వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sabarimala: శబరిమలలో విధులు, ఉద్యోగులకు ఓటు హక్కు హూష్ కాకి, తమాషా చేస్తున్నారా ? ఏం చేశామో!

|
Google Oneindia TeluguNews

శబరిమల/ కొచ్చి: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమలలో మూడు నెలల పాటు విధులు నిర్వహించే ఉద్యోగులు ఇప్పడు కేరళ ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తమకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి మీరు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు ? అంటూ శబరిమలలో విధులు నిర్వహిస్తున్న వివిద శాఖల ఉద్యోగులు కేరళ ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. శబరిమలలో ఉద్యోగాలు చేస్తున్న వారు పోస్టల్ బ్యాలెట్ పద్దతిలో ఓటు వెయ్యడానికి కేరళ ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న వారు మేము ఏం చేశామో చెప్పండి ? అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Sabarimala: అయ్యప్పకు 453 సవర్ల బంగారు నగలతో అలంకరణ, భక్తులకు నో చాన్స్, మండల పూజ రోజు!Sabarimala: అయ్యప్పకు 453 సవర్ల బంగారు నగలతో అలంకరణ, భక్తులకు నో చాన్స్, మండల పూజ రోజు!

శబరిమలలో ఉద్యోగులు

శబరిమలలో ఉద్యోగులు


పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలలో వివిద శాఖలకు చెందిన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. కేఎస్ఆర్ టీసీ (కేరళ ఆర్ టీసీ), దేవస్వం బోర్డు, ఆరోగ్య శాఖ, బీఎస్ఎన్ఎల్, ఇరిగేషన్, వాటర్ అథారిటీ, కేఎస్ఇబీ, ఫారెస్టు, ఎక్సైజ్ శాఖ, రెవెన్యూ, మునిసిపల్ శాఖ తదితర శాఖలకు చెందిన వెయ్యి మంది ఉద్యోగులు శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానంలో విధులు నిర్వహిస్తున్నారు.

ఓటు వెయ్యడానికి నో చాన్స్

ఓటు వెయ్యడానికి నో చాన్స్

శబరిమలలో ఉద్యోగాలు చేస్తున్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం లేకుండా కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శబరిమలలో ఉద్యోగాలు చేస్తున్న పోలీసు శాఖ సిబ్బంది మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి అవకాశం ఇవ్వడం వివాదానికి దారితీసింది. పోలీసులకు ఓటు వేసే హక్కు ఉన్నప్పుడు మాకేందుకు ఓటు వేసే అవకాశం ఇవ్వరని వివిద శాఖల ఉద్యోగులు కేరళ ప్రభుత్వం మీద మండిపడుతున్నారు.

కేరళ ప్రభుత్వం వింతవాదన

కేరళ ప్రభుత్వం వింతవాదన

శబరిమల కమిషన్ ఫారమ్ నెంబర్ 15 నియమాల ప్రకారం శబరిమలలో విధులు నిర్వహించే వివిద శాఖల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్యారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అనే నియమాలు, ఎన్నికల కమిషన్ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. అయితే మీరు ఎన్నికల విధుల్లో ఉన్నారు, మీరు ఎలా ఓటు వేస్తారు ? అంటూ కేరళ ప్రభుత్వం అంటోందని శబరిమలలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఆగ్రహం వక్తం చేస్తున్నారు.

 రాజ్యంగ విరుద్దం

రాజ్యంగ విరుద్దం


మాకు ఓటు హక్కును వినియోగించకుండా చేసిన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో వెంటనే ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని శబరిమలలో ఉద్యోగాలు చేస్తున్న వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అనే నియమాలు ఉన్నా కేరళ ప్రభుత్వం ఎందుకు వాటిని పాటించడం లేదని శబరిమలో ఉద్యోగాలు చేస్తున్న వారు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వెయ్యరనే భయమా ?

ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వెయ్యరనే భయమా ?

శబరిమలలో మండలపూజలు, మకరవిలక్కు పూజలు జరిగే సమయంలో అక్కడికి వెళ్లిన ఉద్యోగులు విధులు పూర్తి చేసుకుని శబరిమల కొండను దిగుతున్నారని, మాకు మద్యలో సెలవులు కూడా ఉండవని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మకరవిలక్కుం పండుగ (సంక్రాంతి) పూర్తి అయిన తరువాత తాము శబరిమల నుంచి కిందకు దిగడానికి అవకాశం ఉందని కొందరు ఉద్యోగులు అంటున్నారు. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వానికి శబరిమల ఉద్యోగులు ఓటు వెయ్యరనే భయంతోనే కేరళ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు.

English summary
Sabarimala: Staffers appointed in Sabarimala denies right to cast vote in Local Body Poll in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X