Sabarimala: కేరళ ప్రభుత్వం ఓకే అన్నా, అయ్యప్ప భక్తులకు అదే సమస్య, వీకెండ్ లో బురేవి ఎఫెక్ట్, అందరికీ!
శబరిమల/కొచ్చి/ పంపా: హిందువులు, శివుడి భక్తులు ఎంతో పవిత్రంగా పూజించే అయ్యప్పస్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినా బురేవి తుపాను దెబ్బతో శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తులు వీకెండ్ లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. శని, ఆదివారాల్లో ఎక్కువ మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి కేరళ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అయితే బురేవి తుపాను ఎఫెక్ట్ తో కేరళలో భారీ వర్షాలు పడుతున్న సందర్బంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
Sabarimala: నిన్న రోజుకు రూ. 3. 5 కోట్లు ఆధాయం, నేడు రూ. 10 లక్షలు, ప్రభుత్వం వింతనియమాలు!

ముందుకంటే పర్వాలేదు కానీ !
శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు తీపి కబురు చెబుతాం అంటూ కేరళ ప్రభుత్వం కొంతకాలం ఆశలు చూపిస్తూ వచ్చినా చివరికి పర్వాలేదు అనే గుడ్ న్యూస్ చెప్పింది. అయితే కేరళ ప్రభుత్వం కుంటిసాకుల వలన అయ్యప్ప భక్తులు నిరాశ చెందుతున్నారు. అయ్యప్పస్వామి భక్తులకు కచ్చితంగా తీపికబరు చెప్పామని శబరిమల అయ్యప్పస్వామి ఆలయ కమిటి బోర్డు (దేవస్వం) అధ్యక్షుడు ఎన్. వాసు అన్నారు.

మండిపడుతున్న హిందూ సంఘాలు
హిందువులకు ఎంతో పవిత్రమైన కార్తీక మాసం పూర్తి అవుతోందని, ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులకు కార్తీక మాసం ఏంతో ముఖ్యమైనది, పవిత్రమైనది. ఇలాంటి కార్తీక మాసంలో కూడా అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువ మంది శబరిమలకు వెళ్లడానికి కేరళ ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదురైనాయి. కరోనా వైరస్ ను కుంటిసాకుగా పెట్టుకుని కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం అయ్యప్పస్వామి భక్తులు, హిందువుల మీద కక్ష సాధింపులకు పాల్పడుతుందని పలువురు విమర్శలు చేశారు.

శని, ఆదివారాల్లో ఎక్కువ మంది
శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం ఉన్న నియమాలు పక్కన పెట్టామని, అయ్యప్ప భక్తులు రెండితంల సంఖ్యలో శబరిమలకు వెళ్లడానికి అవకాశం ఇచ్చామని. అయితే భక్తులు కచ్చితంగా కోవిడ్ నియమాలు పాటించాలని కేరళ రాష్ట్ర దేవస్వం మంత్రి కందకంపల్లి సురేంద్రన్ చెప్పారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు 2, 000 మంది, శని, ఆదివారాల్లో 3, 000 మంది అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకుని సన్నిధానంలో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి కేరళ ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని కేరళ మంత్రి కందకంపల్లి సురేంద్రన్ అన్నారు.

అడిగింది వేరు..... చేసింది వేరు
కరోనా వైరస్ సాకులు పెట్టుకుని ఎక్కువ మంది అయ్యప్ప భక్తులకు శబరిమలకు వెళ్లకుండా కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం అడ్డుకుంటోందని పలు హిందూ సంఘ, సంస్థలు విమర్శించాయి. శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి గత వారంలో కేవలం వెయ్యి మంది అయ్యప్ప భక్తులకు మాత్రమే అవకాశం ఇచ్చారు. శనివారం, ఆదివారం రోజుల్లో రెండు వేల మంది అయ్యప్ప భక్తులు స్వామిని దర్శించుకోవడానికి అవకాశం ఇచ్చారు.

అందరికీ అలాగే చేస్తారా ?
ప్రతిరోజూ శబరిమలలోని అయ్యప్ప సన్నిధానంలోకి కనీసం 5 వేల మంది భక్తులకు అవకాశం ఇవ్వాలని అయ్యప్ప ఆలయ కమిటీ బోర్డు కేరళ ప్రభుత్వానికి పదేపదే మనవి చేసింది. అయితే శబరిమల దేవస్వం బోర్డు మనవిని పట్టించుకోని కేరళ ప్రభుత్వం దేవస్వం మనవి చేసిన వారి సంఖ్యలో కేవలం 35 శాతం మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోవడానికి అవకాశం ఇవ్వడంతో విమర్శలకు దారితీసింది. అయ్యప్ప భక్తులకు విధించిన ఆంక్షలు, నియమాలు అన్ని వర్గాలకు విధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

బురేవి తుపాను దెబ్బ
శబరిమలలో సోమవారం నుంచి శుక్రవారం వరకు 2 వేల మంది, శనివారం, ఆదివారం మూడు వేల మంది చొప్పున అయ్యప్ప భక్తులు అయ్యప్పను దర్శించుకోవడానికి కేరళ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా బురేవి తుపాను, భారీ వర్షాల కారణంగా అయ్యప్ప స్వామి భక్తులు ఇనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేరళ ప్రభుత్వం పైపైకి అయ్యప్ప భక్తులకు అన్ని సదుపాయలు కల్పిస్తామని చెప్పినా రెండు రోజుల పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ సెలవులు ప్రకటించడంతో అయ్యప్ప భక్తులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. మొత్తం మీద బురేవి తుపాను ప్రభావం తగ్గిన తరువాత అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకోవాలని నిర్ణయించారు.