• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముఖేష్ అంబానీ బాంబు బెదిరింపు కేసు : సచిన్ వాజే ది కీ రోల్.. ఎన్ఐఏ రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ ట్విస్ట్

|

ఫిబ్రవరి 25 న ముఖేష్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో ఎస్‌యూవీని ఎస్కార్ట్ చేసిన మెర్సిడెస్ బెంజ్ వాహనాన్ని సచిన్ వాజ్ నడిపినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) రిమాండ్ నివేదిక లో పేర్కొంది . రిలయన్స్ అధినేత , పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంటి ముందు వాహనంలో పేలుడు పదార్థాలతో బెదిరింపు కేసులో ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. మొదట ఈ వాహన యజమానిగా భావించిన మన్సుఖ్ హిరేన్‌ హత్యతో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పలు కీలక విషయాలను వెల్లడించింది.

ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఆ పని చేస్తే ప్రోత్సాహకాలు కూడా .. మరో బాంబు పేల్చిన కేంద్రంప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఆ పని చేస్తే ప్రోత్సాహకాలు కూడా .. మరో బాంబు పేల్చిన కేంద్రం

పీపీఈ కిట్ ధరించిన వ్యక్తి వాజే అని ఎన్‌ఐఏ స్పష్టం

పీపీఈ కిట్ ధరించిన వ్యక్తి వాజే అని ఎన్‌ఐఏ స్పష్టం

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి ముందు స్కార్పియో వాహనంలో పేలుడు పదార్థాలు పెట్టి, బెదిరింపు లేఖ పంపిన కేసులో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్, వివాదాస్పద పోలీస్, ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ మాజీ అధికారి సచిన్ వాజే చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సచిన్ వాజే వాడుతున్న మెర్సిడెస్ బెంజ్ కారును స్వాధీనం చేసుకున్న ఎన్‌ఐఏ ఈ కేసులో పలు కీలక అంశాలను వెల్లడించింది. సీసీటీవీ లో కనిపించిన పీపీఈ కిట్ ధరించిన వ్యక్తి వాజే అని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. సీన్ రీ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఎన్ఐఏ దర్యాప్తులో చెక్ షర్టు, కిరోసిన్ ఉన్న ఒక బాటిల్ కూడా దొరికినట్లుగా అధికారులు తెలిపారు. ఈ కిరోసిన్ తోనే వాజే పీపీఈ కిట్ తగలబెట్టారని ఆరోపిస్తున్నారు.

సచిన్ వాజే మెర్సిడిస్ బెంజ్ కార్ లో కీలక ఆధారాలు

సచిన్ వాజే మెర్సిడిస్ బెంజ్ కార్ లో కీలక ఆధారాలు

సచిన్ వాజే మెర్సిడిస్ బెంజ్ కార్ లో ఐదు లక్షల నగదు, నోట్ల లెక్కింపు మెషిన్ తో పాటుగా కొన్ని దుస్తులను, కీలక ఆధారాలను సీజ్ చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ. ఇదే సమయంలో ఎన్ఐఏ అధికారులు ముంబైలోని క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ లో కూడా తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలలో సచిన్ వాజే ఉపయోగించిన ల్యాప్ టాప్ తో పాటుగా, ఐ పాడ్, ఫోన్, డిజిటల్ వీడియో రికార్డర్ లతోపాటు, సచిన్ వాజే ఇంటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే అన్నిటిలోను ఫుటేజ్ ను డిలీట్ చేయడంతో పాటుగా, మొబైల్ ఫోన్ సిమ్స్ కూడా పారేశారు సచిన్ వాజే .

 స్కార్పియో కోసం ఉపయోగించిన నకిలీ నంబర్ ప్లేట్‌ స్వాధీనం

స్కార్పియో కోసం ఉపయోగించిన నకిలీ నంబర్ ప్లేట్‌ స్వాధీనం

వాజ్ ఉపయోగించిన మెర్సిడెస్ కారు నుండి స్కార్పియో కోసం ఉపయోగించిన నకిలీ నంబర్ ప్లేట్‌ను కూడా గుర్తించామని ఎన్‌ఐఏ ఐజి అనిల్ శుక్లా తెలిపారు. దక్షిణ ముంబైలోని ఒక పార్కింగ్ స్థలం నుండి వాజేకు చెందిన మెర్సిడెస్‌ను స్వాధీనం చేసుకున్నట్లు శుక్లా తెలిపారు.

ప్రత్యేక కోర్టు ముందు దాఖలు చేసిన రిమాండ్ దరఖాస్తులో, అంబానీ నివాసం వెలుపల ఎస్‌యూవీని ఉంచటం లో వాజే పాల్గొన్నట్లు ఎన్ఐఏ తెలిపింది. వాజ్ మరియు హిరేన్ ల మధ్య ఉన్న సంబంధాన్ని మరింత లోతుగా విచారిస్తున్నారు .

విఖ్రోలి ఫిర్యాదు, హిరెన్ మరణం మరియు బాంబు బెదిరింపు కేసు మధ్య సంబంధం

విఖ్రోలి ఫిర్యాదు, హిరెన్ మరణం మరియు బాంబు బెదిరింపు కేసు మధ్య సంబంధం

స్కార్పియో వాహనం దొంగతనానికి గురైందని ఫిబ్రవరి 17 న, హిరేన్ విఖ్రోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే కారు కీహోల్ దగ్గర ఎటువంటి గీతలు కనిపించలేదని ఎన్ఐఏ పేర్కొంది. తన రిమాండ్ నివేదికలో, హిరేన్ యొక్క విఖ్రోలి ఫిర్యాదు, హిరెన్ మరణం మరియు బాంబు బెదిరింపు కేసు మధ్య సంబంధం ఉందని ఎన్ఐఏ పేర్కొంది. మొదటి రెండు కేసులను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దర్యాప్తు చేస్తుండగా, మూడవ కేసును ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.

ఈ కేసులో కీలక విషయాలను తెలుసుకోవడం కోసం సచిన్ వాజేను విచారించాలని ఎన్ఐఏ భావిస్తుంది.

వాజే లింక్‌లను ట్రాక్ చేయడానికి వాజే గత నేర రికార్డులను పరిశీలిస్తున్న ఎన్ఐఏ

వాజే లింక్‌లను ట్రాక్ చేయడానికి వాజే గత నేర రికార్డులను పరిశీలిస్తున్న ఎన్ఐఏ

ఈ కేసుతో వాజేకు ఉన్న ఏవైనా లింక్‌లను ట్రాక్ చేయడానికి వాజే యొక్క గత నేర రికార్డులను పరిశీలించనుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఖ్వాజా యూనస్ కస్టోడియల్ డెత్ కేసుతో పాటు, 2017 లో దోపిడీ కేసులో కూడా వాజే‌పై కేసు నమోదైంది.

ఇక తాజాగా బాంబు బెదిరింపు కేసులో, వాజే పై ఐపిసి సెక్షన్లు 286 (పేలుడు పదార్థాలకు సంబంధించి నిర్లక్ష్య ప్రవర్తన), 465 (ఫోర్జరీ), 473 (నకిలీ ముద్రలు, ప్లేట్ ), 506 (2) (క్రిమినల్ బెదిరింపు) మరియు 120 బి (క్రిమినల్ బెదిరింపు) కుట్ర), మరియు పేలుడు పదార్థాల చట్టంలోని ఇతర విభాగాల కింద కేసు నమోదు చేశారు.

English summary
The NIA probe into the Mukesh Ambani bomb threat case has come to light. The NIA, which seized the Mercedes Benz used by Sachin Waze, has revealed several key details in the case. NIA clarified that the person wearing the PPE kit seen on CCTV was Waze.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X