వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిశ్శబ్దాన్ని వీడనున్న సచిన్: కొత్త పార్టీ?: కాంగ్రెస్‌కు నిద్రలేకుండా: ఆ కమ్యూనిటీ ఓటుబ్యాంకు

|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్తగా ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్.. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. బీజేపీలో చేరే ప్రసక్తే లేదంటూ ఇదివరకే తేల్చేసిన ఆయన.. తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళక ఏమిటనేది కాస్సేపట్లో వెల్లడించబోతున్నారు.

విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్: ఆ ఆదేశాలపై వెనక్కి తగ్గిన అమెరికా..ఉపసంహరణ: కోర్టుల్లోవిదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్: ఆ ఆదేశాలపై వెనక్కి తగ్గిన అమెరికా..ఉపసంహరణ: కోర్టుల్లో

ఈ ఉదయం 10 గంటలకు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. సచిన్ పైలెట్ కొత్త రాజకీయ పార్టీని పెట్టడానికే అవకాశాలు ఉన్నాయంటూ చెబుతున్నారు. ప్రగతిశీల్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని స్థాపించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే క్షేత్రస్థాయి కార్యక్రమాలను పూర్తి చేశారని చెబుతున్నారు. పార్టీ ఏర్పాటు విషయాన్ని ఆయన కాస్సేపట్లో నిర్వహించబోయే విలేకరుల సమావేశంలో వెల్లడిస్తారని తెలుస్తోంది.

Sachin Pilot to break his silence today, camp preps for long battle ahead

తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు, అనుచరులు, కిందిస్థాయి క్యాడర్‌తో ప్రగతిశీల్ కాంగ్రెస్‌ను ప్రారంభిస్తారని, అనంతరం దాన్ని విస్తరిస్తారని అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నిర్ణయాత్మక శక్తిగా పార్టీని తీర్చిదిద్దాలనే వ్యూహంతో ఉన్నారని చెబుతున్నారు. సచిన్ పైలట్ వర్గానికి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ వైపు చూడట్లేదని, కమలం పార్టీలో చేరే ఆలోచన కూడా చేయట్లేదని తెలుస్తోంది. తనకు అండగా నిలిచే ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొనబోతున్నారు.

Recommended Video

Rajasthan Political Crisis : వేడెక్కిన రాజస్తాన్ రాజకీయం..పూర్తి మద్దతు Ashok Gehlotకే ..!

సచిన్ పైలట్ వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామాలు చేస్తున్నారు. ప్రశాంత్ సహదేవ్ శర్మ, కరణ్ సింగ్, రాజేష్ చౌధరి ఇప్పటికే రాజీనామాలు చేశారు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్‌యుఐ రాజస్థాన్ యూనిట్ అధ్యక్షుడు అభిమన్యు పునియా కూడా తన పదవికి రాజీనామా చేశారు. రాజస్థాన్‌లో బలమైన సామాజిక వర్గానికి చెందిన జాఠ్, బిష్ణోయ్ కమ్యూనిటీ ఓటుబ్యాంకును ఆకట్టుకునేలా సచిన్ పైలెట్ యాక్షన్ ప్లాన్ ఉంటుందని తెలుస్తోంది.

English summary
The political crisis in Rajasthan has come to a boiling point. Sachin Pilot, who has remained silent through the dramatic turn of events since the crisis began five days ago, will finally speak out on Wednesday. Sachin Pilot will hold a press conference on Wednesday, where he is expected to give his first public response to a slew of allegations levied against him by Rajasthan Chief Minister Ashok Gehlot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X