వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నాను: సాద్వీ ప్రగ్యా

|
Google Oneindia TeluguNews

హేమంత్ కర్కరేపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు చెప్పారు సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్. భోపాల్ నుంచి బరిలో ఉన్న ఈ సన్యాసిని తాను శపించడం వల్లే హేమంత్ కర్కరే మృతి చెందారని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడంతో తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు కర్కరేపై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమించాల్సిందిగా కోరారు. భోపాల్ బీజేపీ అభ్యర్థిగా ప్రగ్యాను ప్రకటించిన నాటినుంచే ఆమె అభ్యర్థిత్వం వివాదాస్పదంగా మారింది.

మహబూబా ముఫ్తీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ వరకు దేశవ్యాప్తంగా ఉన్ననేతలు సాధ్వీపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం సాద్వీ బెయిల్ పై ఉన్నారు. 2008లో మాలెగావ్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలిగా సాద్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ ఉన్నారు. శుక్రవారం మాట్లాడుతూ తనను ఓ కేసు విషయంలో అన్యాయంగా ఇరికించిన కర్కరేను శపించినట్లు చెప్పారు. తను శపించిన మూడు నెలలకే ముంబైలో జరిగిన దాడుల్లో కర్కరే మృతి చెందాడని చెప్పారు.

Sadhvi Pragya apologies for her comments on Hemant Karkare

తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో తన తప్పును తెలుసుకున్న సాద్వీ క్షమాణలు కోరారు. తన వ్యాఖ్యలు తన శతృవులకు బలం చేకూరుస్తున్నాయని భావిస్తే ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని క్షమాపణలు కోరుతున్నానని వెల్లడించారు. సాద్వీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అటాక్ చేసింది. సాద్వీ వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాణలు చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. ముంబై దాడుల్లో తన ప్రాణాలు త్యాగం చేసిన అధికారి హేమంత్ కర్కరేపై జాతివ్యతిరేకి ముద్ర వేయడం చాలా దారుణం అని మండిపడ్డారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేసిన సాద్వీపై బీజేపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రగ్యా సాద్వీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది. సాద్వీ చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని పేర్కొంది. హేమంత్ కర్కరే కచ్చితంగా వీరమరణం పొందారని బీజేపీ బలంగా నమ్ముతోందని తెలిపింది. అయితే తను వ్యక్తిగతంగా చిత్రహింసలకు గురైనందున ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని అభిప్రాయపడింది.

English summary
Sadhvi Pragya Singh Thakur, Bharatiya Janata Party (BJP) Lok Sabha candidate from Bhopal, on Friday apologised for her statement on Mumbai Anti-Terrorist Squad (ATS) chief late Hemant Karkare. She said that if her statement is strengthening her rivals then it is better for her to take her statement back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X