వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సద్దాం హుస్సేన్ కూతురు రగద్: “మా నాన్న అత్యుత్తమ దేశాధినేత’’- News reel

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
తండ్రి సద్దాం హుస్సేన్ తో చిన్ననాటి రగద్

ఇరాక్‌ యుద్ధం ముగిసి 18 సంవత్సరాలు పూర్తయిందని, ఈ మధ్య కాలంలో తమ కుటుంబం ఎన్నో కష్టాలు పడిందని సద్దాం హుస్సేన్‌ కుమార్తె రగద్‌ సద్ధాం హుస్సేన్‌ అన్నారు.

అల్- అరేబియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, ఇరాక్‌పై దాడి సమయంలో తాము కొన్నాళ్లు సిరియా, ఆ తర్వాత జోర్డాన్‌లలో తలదాచుకున్నామని రగద్‌ వెల్లడించారు. అప్పటి నుంచి ఆమె అక్కడే నివసిస్తున్నారు.

తండ్రి సద్దాం హుస్సేన్ తో చిన్ననాటి రగద్

“మూడేళ్లపాటు మా నాన్నకు అండగా ఉన్నాను. కానీ అది అంత సులభం కాదు. ఇరాక్‌పై దాడి తర్వాత మళ్లీ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రయత్నించాం. మా నాన్న మీద మోపిన అభియోగాలపై నేను న్యాయపోరాటం చేశాను. ఆయనొక గొప్ప మనిషి. అత్యుత్తమ దేశాధినేత. అయినా తాను చాలా సామన్యుడిగానే ఉండేవారు” అని రగద్‌ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

మా నాన్న కేసు విచారణలో పాల్గొనడం అత్యంత కష్టంగా ఉండేదని రగద్ గుర్తు చేసుకున్నారు. “మా నాన్న అరెస్టయిన రోజుల్లో మేం చాలా కష్టాల్లో ఉన్నాం. ఇప్పుడు ఇరాక్‌ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. భారీగా హింస జరుగుతోంది” అని రగద్‌ అన్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Saddam Hussein's daughter Ragad says her father was the best leader
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X