వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీకి లేఖ రాసిన 49 మంది సెలబ్రిటీలు.. వీరేం కోరుకుంటున్నారు..?

|
Google Oneindia TeluguNews

దేశంలో సామూహిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో 49 మంది సెలబ్రిటీలు ప్రధాని మోడీకి లేఖ రాశారు. సామూహిక దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు లేఖలో కోరారు. అంతేకాదు జైశ్రీరాం నినాదంతోనే ఇతర మతాలకు చెందిన వారిపై దాడులు జరుగుతున్నాయని లేఖలో ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. భారత్‌లో అత్యధికమంది శ్రీరాముడిని పూజిస్తారని అలాంటి దేవుడి పేరుతో దాడులు జరగడాన్ని వారంతా ఖండించారు. శ్రీరాముడి పేరును దాడులు చేసి భ్రష్టు పట్టిస్తున్నారని సెలబ్రిటీలు ప్రధానికి తెలిపారు.

ముస్లింలపై, దళితులపై ఇతర వెనకబడిన వర్గాలవారిపై సామూహిక దాడులు చేయడం తగదని సూచించిన సెలబ్రిటీలు దీనికి వెంటనే చెక్ పెట్టాలని ప్రధానిని కోరారు. ఒక్క 2016 సంవత్సరంలోనే దళితులపై 840 దాడులు జరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వెల్లడించిన గణాంకాలు చూసి షాక్ అయ్యామని సెలబ్రిటీలు చెప్పారు. అంతేకాదు 2009 జనవరి 1 నుంచి 2018 అక్టోబర్ 29 వరకు మతం పేరుతో జరిగిన దాడులు 254 అని చెప్పారు. ఈ దాడుల్లో 91 మంది ప్రాణాలు కోల్పోగా 579 మంది గాయపడినట్లు గణాంకాలు చెబుతున్నాయని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.

Sad that Jai Shriram has become a war cry: celebs write to Modi

సామూహిక దాడులను పార్లమెంటులో ఖండించడం వల్ల ఒరిగేదేమీ లేదని దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు సెలబ్రిటీలు. అయితే జైశ్రీరాం నినాదం దాడుల కోసం వినియోగించడం చాలా బాధగా ఉందని చెప్పారు. ఆ నినాదం పేరుపైనే దాడులు జరగడం కలచివేస్తోందని అది దురదృష్టకరమని సెలబ్రిటీలు చెప్పారు. నిరసనలలేని ప్రజాస్వామ్యం అంటూ ఉండదని చెప్పిన సెలబ్రిటీలు.. నిరసనలు తెలియజేస్తే వారిపై జాతి వ్యతిరేక ముద్ర వేయరాదని ప్రధాని మోడీని కోరారు సెలబ్రిటీలు.

లేఖ రాసి సంతకంపెట్టిన వారిలో ప్రముఖ సినీ దర్శకులు అదూర్ గోపాల్ కృష్ణన్, మణిరత్నం, అనురాగ్ కశ్యప్, అపర్ణ సేన్, కొంకొన సేన్ శర్మ, సౌమిత ఛటర్జీలు ఉండగా.... ప్రముఖ సామాజిక కార్యకర్తలు బినాయక్ సేన్, సౌమిత్రో ఛటర్జీ, రూవతి, శ్యాంబెనటల్, శుభ ముగ్దల్, రూపం ఇస్లాం, అనుపం రాయ్, పరంబ్రత, రిద్ది సేన్‌లు కూడా ఉన్నారు. మరోవైపు ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఆషిష్ నందీలు కూడా లేఖపై సంతకం చేసిన వారిలో ఉన్నారు.

English summary
Eminent film directors and actors such as Adoor Gopalkrishnan, Mani Ratnam, Anurag Kashyap and Aparna Sen, Konkona Sen Sharma, Soumita Chatterjee have written a letter to Prime Minister Narendra Modi expressing concerns over the growing the cases of lynching.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X