వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్వారంటైన్‌లో శబరిమల ప్రధాన పూజారి.. మకరవిళక్కు స్టార్ట్... కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్..

|
Google Oneindia TeluguNews

శబరిమల ఆలయ మరకవిళక్కు సందర్భంగా బుధవారం తెరిచారు. శబరిమల ప్రాంతం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. అయితే ఆలయ ప్రధాన పూజారి మాత్రం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన ఇటీవల కలిసిన ముగ్గురికీ కరోనా వైరస్ సోకింది. అందుకోసమే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే ఆలయంలో జరగాల్సిన కార్యక్రమాలను మాత్రం యదావిధిగా జరుగుతున్నాయి.

బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరిచారు. గురువారం ఉదయం వరకు భక్తులను అనుమతిస్తామని ట్రావెన్ కోర్ దేవస్‌వామ్ బోర్డు తెలిపింది. బుధవారం నుంచి జనవరి 14వ తేదీ వరకు మకరవిళక్కు ఉంటుందని.. జనవరి 20వ తేదీన ఆలయం మూసివేస్తామని చెబుతున్నారు. అయితే ప్రధాన పూజారి వీకే జయరాజన్ మాత్రం మంగళవారం నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్నారని పేర్కొన్నారు.

Sabarimala Temple Opens for Makaravilakku Festival; Chief Priest in Quarantine

ఆలయ ప్రధాన పూజారి లేకపోయినా.. రోజు జరగాల్సిన కైంకర్యాలకు ఆటంకం కలగదని బోర్డు వర్గాలు తెలిపాయి. 5 రోజుల తర్వాత కరోనా పాజిటివ్ వస్తే.. ప్రధాన పుజారి ఆలయంలోకి రారు అని తెలిపారు. దీంతోపాటు రోజు 5 వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. డిసెంబర్ 26వ తేదీన తొలివిడత మండల పూజ ముగిసింది. కరోనా నెగటివ్ సర్టిఫికెట్ చూపించి.. అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు.

ఈ సారి కూడా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చూపించాలని కోరుతున్నారు. లేదంటే నీలక్కల్, పంపా సన్నిధానం నుంచి ముందుకు పంపించబోరు అని స్పస్టంచేశారు.

English summary
Lord Ayyappa temple here opened this evening for the Makaravilakku festival, even as the chief priest quarantined himself after coming into contact with three COVID positive people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X