వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sabarimala అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఏమిటంటే..?

|
Google Oneindia TeluguNews

కేరళ: శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తులకు త్వరలో కేరళ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం. కరోనా కారణంగా దేశంలోని అన్ని ఆలయాలు మూత పడిన నేపథ్యంలో ఇక అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా తిరిగి తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం కూడ కరెక్టుగా సీజన్‌లోనే తెరుచుకుంది. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు రోజుకు 1000 మంది భక్తులను మాత్రమే పరిమిత సంఖ్యలో అనుమతిస్తుండగా... వారాంతంలో మాత్రం ఆ సంఖ్యను 2వేలకు పరిమితి చేసింది.

ఇక రోజు అయ్యప్పస్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్యను పెంచేలా అనుమతి ఇవ్వాలని ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పలు సూచనలు చేసింది. అయితే అన్ని శాఖలతో ప్రభుత్వం చర్చించాకే దీనిపై తుది నిర్ణయం వెలువడుతుందని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. ఇక కరోనా కారణంగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో ఆలయం మూత పడింది. దీంతో భక్తుల దర్శనం లేక ఆలయం కూడా ఆర్థికంగా చితికిపోయింది.

Sabarimala temple board requests govt to increase the number of piligrims in week days also

ఇక నిలక్కల్ దగ్గర కరోనా పరీక్ష కేంద్రాల నుంచి సన్నిధానం వద్ద ఉన్న శానిటైజేషన్ వ్యవస్థ వరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.లాక్‌డౌన్‌కు ముందు సీజన్ సమయంలో రోజుకు 80వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే వారని... ఆ సమయంలో రూ.263 కోట్లు మేరా రెవిన్యూ వచ్చేదని అధికారులు తెలిపారు.

ఇక ఈ సారి ఆంక్షలు అమల్లోకి రావడంతో వ్యాపారస్తులు కూడా దుకాణాల టెండర్లకు దూరంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఇక ఈ సారి హుండీ ఆదాయం కూడా చాలా వరకు తగ్గే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఇక దుకాణాలు కూడా చాలా వరకు వేలం వేయలేదని... ఆంక్షలు అమల్లో ఉన్నందున నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉందని అన్నారు టీడీబీ అధ్యక్షుడు ఎన్.వాసు.అయితే రానున్న రోజుల్లో పరిస్థితిని బట్టి దుకాణాలు తెరుచుకుంటాయని చెప్పారు.

English summary
Here is some good news for the Sabarimal Piligrims. The temple board had recommended the govt to increase the devotees number during weekdays also which is currently at 1000.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X