వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంబానీ ‘బాంబు’కేసులో మరో ట్విస్ట్ -సచిన్ వాజేకు సహకరించిన పోలీస్ రియాజ్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు, వ్యాపారి మన్ సుఖ్ హిరేన్ హత్య కేసులకు సంబంధించి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సస్పెండైన ముంబై పోలీస్‌ అధికారి సచిన్‌ వాజ్‌కు సహకరించిన ముంబై పోలీస్‌ రియాజ్ ఖాజీని ఎన్‌ఐఏ ఆదివారం అరెస్ట్‌ చేసింది.

సంచలనం: వైసీపీ ఎంపీల రాజీనామా -తిరుపతిలో ఓడితే చేస్తారన్న మంత్రి పెద్దిరెడ్డి -పవన్ పెయిడ్ ఆర్డిస్ట్సంచలనం: వైసీపీ ఎంపీల రాజీనామా -తిరుపతిలో ఓడితే చేస్తారన్న మంత్రి పెద్దిరెడ్డి -పవన్ పెయిడ్ ఆర్డిస్ట్

ఫిబ్రవరి 25న రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసు, ఆ కారుకు సంబంధించిన వ్యాపారి మన్‌సుఖ్‌ హిరేన్‌ హత్య కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుండటం తెలిసిందే. ఈ రెండు కేసులతో సంబంధం ఉన్న ముంబై క్రైం ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు చెందిన సచిన్‌ వాజ్‌ను మార్చి 13న ఎన్ఐఏ అరెస్టు చేయగా, తాజాగా అతని అనుచరుణ్ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.

 Sachin Vazhe’s associate API Riyazuddin Kazi arrested by NIA in ambani bomb, Mansukh case

ముఖేశ్ ఇంటి వద్ద పేలుడుపదార్థాలతో నిలిపి ఉంచిన కారు కేసులో సచిన్‌ వాజ్‌కు ముంబై పోలీస్‌ అధికారి రియాజ్ కాజీ సహకరించినట్లుగా ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ఈ ఆరోపణలపై ఆదివారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సచిన్ వాజే లాగే రియాజ్‌ కూడా ముంబై క్రైం ఇంటెలిజెన్స్‌ యూనిట్‌లో అసిస్టెంట్ పోలీస్ ఇన్స్‌స్పెక్టర్‌ (ఏపీఐ)గా విధులు నిర్వహిస్తున్నారు. కారులో పేలుడు పదార్థాల కేసు దర్యాప్తులో భాగంగా ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబిర్‌ సింగ్‌తోపాటు 40 మందికిపైగా వ్యక్తులను ఎన్‌ఐఏ ప్రశ్నించింది.

 Sachin Vazhe’s associate API Riyazuddin Kazi arrested by NIA in ambani bomb, Mansukh case

సంచలనం: వైసీపీ ఎంపీల రాజీనామా -తిరుపతిలో ఓడితే చేస్తారన్న మంత్రి పెద్దిరెడ్డి -పవన్ పెయిడ్ ఆర్డిస్ట్సంచలనం: వైసీపీ ఎంపీల రాజీనామా -తిరుపతిలో ఓడితే చేస్తారన్న మంత్రి పెద్దిరెడ్డి -పవన్ పెయిడ్ ఆర్డిస్ట్

Recommended Video

#TOPNEWS : సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ - లాక్‌డౌన్‌కు ప్రిపేర్? | మసాజ్ సెంటర్లలో మారణహోమం !

అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల కేసులో నిందితుడైన సచిన్ వాజేను అడ్డం పెట్టుకుని ముంబైలోని పబ్ లు, బార్ లు, ఇతర వ్యాపారుల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని ఆదేశించారనే ఆరోపణలపై అనిల్ దేశ్ ముఖ్ మహారాష్ట్ర హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముంబై మాజీ సీపీ పరంబీర్ చేసిన ఆరోపణలపై 15 రోజుల్లోగా దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించడం తెలిసిందే.

English summary
The NIA investigating the Antilia incident and Mansukh homicide has arrested Riyazuddin Qazi, who was already an affiliate of API Sachin Waze on this case. It’s alleged that Qazi has performed many essential roles on this case comparable to erasing proof, supporting him regardless of the data of the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X