వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్ టెండూల్కర్‌కు మహారాష్ట్ర సర్కార్ ఝలక్.. బీజేపీ నేతలకూ ‘సెక్యూరిటీ’ షాక్

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో ప్రముఖులు, రాజకీయ నేతలకు సంబంధించిన సెక్యూరిటీపై ఆదిత్యా థాకరే సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకొన్నది. గాడ్ ఆఫ్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మాజీ గవర్నర్ రాంనాయక్ లాంటి ప్రముఖుల సెక్యూరిటీని కుదించడం, పెంచడం లాంటి చర్యలు తీసుకొన్నది. అయితే కొందరు ప్రముఖుల భద్రతను తగ్గించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..

 బీజేపీ నేతలకు షాక్

బీజేపీ నేతలకు షాక్

అలాగే ఇక బీజేపీ నేత ఏక్‌నాథ్ ఖాడ్సే సెక్యూరిటీ Y కేటగిరితోపాటు ఎస్కార్ట్ ఉండేది. ప్రస్తుతం ఆయన సెక్యూరిటీ నుంచి ఎస్కార్ట్‌ను తొలగించారు. అదే విధంగా బీజేపీ నేత, యూపీ గవర్నర్ రాంనాయక్ సెక్యూరిటిని Z కేటగిరి నుంచి X కేటగిరికి కుదించారు. అలాగే ప్రముఖ న్యాయవాది, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్జల్ నికమ్ సెక్యూరిటీని Y కేటగిరి నుంచి Z+ కేటగిరికి మార్చడం చర్చనీయాంశమైంది.

ఆదిత్యా థాకరేకు సెక్యూరిటీ పెంపు

ఆదిత్యా థాకరేకు సెక్యూరిటీ పెంపు

ఇప్పటి వరకు శివసేన నేత ఆదిత్యా థాకరే సెక్యూరిటీ Y+ కేటగిరిలో ఉంది. అయితే ప్రముఖుల భద్రత వ్యవహారాలను చూసే కమిటీ ఆయన సెక్యూరిటీని Z కేటగిరిలోకి మార్చారు. ఇక నుంచి ఆయన భద్రతా వ్యవస్థలో ఎక్కువ మంది సిబ్బంది కాపలాగా ఉంటారు. యువనేతకు అన్ని వేళలా రక్షణ వలయం వెంట ఉండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది.

శరద్, అజిత్ పవార్‌కు Z కేటగిరి

శరద్, అజిత్ పవార్‌కు Z కేటగిరి

అలాగే ఎన్సీపీ నేత శరద్ పవార్‌కు ఉన్న Z+ కేటగిరిని అలాగే కొనసాగించారు. అలాగే ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు Z+ కేటగిరిని కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇక సామాజిక కార్యకర్త అన్నా హజారేకు భద్రతను పెంచారు. Y+ నుంచి Z కేటగిరికి పెంచారు అని కమిటీ వెల్లడించింది.

సచిన్‌కు ఎస్కార్ట్ తొలగింపు

సచిన్‌కు ఎస్కార్ట్ తొలగింపు

ఇక క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌కు భద్రతను కొంత మేరకు తగ్గించారు. X కేటగిరితోపాటు ఎస్కార్ట్, 24 గంటలపాటు పోలీస్ కానిస్టేబుల్‌ కాపాల ఉండేది. ఇక నుంచి కానిస్టేబుల్ ఆయనకు ఎస్కార్ట్‌ను తొలగించి ఆయన భద్రతను డీ గ్రేడ్ చేశారు. మొత్తంగా మహారాష్ట్రలో 97 మంది ప్రముఖులకు సెక్యూరిటీని కల్పించాలని.. అలాగే 27 మందికి కుదింపు, అలాగే 16 మందికి కేటగిరిలో మార్పులు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకొన్నది.
.

English summary
Maharashtra Governement degraded Sachin Tendulkar X category security. Committee withdrawn Escort from his security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X