Sadist: భార్య స్మార్ట్ ఫోన్ కొనుక్కుందని భర్త ఏం చేశాడంటే, ఎవరి కోసం ?, కిరాయి హంతకులతో, క్లైమాక్స్ !
కోల్ కత్తా: చిన్నచిన్న విషయాలకు దంపతుల మద్య గొడవలు జరగడం సర్వసాధారంగా మనం చూస్తుంటాము. గొడవలు పడుతున్న దంపతులు మళ్లీ ఒక్కటి అయ్యి చక్కగా కాపురం చేసుకుంటున్న విషయాలు తెలిసిందే. ఇక భార్యకో లేకుంటే భర్తకో అక్రమ సంబంధాలు ఉన్నాయని హత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక భార్య ఎక్కువగా ఫోన్లలో మాట్లాడుతోందని, సోషల్ మీడియాలో స్నేహితులతో చాటింగ్ చేస్తోందని ఇలా మొబైల్ విషయాల్లో గొడవలు జరుగుతున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ విషయంలో ఓ దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. తనకు కొత్త స్మార్ట్ ఫోన్ కావాలని భార్య అడగడంతో ఆమె భర్త మండిపడ్డాడు. అయితే డబ్బులు సంపాధిస్తున్న భార్య ఆన్ లైన్ లో ఆమెకు నచ్చిన స్మార్ట్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసింది. తనకు తెలీకుండా తన భార్య స్టార్మ్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిందని, ఎవరితోనో చాటింగ్ చేస్తోందని, ఏదో జరుగుతోందని అనుమానం పెంచుకున్న భర్త ఆమె మీద రగిలిపోయాడు, స్మార్ట్ ఫోన్ విషయంలోనే దంపతుల మద్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. నామాట అంటే నీకు లెక్కలేకుండా పోయిందా, నిన్ను చంపే వరకు నేను నిద్రపోను అంటూ భర్త అతని భార్యతో చాలెంజ్ చేశాడు. అనుకున్నట్లు భర్త కిరాయి హంతకులను రంగంలోకి దింపాడు. నాకు ఇష్టం లేని పని చేసిన నా భార్యను చంపేయాలని డబ్బులు ఇచ్చాడు. భార్య ఇంట్లో నుంచి బయటకు రాకుండా బయట తాళం వేసిన భర్త కిరాయి హంతకులు రంగంలోకి దింపాడు. కిరాయి హంతకుడు కత్తి తీసుకుని ఆమెను మీద విరుచుకుపడి పొడిచేయడం కలకలం రేపింది.
Illegal
affair:
భర్త
ఫ్రెండ్
తో
భార్య
?,
ఓపిక
నసించిపోయిన
భర్త
ఏం
చేశాడంటే,
శుభం
కార్డు!

మొబైల్ ఫోన్ల విషయంలో తంటాలు
మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత అనేక కుటుంబాల్లో చిన్నచిన్న విషయాలకు పెద్దపెద్ద గొడవలు జరుగుతున్నాయి. చాలా మంది నిత్యం స్మార్ట్ మొబైల్ ఫోన్లు చేతిలో పట్టుకుని ప్రపంచాన్నిమరిచిపోయి సోషల్ మీడియాలో కాలం గడిపేస్తున్నారు. భార్య ఎక్కువగా ఫోన్లలో మాట్లాడుతున్నదని, సోషల్ మీడియాలో స్నేహితులతో చాటింగ్ చేస్తోందని ఇలా రకరకాలుగా వాళ్ల భర్తల మద్య మొబైల్ ఫోన్లు విషయాల్లో గొడవలు పడుతున్న విషయం తెలిసిందే.

స్మార్ట్ ఫోన్ కావాలని చెప్పిన భార్య
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తాలోని నరేంద్రపురంలో 40 ఏళ్ల వయసు ఉన్న రాకేష్ వర్మా, నీతా వర్మా (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. తనకు కొత్త స్మార్ట్ ఫోన్ కావాలని భార్య నీతా వర్మా ఆమె భర్త రాకేష్ వర్మాకు చెప్పింది. నీతా వర్మా స్టార్ట్ ఫోన్ అడగడంతో ఆమె భర్త రాకేష్ వర్మా మండిపడ్డాడు.

జనవరి 1వ తేదీ కొత్త మొబైల్ ఫోన్
నీతూ వర్మా స్కూల్ పిల్లలకు ట్యూష్లు చెబుతూ డబ్బులు సంపాధిస్తున్నది. తన భర్త రాకేష్ వర్మా కొత్త మొబైల్ తీసివ్వకపోవడంతో తానే కొత్త ఫోన్ తీసుకోవాలని నీతూ వర్మా అనుకుంది. నీతూ వర్మా ఆన్ లైన్ లో ఆమెకు నచ్చిన స్మార్ట్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసింది. జనవరి 1వ తేదీన కొత్త ఫోన్ ఇంటికి రావడంతో నీతూ వర్మా సంతోషపడింది.

చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన భర్త
తనకు తెలీకుండా తన భార్య నీతూ వర్మా స్టార్మ్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిందని, ఎవరితోనో చాటింగ్ చేస్తోందని, ఏదో జరుగుతోందని అనుమానం పెంచుకున్న భర్త రాకేష్ వర్మా ఆమె మీద రగిలిపోయాడు, స్మార్ట్ ఫోన్ విషయంలోనే రాకేష్ వర్మా, నీతూ వర్మా దంపతుల మద్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. నామాట అంటే నీకు లెక్కలేకుండా పోయిందా, నిన్ను చంపే వరకు నేను నిద్రపోను అంటూ రాకేష్ వర్మా అతని భార్య నీతూ వర్మాతో చాలెంజ్ చేశాడు.

భార్యను చంపేయాలని కిరాయి హంతకులతో డీల్
భార్య మీద కొన్ని రోజుల నుంచి రగిలిపోతున్న రాకేష్ వర్మా అనుకున్నట్లు కిరాయి హంతకులను రంగంలోకి దింపాడు. నాకు ఇష్టం లేని పని చేసిన నా భార్య నీతూ వర్మాను చంపేయాలని రాకేష్ వర్మా కిరాయి హంతకులకు డబ్బులు ఇచ్చాడు. భార్య నీతూ వర్మా ఇంట్లో నుంచి బయటకు రాకుండా బయట తాళం వేసిన భర్త రాకేష్ వర్మా కిరాయి హంతకులు రంగంలోకి దింపాడు.

భర్తను చితకబాదిన స్థానికులు
కిరాయి హంతకుడు కత్తి తీసుకుని ఇంట్లో ఉన్న నీతూ వర్మా మీద విరుచుకుపడి పొడిచేశాడు. గుర్తు తెలియన వ్యక్తులు దాడి చెయ్యడంతో తీవ్రగాయాలైన నీతూ వర్మా కేకలు వేసింది. విషయం గుర్తించిన స్థానికులు నీతూ వర్మా భర్త రాకేష్ వర్మాతో పాటు ఓ కిరాయి హంతకుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. తీవ్రగాయాలైన నీతూ వర్మాను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. మరో కిరాయి హంతకుడు తప్పించుకున్నాడని పోలీసులు అన్నారు.ఇంతకాలం నీతూ వర్యా ట్యూషన్లు చెబుతూ సంపాధించిన డబ్బు మొత్తం ఆమె భర్త రాకేష్ వర్మానే తీసుకుంటున్నాడని, ఆమెను కేవలం డబ్బు సంపాధించే టైమ్ మిషన్ లాగానే చూశాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేవలం రూ. 10 వేల లోపు స్మార్ట్ ఫోన్ తీసివ్వాలని నీతూ వర్మా ఆమె భర్తను అడిగిందని, న్యూఇయర్ సందర్బంగా ఆఫర్ లో ఫోన్ తెప్పించుకున్న పాపానికి నీతూ వర్మాను హత్య చెయ్యడానికి ఆమె భర్త రాకేష్ వర్మా కిరాయి హంతకులను రంగంలో దింపాడని, అతన్ని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.