వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

delhi riots: అల్లర్లు బాధాకరం: యూఎన్ సెక్రటరీ, ట్రంప్ పర్యటనపై సాండార్స్ ఫైర్..

|
Google Oneindia TeluguNews

ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లు బాధాకరమని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ అంటోనియో గుట్రెస్ అభిప్రాయపడ్డారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అల్లర్లలో మృతుల సంఖ్య పెరుగుతోంది. 30 మంది వరకు చనిపోయారని అధికారులు ధ‌ృవీకరించారు. అల్లర్లు జరుగుతోన్నందున శాంతియుతంగా ఉండాలని, హింసను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.

ఢిల్లీలో జరుగుతోన్న ఆందోళనలపై యునైటెడ్ స్టేట్స్ కమిషన్ తీవ్రంగా స్పందించింది. భారత్‌లో జరుగుతోన్న దాడి హేయనీయమని.. పౌరులకు భద్రత కల్పించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఢిల్లీలో ముస్లింలపై జరుగుతోన్న దాడులపై పోలీసులు జోక్యం చేసుకోలేదని, అందుకే ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయని యునైటెడ్ స్టేట్స్ కమిషనర్ అనురిమా భార్గవ పేర్కొన్నారు.

saddened by Delhi violence: UN chief António Guterres

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, కానీ శాంతియుతంగా నిరసన తెలపాలని యూఎస్ హౌస్ ఫారిన్ కమిటీ అభిప్రాయపడింది. ప్రజల భద్రత కోసం పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరింది. ఢిల్లీలో అల్లర్లు జరుగుతోన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటించడంపై డెమెక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి బెర్నీ సాండర్స్ విమర్శించారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న సమయంలో పర్యటన అవసరమా అని ప్రశ్నించారు.

Recommended Video

Trump India Visit Lands Him In Trouble For Upcoming US Elections? | Oneindia Telugu

భారత్‌లో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. మత ఘర్షణలు జరిగి పదుల సంఖ్యలో చనిపోయారని సాండర్స్ తెలిపారు. చాలా మంది గాయపడ్డారని గుర్తుచేశారు. సాండర్స్ ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. భారత్‌లో జరిగిన అల్లర్లకు కారణం మానవ హక్కులను కాపాడటంలో నాయకత్వ వైఫల్యంగా అభివర్ణించారు.

English summary
UN Secretary General António Guterres is very saddened by the reports of casualties following the protests in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X