వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెండూల్కర్ మూడు సార్లు, రేఖ వారం రోజులు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాజ్యసభకు నామినేట్ అయిన సెలిబ్రిటీలు సభకు రావడానికి పెద్దగా ఉత్సుకత ప్రదర్శించడం లేదని అర్థమవుతోంది. అలా రాజ్యసభకు ఎక్కువగా గైర్హాజరువుతున్నవారిలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, సినీ నటి రేఖ ఉన్నారు. సచిన్ టెండూల్కర్, రేఖలను యుపిఎ ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది.

2012 ఏప్రిల్ 12వ తేదీన రాజ్యసభకు నామినేట్ అయినప్పటి నుంచి సచిన్ టెండూల్కర్ మూడు సార్లు మాత్రమే సభకు హాజరయ్యారు. నిరుడు నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న సచిన్ టెండూల్కర్ ఆ తర్వాత కూడా సభకు హాజరు కావడం లేదు. రిటైర్ అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే రాజసభ సమావేశాలకు హాజరయ్యారు

Sachin not attended Rajyasabha

నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన రాజ్యసభలో కాలు పెట్టలేదు. నిరుడు డిసెంబర్ నుంచి ఈ జులై వరకు సమావేసాలను నడిచినా సచిన్ టెండూల్కర్‌కు సమయం దొరకలేదు. రేఖ ఏడు రోజుల పాటు సభకు హాజరయ్యారు.

2012 మే నుంచి 2014 జులై వరకు ఆమె వారం రోజుల పాటు సభకు హాజరయ్యారు. సచిన్, రేఖలతో పాటు రాజ్యసభకు నామినేట్ అయిన కవి, రచయిత జావేద్ అక్తర్ మాత్రం వీరికన్నా కాస్తా ఎక్కువ రోజలు సభకు హాజరయ్యారు. సభా కార్యక్రమాలను వీక్షిస్తూ, సభ్యుల ప్రసంగాలను వింటూ ఆయన మౌనంగా ఉండిపోయారు.

English summary
Former Indian cricketer Sachin Tendulkar and Bollywood star Rekha are not showing any interest to attend Rajyasabha sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X