
Sadist: డ్రైవర్ మొగుడికి అనుమానం, భార్య, కూతుర్ని చంపేసి వాట్సాప్ లో ఫోటోలు షేర్ చేశాడు, క్లైమాక్స్ !
ముంబాయి/ అమమ్మద్ నగర్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు కూతురు పుట్టింది. కూతురు పుట్టిన నాలుగు సంవత్సరాల తరువాత భర్త అతని భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. డ్రైవర్ అయిన భర్త ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. తాను బయట ఉంటున్న సమయంలో తన భార్య ఎవరితోనో తిరుగుతోందని ఆమె భర్త అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంతో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇదే సమయంలో పుట్టింటి నుంచి కట్నం, బంగారు నగలు తీసుకురావాలని భర్త అతని భార్యను టార్చర్ పెట్టాడు. పుట్టింటి నుంచి డబ్బు, నగలు తీసుకురావడానికి అతని భార్య నిరాకరించింది. ఇదే విషయంలో దంపతులు గొడవపడుతున్నారు. శ్రీరామనవమి పండుగ కారణంగా భర్త పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. శ్రీరామనవమి పండుగ కూడా అంతంత మాత్రంగా చేశారు. మద్యం మత్తులో ఉన్న సమయంలో డ్రైవర్ అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన కిరాతకుడు అతని భార్యతో పాటు 5 ఏళ్ల కూతురిని దారుణంగా చంపేశాడు. భార్య, కూతురిని చంపేసి మద్యం మత్తులో ఉన్న శాడిస్టు ఇద్దరి శవాలు ఫోటోలు తీసుకుని వాట్సాప్ లో భార్య కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు షేర్ చెయ్యడం కలకలం రేపింది.

కూతురితో మొదట హ్యాపీ
మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ లోని శ్రీరామ్ పురలోని వాస్తి ప్రాంతంలో బలరామ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 7 సంవత్సరాల క్రితం అక్షరా (27) అనే మహిళను బలరామ్ వివాహం చేసుకున్నాడు. అక్షరాను వివాహం చేసుకున్న బలరామ్ అతని భార్యతో మొదట్లో సంతోషంగా కాపురం చేశాడు. బలరామ్, అక్షరా దంపతులకు శివతేజ్ కూతురు పుట్టింది.

భార్య మీద అనుమానం
కూతురు శివతేజ్ పుట్టిన నాలుగు సంవత్సరాల తరువాత బలరామ్ అతని భర్త అక్షరా మీద మీద అనుమానం పెంచుకున్నాడు. కూతురు శివతేజ్ కు ప్రస్తుతం ఐదు సంవత్సరాలు. డ్రైవర్ అయిన బలరామ్ ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. తాను బయట ఉంటున్న సమయంలో తన భార్య అక్షరా ఎవరితోనో తిరుగుతోందని బలరామ్ ఎక్కువగా అనుమానం పెంచుకున్నాడు.

అనుమానానికి తోడుగా కట్నం కావాలని డిమాండ్
ఇదే విషయంతో బలరామ్, అక్షరా దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇదే సమయంలో పుట్టింటి నుంచి కట్నం, బంగారు నగలు తీసుకురావాలని బలరామ్ అతని భార్య అక్షరాను టార్చర్ పెట్టాడు. పుట్టింటి నుంచి డబ్బు, నగలు తీసుకురావడానికి అక్షరా నిరాకరించింది. ఇదే విషయంలో బలరామ్, అక్షరా దంపతులు గొడవపడుతున్నారు.

భార్య, కూతురిని ఒకేసారి చంపేశాడు
శ్రీరామనవమి పండుగ కారణంగా బలరామ్ పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. శ్రీరామనవమి పండుగ కూడా అంతంత మాత్రంగా చేశారు. మద్యం మత్తులో ఉన్న సమయంలో డ్రైవర్ బలరామ్ అతని భార్య అక్షరాతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన కిరాతకుడు బలరామ్ అతని భార్య అక్షరాతో పాటు 5 ఏళ్ల కూతురు శివతేజ్ ను కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు.

భార్య శవం ఫోటోలు వాట్సాప్ లో షేర్ చేశాడు
భార్య అక్షరా, కూతురు శివతేజ్ ను చంపేసి మద్యం మత్తులో ఉన్న శాడిస్టు బలరామ్ ఇద్దరి శవాలు ఫోటోలు తీసుకుని వాట్సాప్ లో భార్య కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు షేర్ చెయ్యడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు భార్య అక్షరా, కూతురు శివతేజ్ ను హత్య చేసిన బలరామ్ ను అరెస్టు చేశారు.