వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ పరిస్థితిని చూస్తే బాధగా ఉంది: ప్రియాంకా గాంధీ తొలి రాజకీయ ప్రసంగం

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రియాంకా గాంధీ మోడీ ఇలాఖా గుజరాత్‌లో తొలిసారిగా రాజకీయ ప్రసంగం చేశారు. మోడీ ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు. బహిరంగ సభలో ప్రసంగించిన ప్రియాంకా గాంధీ.... ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక ఆయుధం అని అన్నారు. ప్రతిఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని ఆమె చెప్పారు.

<strong>పోటీ చేయడం లేదు...ప్రచారానికే పరిమితం కానున్న ప్రియాంకాగాంధీ..?</strong>పోటీ చేయడం లేదు...ప్రచారానికే పరిమితం కానున్న ప్రియాంకాగాంధీ..?

మోడీ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు లేవని, మహిళలకు రక్షణ కరువైందని, రైతులకు కన్నీరే మిగిలిందని అన్నారు ప్రియాంకా గాంధీ. అధికార పక్షాన్ని ప్రశ్నించాలని ఎన్నికలకు ముందు ఎన్నో సమస్యలు లేవనెత్తాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతి సమస్యపై అవగాహన కలిగి ఉండి సరైన నాయకుడిని ఎన్నుకుంటే దేశ సేవ చేసిన వారవుతారని ప్రియాంకా అన్నారు. ఈ దేశం మనదని... మన సమస్యలకు పరిష్కారం లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మనకుందని చెప్పారు.

Saddened with what’s happening in India: Priyanka in her debut speech

ఈ దేశం ప్రేమ సామరస్యాలతో నిర్మితమైందని చెప్పిన ప్రియాంకా గాంధీ... ప్రస్తుత పరిస్థితిని చూస్తోంటే బాధ కలుగుతోందన్నారు. ప్రతి ఒక్క అంశంపై అవగాహన కలిగి ఉంటే చాలని దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని ప్రియాంకా చెప్పారు. అందుకే ఓటు అనే ఆయుధాన్ని వినియోగించి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కార్యకర్తలకు అభిమానులకు ప్రియాంకా పిలుపిచ్చారు. నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని ఆమె ధ్వజమెత్తారు. స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పిన ప్రియాంకా... బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని మండిపడ్డారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ నుంచి ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంకా పోటీ చేస్తారని అంతా భావించినప్పటికీ ఆమె బరిలోకి దిగరని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ప్రచారానికి మాత్రమే పరిమితమవుతారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

English summary
Priyanka Gandhi Vadra in her first debut speech at a rally in Gandhinagar, Gujarat attacked Prime Minister Narendra Modi by expressing her angst over the current situation in the country.Speaking to voters in Gandhinagar, Gujarat's capital, Priyanka Gandhi listed job opportunities for young people, women's safety and farmers' welfare as election issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X