వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీగా చేతలతోనే సమాధానం: గిరిజనులకు సౌకర్యాలు కల్పించిన సచిన్

|
Google Oneindia TeluguNews

ముంబై: క్రికెటర్ దిగ్గజం, రాజ్యసభసభ్యుడు సచిన్ టెండూల్కర్ తన ఎంపీ నిధులను ఆదివాసీలకు కనీస సౌకర్యాలను కల్పించేందుకు ఉపయోగించారు. ఎంపీ నిధులను ఉపయోగించడంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ తన మాటలతో కాకుండా తన చర్యలతో విమర్శకులకు సమాధానమిచ్చారు.

ముంబైకు పశ్చిమంగా ఉన్న ఆరే అనే ఆదివాసీల గూడెంలో మరుగుదొడ్ల నిర్మాణం, సోలార్‌లాంతర్ పంపిణీ, ఫుట్‌పాత్‌ల నిర్మాణం వంటి కార్యక్రమాలను చేపట్టి ఆదివాసీలకు కనీస జీవన ప్రమాణాలను కల్పించారు. వనిచపాడ, మతాయిపాడ, ఖంబ్యచపాడ, గవ్డేవిపాడ, గితుయిచపాడ డ, ఫుక్యతలవచపాడ ప్రాంతాల్లో ఈ నిర్మాణాలను చేపట్టారు.

Sachin Tendulkar Uses MP Funds to Improve Tribal Lives at Aarey

‘ఈ ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లి ఎంతోమంది ఆదివాసీలు చిరుతపులుల దాడుల్లో మృతి చెందారు' అని వనిచపాడకు చెందిన చందు జాదవ్ అనే వ్యక్తి తెలిపారు. సచిన్ టెండూల్కర్ ఎంపి నిధులను ఉపయోగించి తమ కోసం నాణ్యమైన నిర్మాణాలను చేపట్టారని ఆయన చెప్పారు.

విద్యుత్ సౌకర్యం లేని ఆదీవాసీ గూడాలకు 500 సోలార్ లాంతర్లను పంపిణీ చేశారు.
ఎంపి నిధులను సచిన్ మైదాన ప్రాంతాల ప్రజల సౌకర్యాల కోసం కాకుండా ఆదివాసీల కనీస సౌకర్యాల కోసం ఉపయోగించడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
As a Rajya Sabha member, Sachin Tendulkar has come under fire several times over the years for failing to carry out development work, so this year, the celebrated cricketer and MP has decided to answer his detractors not with words but action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X