వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sabarimala: శబరిమలలో వేలం పాట, TDB నిర్ణయంతో రూ. 35 కోట్లు నష్టం, వ్యాపారులకు మరో చాన్స్, దేవస్వం !

|
Google Oneindia TeluguNews

శబరిమల/ కొచ్చి/ ఎరిమేళి: భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు సంఖ్య చాలా తగ్గిపోయింది. ప్రతిఏడాది అయ్యప్పస్వామి భక్తుల సీజన్ లో వ్యాపారాలు చెయ్యడానికి పోటీ పడే వ్యాపారులు ఇప్పుడు దుకాణాలు (షాపులు) పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. షాపు రూమ్ లు వేలంలో పాడుకోవడానికి వ్యాపారులు ఆసక్తి చూపించకపోవడంతో ట్రావంకోర్ దేవస్వం బోర్డు (TDB)కి దాదాపు రూ. 35 కోట్ల వరకు నష్టం వచ్చింది. ఈ పరిస్థితుల్లో శబరిమలకు అయ్యప్ప భక్తులు వెళ్లే మార్గంలోని షాపు రూమ్ లు మళ్లీ వేలం వెయ్యాలని దేవస్వం బోర్డు నిర్ణయం తీసుకుంది. షాపు రూమ్ లు వేలంలో పాడుకున్న వ్యాపారులు, అక్కడ పని చేసే వాళ్లకు కచ్చితంగా కోవిడ్ పరీక్షలు చెయ్యాలని అధికారులు డిసైడ్ అయ్యారు.

Sabarimala: అయ్యప్పకు 453 సవర్ల బంగారు నగలతో అలంకరణ, భక్తులకు నో చాన్స్, మండల పూజ రోజు!Sabarimala: అయ్యప్పకు 453 సవర్ల బంగారు నగలతో అలంకరణ, భక్తులకు నో చాన్స్, మండల పూజ రోజు!

పంపా టూ సన్నిధానం

పంపా టూ సన్నిధానం

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు పుణ్యనది పంపాలో స్నానం చేసి ఇరుముడి తల మీద పెట్టుకుని నడక మార్గంలో శబరిమలలోని అయ్యప్ప సన్నిధానం వరకు పాదయాత్ర చేసి వెలుతుంటారు. పంపా నుంచి శబరిమలలోని అయ్యప్పస్వామి సన్నిధానం వరకు వందల సంఖ్యలో షాపు రూమ్ లు, తాత్కాలిక షెడ్ లు ఉన్నాయి. ఈ షాపు రూమ్ ల్లో అయ్యప్పస్వామి భక్తులకు అవసరమయ్యే ఆహార పదార్థాలతో పాటు నిత్యవసర వస్తులు అందుబాటులో ఉంటాయి.

 నిన్న రూ. 45 కోట్లు ఆధాయం

నిన్న రూ. 45 కోట్లు ఆధాయం


కరోనా వైరస్ మహమ్మారి (COVID-19) దెబ్బతో శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తుల సంఖ్య ఊహించని విధంగా తగ్గిపోయింది. ఈ సందర్బంలో పంపా నుంచి శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానం వరకు ఉండే షాపు రూమ్ లు వేలం పాటలో పాడుకోవడానికి వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. గత ఏడాది షాపు రూమ్ లు వేలం వెయ్యడంతో దేవస్వం బోర్డుకు రూ. 45 కోట్ట ఆధాయం వచ్చింది.

TDB కి రూ. 35 కోట్లు నష్టం

TDB కి రూ. 35 కోట్లు నష్టం


ఈ ఏడాది షాపు రూమ్ లో వేలం పాటలో పాడుకోవడానికి వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం, కోవిడ్ కారణంగా దేవస్వం బోర్డు వేలం పాట నిర్వహించకపోవడంతో దేవస్వం బోర్డుకు ఇప్పటి వరకు రూ. 35 కోట్ల వరకు నష్టం వచ్చింది. ఈ సందర్బంగా పంపా నుంచి శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానం వరకు ఉండే 252 షాపు రూమ్ లు వేలం వెయ్యాలని, వ్యాపారులను వేలం పాటకు ఆహ్వానించాలని దేవస్వం బోర్డు అధికారులు నిర్ణయించారు.

మళ్లీ కొత్త షాపులు ప్రారంభం

మళ్లీ కొత్త షాపులు ప్రారంభం

నీళక్కల్, పంపా, శబరిమలలోని సన్నిధానంలో కేవలం కొన్ని షాపు రూమ్ లు మాత్రమే ఇప్పటి వరకు దేవస్వం బోర్డు అధికారులు వేలం పాట నిర్వహించారు. కొన్ని షాపు రూమ్ లో వేలం పాటలో వ్యాపారుల పాడుకోవడంతో దేవస్వం బోర్డు కు ఇప్పటి వరకు కేవలం మూడు కోట్ల రూపాయలు ఆధాయం వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన 118 షాపు రూమ్ లు, తాత్కాలిక షెడ్ లు మళ్లీ వేలం పాట నిర్వహించాలని దేవస్వం బోర్డు అధికారులు నిర్ణయించారు. వేలం పాటలో షాప్ రూమ్ లు తీసుకున్న వ్యాపారులు జనవరి చివరి వరకు వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Recommended Video

#SabarimalaTemple: కేరళలో భక్తుల సంఖ్య పెంచాలని నిర్ణయం ... మకరవిలక్కు పూజకు 5 వేలమందికి అనుమతి !
 14 రోజులు ఉంటే కరోనా పరీక్షలు

14 రోజులు ఉంటే కరోనా పరీక్షలు


నీళక్కల్, పంపా, శబరిమల, సన్నిధానంలో వేలం పాటలో షాపు రూమ్ లు, తాత్కాలిక షెడ్ లు వేలం పాటలో పాడుకుని వ్యాపారాలు చేసే వ్యాపారులు, అక్కడి సిబ్బంది 14 రోజులు అక్కడ ఉండాలంటే ప్రతి ఒక్కరికి కచ్చితంగా కరోనా వైరస్ (COVID-19) పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. వైద్యశాఖ అధికారులు నిర్వహించే పరీక్షలకు వ్యాపారులు, సిబ్బంది సహకరించాలని, అందుకు అంగీకారం తెలిపితేనే వ్యాపారులు వేలం పాటలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

English summary
Sabarimala: Sabarimala Travancore Devaswom Board (TDB) decided to re-Auction more shops near Sannidhanam for income.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X