వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊరటేనా?: ఏపీ, టీకి కొత్త రైళ్లు ఇవే: సెమీ బుల్లెట్ రైళ్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2014-15కు సంబంధించిన రైల్వే బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వేల అభివృద్ధికి ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ మంగళవారం చెప్పారు. లోకసభలో ఆయన రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రూ.20,680 కోట్ల కేటాయించినట్లు చెప్పారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రైల్వేల అభివృద్ధికి తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 29 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నట్లు చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీ, టీకి కొత్తగా 5 జన సాధారణ, 5 ప్రీమీయం, 27 ఎక్స్‌ప్రెస్ రైళ్లు రానున్నాయి.

Sadananda Gowda says Rs.20,680 crores for AP and T

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొత్త రైళ్లు ఇవే...

నాగపూర్ - సికింద్రాబాద్ మధ్య సెమీ బుల్లెట్ రైలు
చెన్నై - హైదరాబాద్ మధ్య సెమీ బుల్లెట్ రైలు
సికింద్రాబాద్ - నిజాముద్దీన్ ప్రీమియం రైలు
విశాఖ - చెన్నై మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు
పారాదీప్ - విశాఖల మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు
విజయవాడ - ఢిల్లీ మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు
సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రీమియం ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలు

English summary
Sadananda Gowda says Rs.20,680 crores for Andra Pradesh and Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X