వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనలో నేనే మాజీని: బిగ్ బి ట్వీట్‌పై సచిన్ నిర్వేదం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇద్దరి గొప్ప వ్యక్తుల మధ్య తాను ఉన్నానని బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పేర్కొనగా... నేనే తొలుత మాజీని అయ్యానని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ స్పందించారు. వీరిద్దరు ఎవరికి వారే.. ఎవరికి ఎవరూ తీసిపోని వారు.

అమితాబ్‌ బచ్చన్ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఓ ఫోటోను పోస్ట్ చేశారు. అహ్మదాబాద్‌లోని ఓ గోడ మీద ఉన్న ఆ పోస్టర్‌లో లతా మంగేష్కర్‌, సచిన్‌ టెండుల్కర్ మధ్యలో అమితాబ్‌ బచ్చన్ ఉన్నారు. ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ.. ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య తానున్నానంటూ అమితాబ్‌ ట్వీట్‌ చేశారు.

అయితే ఈ ట్వీట్‌ను చూసిన సచిన్ టెండుల్కర్... ఆ ముగ్గురిలో మాజీ అయ్యింది తానొక్కడినే అంటూ ప్రతిగా ట్వీట్‌ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్స్‌ ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ప్రముఖులు నిజంగా గొప్పవారంటూ అభిమానులు వీరిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వీరి ట్వీట్స్ ఆన్‌లైన్లో లైకుల మీద లైక్‌లు వస్తున్నాయి.

English summary
Sachin Tendulkar with a modest exchange on Twitter with Amitabh Bachchan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X