• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సచిన్ వాజే కేసు .. ఆ స్టార్ హోటల్ లో వాజే దందా .. ఎన్ఐఏ విచారణలో షాకింగ్ విషయాలు

|

ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో , సస్పెండ్ అయిన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజే ప్రమేయం ఉందని గుర్తించిన ఎన్ఐఏ అధికారులు అతనిని అరెస్టు చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో తీగ లాగితే డొంక కదులుతుంది. అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి .

అంబానీకి బెదిరింపు కేసు: నన్ను బలి పశువును చేస్తున్నారు .. ఎన్ఐఏ కోర్టులో సచిన్ వాజేఅంబానీకి బెదిరింపు కేసు: నన్ను బలి పశువును చేస్తున్నారు .. ఎన్ఐఏ కోర్టులో సచిన్ వాజే

సచిన్ వాజే వ్యవహారాలకు సంబంధించి పలువురు పోలీసులను ప్రశ్నించిన ఎన్ఐఏ

సచిన్ వాజే వ్యవహారాలకు సంబంధించి పలువురు పోలీసులను ప్రశ్నించిన ఎన్ఐఏ

ముంబైలోని నారిమన్ పాయింట్ ఫైవ్ స్టార్ హోటల్ లోని ఓ గదిని తన కోసం 100 రోజుల పాటు ఒక వ్యాపారవేత్త చేత 12 లక్షల వ్యయంతో బుక్ చేసుకున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు వెల్లడించింది. పోలీసు హోటల్ లో బస చేయడానికి నకిలీ గుర్తింపును ఉపయోగించాడని కూడా పేర్కొంది. పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీపై జరిగిన బాంబు బెదిరింపును పరిశీలిస్తున్న దర్యాప్తు సంస్థ, ఇప్పుడు సస్పెండ్ అయిన పోలీస్ అధికారి సచిన్ వాజే వ్యవహారాలకు సంబంధించి పలువురు పోలీసు అధికారులను ప్రశ్నించింది. వీరిలో సచిన్ వాజేతో సంబంధాలున్న కొందరిని త్వరలో అరెస్టు చేయవచ్చని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

 స్టార్ హోటల్లో రూమ్ నంబర్ 1964.. 100 రోజుల పాటు బుకింగ్

స్టార్ హోటల్లో రూమ్ నంబర్ 1964.. 100 రోజుల పాటు బుకింగ్

ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన సచిన్ వాజే ఓ స్టార్ హోటల్లో 1964 రూమ్ ను వంద రోజుల పాటు బుక్ చేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. నకిలీ ఆధార్ కార్డును ఇచ్చి సుశాంత్ సదాశివ్ ఖమ్కర్ అనే కల్పిత పేరుతో రూమ్ బుక్ చేసుకున్నాడు. వంద రోజులకు ఈ హోటల్ రూమ్ ఛార్జ్ 12 లక్షల రూపాయలు.

ఒక వ్యాపారవేత్త సచిన్ వాజే కు సహకరిస్తూ ఈ హోటల్ రూమ్ వాజే కోసం బుక్ చేయించారు. వ్యాపార వివాదాలలో వాజే ఈ వ్యాపారవేత్తకు సహకరిస్తున్నట్లు గా ఎన్‌ఐఏ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.

సచిన్ వాజే వాహనాలను సీజ్ చేసిన ఎన్ఐ ఏ

సచిన్ వాజే వాహనాలను సీజ్ చేసిన ఎన్ఐ ఏ

ట్రావెల్ ఏజెంట్ ద్వారా బుకింగ్ జరిగిందని , సస్పెండ్ అయిన పోలీసు అధికారి ఫిబ్రవరిలో క్రైమ్ బ్రాంచ్ వద్ద డ్యూటీ కోసం రిపోర్ట్ చేస్తున్నప్పుడు అక్కడే ఉన్నాడని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 16 న ఇన్నోవాలో హోటల్‌లోకి ప్రవేశించిన సచిన్ వాజే ఫిబ్రవరి 20 న ల్యాండ్ క్రూయిజర్‌లో తిరిగి వెళ్ళిపోయాడు . రెండు వాహనాలను తరువాత ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. ఇదే సమయంలో లైసెన్స్ ఉల్లంఘనల కోసం వాజే మరియు అతని బృందం సభ్యులు ముంబైలోని వివిధ సంస్థలపై రాత్రులు దాడులు నిర్వహించారని అని ఎన్ఐఏ సీనియర్ అధికారి ఒకరు వివరించారు.

ముఖేష్ అంబానీ కేసు , మన్సుఖ్ హిరెన్ కేసులోనూ సచిన్ వాజే

ముఖేష్ అంబానీ కేసు , మన్సుఖ్ హిరెన్ కేసులోనూ సచిన్ వాజే

దక్షిణ ముంబైలోని కార్మైచెల్ రోడ్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేష్ అంబానీ నివాసం సమీపంలో జిలటిన్ స్టిక్స్ తో ఉన్న స్కార్పియో వదిలిపెట్టిన కేసుతో పాటు , మన్సుఖ్ హిరెన్ హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాజేను ఏజెన్సీ మార్చి 13 న అరెస్టు చేసింది. థానే వ్యాపారవేత్త మన్సుఖ్ హిరేన్ మరణం గురించి కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది . ఈ కేసు ప్రారంభంలో బాంబు-బెదిరింపు కేసును విచారించిన సచిన్ వాజే , ఇప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితుడు .

 వాజేతో కలిసి హోటల్ గదికి వెళ్ళిన మహిళ అరెస్ట్

వాజేతో కలిసి హోటల్ గదికి వెళ్ళిన మహిళ అరెస్ట్

ఎన్ఐఏ సచిన్ వాజే తో కలిసి హోటల్ గదికి వెళ్ళిన మహిళను కూడా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ . థానేలోని మీరా రోడ్ ప్రాంతంలో ఒక ఫ్లాట్ ఆ మహిళ పేరు మీద ఉండటం , మన్సుఖ్ హిరెన్ మృతి విషయంలో ఆమె పాత్ర ఉందా ? వాజేతో మహిళకు ఉన్న సంబంధం ఏమిటి అన్న అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు . ఈ రెండు కేసులకు సంబంధించి 35 మంది అధికారులను డిప్యూటీ కమిషనర్ హోదా వరకు ఎన్ఐఏ ప్రశ్నించింది.

వాజే చేసే దందాల గురించి చాలా మంది పోలీసులకు తెలుసన్న ఎన్ఐ ఏ

వాజే చేసే దందాల గురించి చాలా మంది పోలీసులకు తెలుసన్న ఎన్ఐ ఏ

వాజే నిర్వహిస్తున్న వ్యాపారం గురించి సీనియర్ పోలీసు అధికారులకు బాగా తెలుసు. దానిని నిరూపించడానికి మాకు తగినంత ఆధారాలు ఉన్నాయి అని ఒక సీనియర్ అధికారి చెప్పారు. ఎన్‌ఐఏ చెప్పిన హోటల్ గదిని పరిశీలించి, సిటిటివి ఫుటేజీని స్వాధీనం చేసుకుంది. హోటల్ వేదికగా సచిన్ వాజే చాలా పెద్ద సెటిల్మెంట్ లను చేస్తున్నారని , తాము అవినీతి నిరోధక ఏజెన్సీ కానందున, మేము సాక్ష్యాలను సంబంధిత ఏజెన్సీలకు పంపిస్తామని అంటున్నారు .

English summary
The NIA has revealed that a room in the Nariman Point Five Star Hotel in Mumbai was booked for Sachin waje, 100 days by a businessman at a cost of Rs 12 lakh . Sachin Waje has been identified as making huge settlements at the hotel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X