వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికన్ల చేతిలో భారత ఫోన్లుండాలి: సచిన్ కల

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతీయులు తయారు చేసిన ఫోన్లను అమెరికన్ల చేతిలో చూడలన్నదే తన కల అని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలనుకుంటున్న దేశీయ కంపెనీలకు తాను మనస్ఫూర్తిగా మద్దతిస్తానని అన్నారు.

Sachin Tendulkar wants Americans carry Indian phones

హైదరాబాద్‌కు చెందిన స్మార్ట్‌రాన్‌ కంపెనీ తయారు చేసిన స్మార్ట్‌ఫోన్‌, రెండు విధాలుగా ఉపయోగించుకునే నోట్‌బుక్‌లను విడుదల చేసిన సందర్భంగా సచిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఇది నా రెండో ఇన్నింగ్స్‌. మొదట క్రికెట్‌ ఆడాను. ఇప్పుడు వ్యాపారవేత్తలతో భాగస్వామి అవుతున్నాను' అని సచిన్‌ వెల్లడించారు.

స్మార్ట్‌రాన్‌లో సచిన్‌ పెట్టుబడులు సైతం పెట్టారు. కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సైతం వ్యవహరించనున్నారు. అయితే పెట్టుబడుల వివరాలను సచిన్‌ వెల్లడించలేదు.

Sachin Tendulkar wants Americans carry Indian phones

వినియోగదారు వస్తువులనే కాకుండా.. క్లౌడ్‌ స్టోరేజ్‌, రూటర్లు, స్టోరేజ్‌ వంటి ఇతర ఉత్పత్తులను సైతం కంపెనీ విడుదల చేయనుందని స్మార్ట్‌రాన్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహేశ్‌ లింగారెడ్డి తెలిపారు. కాగా, వచ్చే నెల చివరివారంలో అందుబాటులోకి రానున్న టూ-ఇన్-వన్ పీసీ ధరను రూ.39,999గా నిర్ణయించింది.

English summary
Cricket icon Sachin Tendulkar today said he has a dream to see Americans carry phones made by Indians, and that he will support domestic companies whole-heartedly that are looking to go global.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X