ప్రశాంత్ కిశోర్ వర్కవుట్: ఆ ముఖ్యమంత్రికి పదవీ గండం: యువనేతకు పగ్గాలు: సోనియాతో భేటీ
న్యూఢిల్లీ: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) చీఫ్ ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్‌లో చేరడానికి ముందే- తన పని ప్రారంభించినట్టే కనిపిస్తోంది. పార్టీలో, పదవుల్లో యువ రక్తానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఆయన కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్టుగా భావిస్తున్నారు. ఇందులో భాగంగా- రాజస్థాన్ ముఖ్యమంత్రి మార్పు తప్పకపోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.

గెహ్లాట్ స్థానంలో పైలెట్..
ముఖ్యమంత్రిగా
అశోక్
గెహ్లాట్
స్థానంలో
సచిన్
పైలెట్‌ను
నియమిస్తారనే
ప్రచారం
దేశ
రాజధానిలో
ఊపందుకుంటోంది.
దీనికితోడు-
ఈ
సాయంత్రం
సచిన్
పైలెట్..
అఖిల
భారత
కాంగ్రెస్
కమిటీ
తాత్కాలిక
అధినేత్రి
సోనియా
గాంధీతో
సమావేశం
కాబోతోండటం-
ఈ
అనుమానాలు,
ప్రచారానికి
మరింత
బలాన్ని
కలిగించినట్టయింది.
ఈ
సాయంత్రం
7
గంటలకు
సచిన్
పైలెట్-
సోనియా
గాంధీతో
సమావేశం
కానున్నారు.
ఆయన
అపాయింట్మెంట్
కూడా
ఖరారైంది.
ఈ
భేటీ
తరువాత
కీలక
ప్రకటన
ఉండొచ్చని
చెబుతున్నారు.

ప్రశాంత్ కిశోర్ మార్క్ ప్రక్షాళణ..
2024లో
కేంద్రంలో
అధికారంలోకి
రావాలనే
లక్ష్యంతో
కాంగ్రెస్
పార్టీ
పలు
కీలక
నిర్ణయాలను
తీసుకుంటోన్న
విషయం
తెలిసిందే.
ఇందులో
భాగంగా
ప్రశాంత్
కిశోర్‌ను
పార్టీలోకి
చేర్చుకోనుంది.
దీనికి
ఆయన
అంగీకారం
కూడా
తెలిపారు.
ముహూర్తం
ఇంకా
ఖాయం
కాలేదు
గానీ-
వచ్చేనెలలో
సోనియా
గాంధీ,
రాహుల్
గాంధీ,
ప్రియాంక
గాంధీ
వాద్రాల
సమక్షంలో
ప్రశాంత్
కిశోర్..
కాంగ్రెస్‌లో
చేరుతారని
అంటున్నారు.
అదే
సమయంలో
రాష్ట్రస్థాయిలో
పార్టీని
ప్రక్షాళన
చేయాలని
కూడా
అధిష్ఠానం
నిర్ణయించింది.

రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్‌పై
ఈ ప్రక్షాళన అనేది ప్రశాంత్ కిశోర్ వ్యూహాలకు అనుగుణంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ దిద్దుబాటు చర్యలపై ఆయన ముద్ర ఉంటుందని తెలుస్తోంది. పార్టీ నాయకత్వం మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లుగా భావిస్తోన్న రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు లేకపోలేదు. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని తీసుకుని రావడానికి అవసరమైన చర్యలను సైతం కాంగ్రెస్ అధిష్ఠానం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

రాజీనామాపై స్పందించిన గెహ్లాట్..
ముఖ్యమంత్రి మార్పు వార్తలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సైతం ఇదివరకే స్పందించారు. తన రాజీనామా లేఖ సోనియా గాంధీ వద్దే ఉందని స్పష్టం చేశారు. ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు తనను పదవి నుంచి తప్పించ వచ్చని, ఆ అధికారం సోనియాగాంధీకి ఉందనీ వ్యాఖ్యానించారు. తనను పదవి నుంచి తప్పించినప్పటికీ.. పార్టీకి విధేయుడిగానే ఉంటానని, ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని తేల్చి చెప్పారు.
వచ్చే సంవత్సరం రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్‌ను నిర్వహించనుంది. చింతన్ శిబిర్ సందర్భంగా ముఖ్యమంత్రిగా సచిన్ పైలెట్ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేస్తుందా? లేక.. అంతకుముందే ఆయనకు పగ్గాలను అప్పగిస్తుందా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ సాయంత్రం సోనియా గాంధీతో సచిన్ పైలెట్ భేటీ తరువాత- దీనిపై ఓ స్పష్టత వస్తుందని అంటున్నారు.