక్షుడు వాసు స్పష్టం చేశారు. మొత్తం మీద శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తుల సంఖ్య 5 వేలకు పెంచకూడదని కేరళ ప్రభుత్వం వాదిస్తున్నా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని శబరిమల ఆలయ కమిటి నిర్వహకులు ఈ సంచలన నిర్ణయం తీసుకోవడంతో అయ్యప్ప భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు,

English summary
Sabarimala: As per a statement from the Travancore Devasom Board (TDB) The Sabarimala temple will open on December 30 at 5 pm for "Makaravilakku", the annual festival at the hill shrine of Sabarimala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X