వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్ మ్యాచ్: టికెట్ల కోసం ఫ్యాన్స్ ఆందోళన

|
Google Oneindia TeluguNews

ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చివరిదైన 200వ టెస్ట్ మ్యాచును వీక్షించేందుకు అభిమానులు పోటీపడుతన్నారు. అయితే వారికి టికెట్లు లభించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెస్టు మ్యాచు టికెట్ల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు టికెట్లను బుకింగ్ చేసుకునే వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడంతో ముంబైలో సోమవారం వారు ఆందోళన చేపట్టతారు.

నవంబర్ 14 నుంచి సచిన్ టెండూల్కర్ చివరి టెస్ట్ మ్యాచు ప్రారంభమవుతున్న నేపథ్యంలో టికెట్లను విక్రయం జరిపే వెబ్‌సైట్ సరిగా పనిచేయకపోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టికెట్లను విక్రయించేందుకు క్యాజూంగా.కామ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సోమవారం ఒక్కరోజులోనే 5వేల టికెట్లను అమ్మిన ఆ వెబ్‌సైట్ కుప్పకూలింది. దీంతో అభిమానులు టికెట్ కోసం ఎంత యత్నించినా ఫలితం లేకపోయింది.

Sachin

దీంతో పలువురు అభిమానులు వెబ్‌సైట్ తీరుపై ట్విట్టర్లలో వింత సందేహాలను పోస్టు చేయడం ద్వారా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాటిలో కొన్ని...క్యాజూంగా: మీ హోం పేజీలో పొందలేరు, టికెట్లు రాకుంటే ఏం చేస్తారూ? టర్న్ ఆఫ్ చేయండి, సీజన్ టైమ్ ఔట్.. మీ అదృష్టాన్ని తర్వాత పరీక్షించుకోండి.. లాంటి సందేశాలను పోస్టు చేస్తున్నారు. వెబ్‌సైట్ నిర్వహణ పట్ల అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

వెస్టిండీస్‌తో జరుగనున్న ఐదు రోజుల మ్యాచులో కనీసం ఒక్క రోజుకైనా టికెట్ పొందాలనుకున్నా కూడా వెబ్ సైట్ ఓపెన్ కాక ఇబ్బందులు పడుతున్నట్లు వారు చెబుతున్నారు. టికెట్ల ధరలను రూ. 500, రూ. 1000, 2500ల రూపాయలుగా నిర్ణయించారు. కాగా ఒక వ్యక్తి రెండు టికెట్లను మాత్రమే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. 32వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం కలిగిన వాంఖేడే స్టేడియంలో ఇప్పటివరకు 20శాతం టికెట్లను కూడా విక్రయించలేదు. కాగా ప్రముఖులు, సంస్థలు, అధికార సంస్థలకు కొన్ని టికెట్లను ఇప్పటికే కేటాయించడంజరిగింది.

English summary
Angry fans of batting maestro Sachin Tendulkar staged protests in Mumbai on Monday after a website that was selling tickets for 200th and final Test crashed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X