Sabarimala: శబరిమల కళకళలాడింది, కార్తిక పౌర్ణమి స్పెషల్, భక్తులు హ్యాపీ, శివుడికి, విష్ణువు పూజలకు ఏకైక మాసం !
శబరిమల/ పంపా, కొచ్చి: అయ్యప్ప భక్తులకు పరమ పవిత్రమైన శబరిమల కార్తిక పౌర్ణిమ సందర్బంగా కళకళలాడింది. కార్తిక పౌర్ణమి సందర్బంగా సోమవారం శబరిమలను ప్రత్యేకంగా రంగురంగుల పూలతో చూడముచ్చటగా అలంకరించారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తిక మాసం సందర్బంగా శబరిమలతో పాటు అయోధ్యతో సహ దేశ వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడు, విష్ణువును పూజించే ఏకైక మాసం ఈ కార్తిక మాసం. కార్తిక పౌర్ణిమ సందర్బంగా సోమవారం రాత్రి దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలో హిందువులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు.

రెండు నెలలు అయ్యప్ప దర్శనం
శబరిమలకు ప్రతిఏడాది రెండు నెలల పాటు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. నవంబర్ 16వ తేదీన శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం ద్వారాలు తెరుచుకున్నాయి. అప్పటి నుంచి ప్రతిరోజు అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల చేరుకుని సన్నిధానంలో తమ కోరికలు తీర్చాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నారు.

పరిమితి సంఖ్యలో అనుమతి
శబరిమలకు ప్రస్తుతం అయ్యప్పస్వామి భక్తులు వెళ్లే సంఖ్య చాలా తక్కువకు పడిపోయింది. కరోనా వైరస్ (COVID-19) నియమాలు చాలా కఠినంగా ఉండటంతో చాలా మంది అయ్యప్పస్వామి భక్తులు వారి సొంత రాష్ట్రాల్లోని అయ్యప్ప ఆలయాల్లోనే దీక్షను విరమిస్తున్నారు. ఈ సందర్బంగా శబరిమలకు వెలుతున్న అయ్యప్ప స్వామి భక్తులు ఎన్నడూ లేని విధంగా చాలా ప్రశాంతంగా అయ్యప్పస్వామిని దర్శించుకుంటున్నారు.

కార్తిక పౌర్ణమి స్పెషల్
హిందువులకు కార్తిక మాసం ఎంతో ప్రత్యేక మైనది. ఇక అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువగా అయ్యప్పను దర్శించుకోవడానికి కార్తిక మాసంలోనే వెలుతుంటారు. అలాంటి కార్తిక మాసంలో వచ్చిన కార్తిక పౌర్ణమి సందర్బంగా శబరిమలను చాల ప్రత్యేకంగా అలంకరించారు. శబరిమలలోని అయ్యప్ప స్వామి సన్నిధానంలో రంగురంగుల పూలతో ప్రత్యేకంగా చూడముచ్చటగా అలంకరించారు.

పులకించిపోయిన అయ్యప్ప భక్తులు
కార్తిక పౌర్ణమి సందర్బంగా శబరిమలను చాల ప్రత్యేకంగా అలంకరించారు. శబరిమలలోని అయ్యప్ప స్వామి సన్నిధానంలో రంగురంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించడం, భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో శబరిమలకు వెళ్లిన అయ్యప్ప భక్తులు తనివితీరా అయ్యప్ప స్వామిని దర్శించుకుని ఎన్నడూ లేని విధంగా సన్నిధానంలో కుర్చుని అయ్యప్ప స్వామి ధ్యానం చేశారు.

శివుడు, విష్ణువును పూజించే ఏకైక నెల కార్తిక మాసం
శివుడి భక్తులు, విష్ణువు భక్తులు కలిసి ప్రత్యేక పూజలు, వ్రతాలు, హోమాలు చేసే ఏకైక నెల కార్తిక మాసం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కార్తిక పౌర్ణమి సందర్బంగా శివుడి ఆలయాలు, విష్ణువు ఆలయాలు కళకళలాడుతాయి. శబరిమలలో కార్తిక మాసంలో ప్రతిరోజూ రాత్రి రెండు గంటల పాటు అయ్యప్ప సన్నిధానంలో ప్రత్యేకంగా దీపాలు వెలిగించి మా అజ్ఞానం తొలగించాలని స్వామికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. కార్తిక పౌర్ణమి సందర్బంగా శబరిమలలో భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో అక్కడికి వెళ్లిన అయ్యప్ప భక్తులు ప్రశాంతంగా స్వామిని దర్శించుకున్నారు.