వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భోపాల్‌లో సాద్వీ లీడ్ : ఆధిక్యానికి కారణం నోటిదురుసేనా ?

|
Google Oneindia TeluguNews

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో కమలం వికసిస్తోంది. భోపాల్‌లో వివాదాస్పద నేత సాద్వీ ప్రజ్ఙాసింగ్ ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ ఉద్దండుడు, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌పై లీడ్‌లో కొనసాగుతున్నారు. 15 ఏళ్లు అధికారం చేపట్టి .. ఇటీవల మధ్యప్రదేశ్‌లో అధికారం కోల్పోయింది బీజేపీ. అయితే లోక్‌సభ ఎన్నికలు ఆ పార్టీకి మరింత బూస్ట్‌నిస్తున్నాయి.

వివాదాస్పద నేత

వివాదాస్పద నేత

మాలేగావ్ బాంబు పేలుళ్లలో నిందితురాలు సాద్వీ .. అభ్యర్థిత్వం తొలి నుంచి కాంట్రవర్సీ అయ్యింది. ఆమె పేరు ఖరారైన్పటి నుంచి నోటి దురుసు ప్రదర్శించారు. భోపాల్‌లో అది సాద్వీపై .. పోటీచేసేందుకు దిగ్విజయ్ విముఖత వ్యక్తం చేశారు. కానీ 30 ఏళ్ల నుంచి ఇక్కడ బీజేపీ గెలుస్తోంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచి .. జెండా పాతాలనే ఉద్దేశ్యంతో దిగ్విజయ్‌ను బరిలోకి దింపారు. అయినా అంతగా ప్రభావం చూపలేకపోయారు. ప్రస్తుత ట్రెండ్స్ బట్టి సాద్వీ విజయం నల్లేరు మీద నడకే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

దిగ్గీ .. సాద్వీ

దిగ్గీ .. సాద్వీ

భోపాల్ లోక్ సభ స్థానం కోసం ప్రధాన పార్టీలు తొలుత మంచి కసరత్తు జరిగింది. ఇక్కడ ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ గెలువాలని దిగ్విజయ్ అభ్యర్థిత్వాన్ని .. సీఎం కమల్ నాథ్ ప్రతిపాదించారు. నామినేషన్ల గడువు కన్నా ముందే అభ్యర్థిని ఎంపిక చేశారు కమల్. ఇక్కడినుంచి దిగ్గీ పోటీచేస్తుండటంతో ... బరిలోకి దిగేందుకు బీజేపీ నేతలు విముఖత చూపించారు. దీంతో వారు సాద్వీ పేరును తెరపైకి తీసుకొచ్చారు. దిగ్గీ .. సాద్వీ
భోపాల్ లోక్ సభ స్థానం కోసం ప్రధాన పార్టీలు తొలుత మంచి కసరత్తు జరిగింది. ఇక్కడ ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ గెలువాలని దిగ్విజయ్ అభ్యర్థిత్వాన్ని .. సీఎం కమల్ నాథ్ ప్రతిపాదించారు. నామినేషన్ల గడువు కన్నా ముందే అభ్యర్థిని ఎంపిక చేశారు కమల్. ఇక్కడినుంచి దిగ్గీ పోటీచేస్తుండటంతో ... బరిలోకి దిగేందుకు బీజేపీ నేతలు విముఖత చూపించారు. దీంతో వారు సాద్వీ పేరును తెరపైకి తీసుకొచ్చారు.

నోటిదురుసు ..

నోటిదురుసు ..

బీజేపీ నేతల నమ్మకమో ఏమో తెలియదు కానీ, సాద్వీ తొలి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. మాలేగావ్ పేలుళ్లలో నిందితురాలైన ఆమె .. నోటీదురుసు ప్రదర్శించారు. హేమంత్ కర్కరే తన శాపం వల్లే చనిపోయారని కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. అయితే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దిగొచ్చి వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. తర్వాత బాబ్రీ మసీదు కూల్చడంపై కూడా నోటీ దురుసు చూపారు. ఇటీవల కమల్ చేసిన గాడ్సే వ్యాఖ్యలకు స్పందించి .. తాను కాంట్రవర్సీ నేతను అని నిరూపించుకున్నారు. సాద్వీ వ్యాఖ్యలపై ఈసీ కఠినంగా వ్యవహరించింది. రెండుసార్లు ప్రచారం కూడా నిలిపివేసింది. అయినా ఆమె తీరు మారలేదు. కానీ ఓటర్లు మాత్రం ఆమెకు మద్దతు తెలిపారు.

English summary
the Bhopal Lok Sabha constituency is the centre of attraction in the Lok Sabha election in Madhya Pradesh, where the Bharatiya Janata Party (BJP) lost power to the Congress after 15 years in 2018. Sadhvi Pragya Singh Thakur of the BJP and Digvijaya Singh of the Congress are in the contest in Bhopal Lok Sabha constituency. As per early trends, Sadvi Pragya is leading over Congress leader Digvijaya Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X