వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sabarimala: శబరిమలలో 24X7, కేరళ సిబ్బంది కాదు, తమిళనాడు భక్తుల ఎంట్రీ, 225 మంది !

|
Google Oneindia TeluguNews

శబరిమల/ చెన్నై/ పతనంపట్టి: శబరిమల అయ్యప్ప భక్తుల మండల- మకరవిలక్కు తీర్థయాత్ర సందర్బంగా పారిశుద్ద పనులు చరుకుగా సాగుతున్నాయి. ప్రతిరోజూ 24 గంటలు శబరిమల, సన్నిధానం, పంపా, నీలక్కల్ బేస్ క్యాంప్, పండలం, కునాడ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ద పనులు జరుగుతున్నాయని, అందుకోసం 225 మంది నిరంతరం పని చేస్తున్నారని కేరళ మంత్రి కందకంపల్లి సురేంద్రన్ మీడియాకు చెప్పారు. అయితే శబరిమలలో పారిశుద్ద పనులలో నిమగ్నం అయ్యింది మాత్రం కేరళకు చెందిన ఉద్యోగులు కాదు. తమిళనాడులోని అయ్యప్ప సేవా సంఘాలు, అయ్యప్ప భక్త మండలికి చెందిన 225 మంది భక్తులు ప్రతిరోజూ 24x7 పారిశుద్ద పనులు చేస్తున్నారు.

Sabarimala: నిన్న రోజుకు రూ. 3. 5 కోట్లు ఆధాయం, నేడు రూ. 10 లక్షలు, ప్రభుత్వం వింతనియమాలు!Sabarimala: నిన్న రోజుకు రూ. 3. 5 కోట్లు ఆధాయం, నేడు రూ. 10 లక్షలు, ప్రభుత్వం వింతనియమాలు!

 శబరిమల అయ్యప్ప భక్తులు

శబరిమల అయ్యప్ప భక్తులు

శబరిమలకు అయ్యప్ప భక్తుల తీర్థయాత్ర మొదలైయ్యింది. రోజురోజుకు శబరిమలకు చేరుకుంటున్న అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ (COVID-19) నిబంధనల కారణంగా అయ్యప్ప భక్తల సంఖ్య గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గిపోయింది. ప్రతిరోజు అయ్యప్ప భక్తులు స్వామిని దర్శించుకోవడానికి కేరళ ప్రభుత్వం అనేక నియమాలు విధించడంతో అయ్యప్ప భక్తుల సంఖ్య ఊహించినదానికంటే చాల తక్కువకు పడిపోయింది.

 తమిళనాడు భక్తుల సేవలు

తమిళనాడు భక్తుల సేవలు

శబరిమల అయ్యప్ప భక్తులకు సేవలు అందించడానికి ఈ ఏడాది తమిళనాడుకు చెందిన అయ్యప్ప సేవా సంఘం, అయ్యప్ప భక్త మండలి బృందాలు ముందుకు వచ్చాయి. కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలో శబరిమల, సన్నిధానం, పంపా, నీలక్కల్ బేస్ క్యాంప్, పండలం, కునాడ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ద పనులు చెయ్యడానికి 225 మంది రంగంలోకి దిగారు.

 వారం రోజులు కోవిడ్ పరీక్షలు

వారం రోజులు కోవిడ్ పరీక్షలు

తమిళనాడు నుంచి శబరిమలలో పారిశుద్ద పనులు చెయ్యడానికి వెళ్లిన 225 మందికి వెచూచిరాలోని జవహర్ నవోదయా విద్యాలయంలోని కోవిడ్ కేర్ సెంటర్ లో వారం రోజుల పాటు వైద్యపరీక్షలు నిర్వహించారు. పారిశుద్ద పనులు చెయ్యడానికి వెళ్లిన వారికి కరోనా వైరస్ లక్షణాలు లేవని నిర్దారించిన తరువాత వారు శబరిమలతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ద పనులు చెయ్యడానికి అవకాశం ఇచ్చామని శబరిమల ఆలయ కమిటి బోర్డు నిర్వహకులు తెలిపారు.

 24x7 పారిశుద్ద కార్మికులు

24x7 పారిశుద్ద కార్మికులు

శబరిమల సన్నిధానంలో 100 మంది, పంపాలో 50 మంది, నీలక్కల్ బేస్ క్యాంప్ లో 50 మంది, పండలంలో 20 మంది, కులనాడులో 5 మంది పారిశుద్ద పనులలో నిమగ్నం అయ్యారు. తమిళనాడు నుంచి శబరిమలలో పారిశుద్ద పనులు చెయ్యడానికి వెళ్లిన ప్రతి ఒక్కరికి గ్లౌజ్ లు, శానిటైజర్లు, మాస్క్ లు, దుప్పట్లు, సబ్బులు, కొబ్బరి నూనె, మూడుపూటల ఆహారం, అద్దాలు, వ్యర్థాలు సేకరించడానికి నాణ్యమైన సంచులు అందించారు. ప్రతిరోజు 24 గంటల పాటు శబరిమలతో పాటు పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచడానికి అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Recommended Video

#SabarimalaTemple: శబరిమల వెళ్లకున్నా స్వామి పూజలు , ఇరుముడుల సమర్పణకు ఏర్పాట్లు |AP Ayyappa Temples
 పంపాలో ప్లాస్టిక్ వ్యర్థాలు

పంపాలో ప్లాస్టిక్ వ్యర్థాలు

శబరిమల, సన్నిధానంతో పాటు పరిసర ప్రాంతాల్లో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను పంపాకు తీసుకెళ్లి అక్కడి యంత్రాల్లో వాటిని శుద్ది చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. శబరిమల, సన్నిధానంలో సేకరించిన వ్యర్థాలను వేరు చేసి నీలక్కల్ ప్రాంతంలో వాటిని కాల్చి బూడిద చెయ్యడానికి ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద కరోనా వైరస్ వ్యాధి నుంచి అయ్యప్ప భక్తులను కాపాడటానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని శబరిమల ఆలయ కమిటీ బోర్డు నిర్వహకులు తెలిపారు.

English summary
Sabarimala: Taml Nadu Sanitation society's 225 member team to keep Sabarimala clean.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X