వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

16న తెరచుకోనున్న శబరిమల ఆలయం: భక్తులకు కీలక మార్గదర్శకాలు

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం అక్టోబర్ 16 నుంచి తెరుచుకోనుంది. ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. కాగా, శబరిమల యాత్ర కూడా దగ్గరపడుతుండటంతో కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు యాత్రకు రానున్న నేపథ్యంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా పలు మార్గదర్శకాలను విడుదల చేశారు.

గర్భంలోనే కవలల మృతి .. కరోనా భయంతో గర్భిణీకి వైద్యం చెయ్యని కేరళ ఆస్పత్రులు .. విచారణకు ఆదేశం గర్భంలోనే కవలల మృతి .. కరోనా భయంతో గర్భిణీకి వైద్యం చెయ్యని కేరళ ఆస్పత్రులు .. విచారణకు ఆదేశం

ఆయా రాష్ట్రాల్లో స్థానిక భాషల్లో ప్రచురిస్తూ అందరికీ తెలియజేయాలని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహతా అధికారులకు సూచించారు.

 Sabarimala temple to open for monthly five-days from October 16: protocols for devotees

కీలక మార్గదర్శకాలను పరిశీలించినట్లయితే..
శబరిమలకు వచ్చే భక్తులు ముందుగానే కేరళ పోలీస్ శాఖ అభివృద్ధి చేసిన వర్చువల్ క్యూ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. దీని కోసం https://sabarimalaonline.org వెబ్‌సైట్ సందర్శించాలి.

వారం ప్రారంభంలో రోజుకు 1000 మంది, వారాంతాల్లో రోజుకు 2 వేల మంది చొప్పున పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకునే వీలుంది. పరిస్థితులను బట్టి మార్పు చేస్తారు.

దర్శనానికి 48 గంటల ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. దీనిలో నెగిటివ్ వచ్చినవారినే అనుమతిస్తారు. ప్రవేశ మార్గంలోనూ యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తారు.

పది సంవత్సరాలలోపు వారికి 60:65 సంవత్సరాలు దాటిన వారిని దర్శనానికి అనుమతించరు. దీర్ఘకాలిక గుండె సమస్యలతో బాధపడుతున్న వారు కూడా శబరిమల యాత్రకు రాకూడదు.

శబరిమల యాత్రకు వచ్చిన వాళ్లు తమతో ఆయుష్మాన్ భారత్, బీపీఎల్ తదితర ఆరోగ్యబీమా కార్డులను కూడా వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.

అంతేగాక, స్వామికి నెయ్యి అభిషేకాలు, పంపా నదిలో స్నానాలు, సన్నిధానంలో రాత్రి బస చేయడం వంటివాటిని అనుమతించరు.

కేవలం ఎరుమేలి, వడసెర్రికర మార్గాల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. మిగితా అన్ని రూట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు.

పంప, నీలక్కల్, సన్నిధనం వద్ద టాయిలెట్, బాత్రూమ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

అలాగే, దేవాలయానికి వెళ్ళే మార్గంలో వివిధ చోట్ల శానిటైజర్లు, సబ్బు, నీటి వసతులు ఏర్పాట్లు చేసింది.

భక్తులందరూ స్వామి అయ్యప్పన్ రోడ్ గుండా ఎక్కి దిగుతారు, అయితే సన్నిధనం వద్ద దర్శనం కరోనా సామాజిక దూర మార్గదర్శకాలు పాటించాలి.

English summary
The Sabarimala Lord Ayyappa temple will open for monthly five-day pooja from October 16 amid the rising cases of coronavirus COVID-19 pandemic. The Travancore Devasom Board (TDB) made the announcement and also the protocols for devotees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X