
Sadist: తమ్ముడితో భార్య అక్రమ సంబంధం, భార్యకు విషం తాగించి చచ్చే వరకు వెయిట్ చేసిన భర్త, క్లైమాక్స్ !
భోపాల్/ మధ్యప్రదేశ్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కొంతకాలం సంతోషంగా జీవించాడు. భార్య ఎప్పుడు పుట్టింటికి వెళ్లాలని చెప్పినా భర్త కాదనకుండా ఆమెను తల్లిదండ్రుల దగ్గరకు పంపించాడు. దంపతులతో పాటు భర్త కుటుంబ సభ్యులు, భార్య కుటుంబ సభ్యులు ఓ శుభకార్యానికి హాజరైనారు. శుభకార్యం ముగించుకుని భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు, భార్య కుటుంబ సభ్యులు అందరూ బయటకు వచ్చేశారు. అయితే ఆ సమయంలో భార్యతో పాటు ఆమె తమ్ముడు ఓ రూమ్ లో నుంచి బయటకు రాలేదని తెలిసింది. మూడు రోజుల తరువాత భార్య మాట్లాడలేనిస్థితిలో ఉన్న సందర్బంలో భర్త ఆమెను ఆసుపత్రికి తరలించాడు. తన భార్య మీద ఆమె బావ అత్యాచారం చేశాడని, ఆవేదనతో ఆమె విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిందని భర్త వైద్యులకు చెప్పాడు. చికిత్స పొందుతూ భార్య చనిపోయింది. పోలీసులు కేసు విచారణ చెయ్యడంతో మతిపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో భర్తతో పాటు అతని తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. అసలు మ్యాటర్ తెలుసుకున్న భర్త బంధువులు, చనిపోయిన మహిళ బంధువులు షాక్ అయ్యారు.

దంపతుల హ్యాపీలైఫ్
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లాలో బాబు (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం బేబి (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను బాబు పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత బాబు, బేబి దంపతులు చాలా సంతోషంగానే జీవించారు.

పదేపదే పుట్టింటికి వెళ్లివస్తున్న భార్య
భార్య బేబీ ఎప్పుడు పుట్టింటికి వెళ్లాలని చెప్పినా ఆమె భర్త బాబు కాదనకుండా ఆమెను తల్లిదండ్రుల దగ్గరకు పంపించాడు. పుట్టింటికి వెలుతున్న బేబీ ఆమె చిన్న తమ్ముడితో తప్పా వేరే వారితో బయటకు వెళ్లడం లేదు. చిన్న తమ్ముడితోనే బేబీ ఎక్కువగా బయట తిరుగుతోందని తెలిసింది.

రూమ్ లో లాక్ చేసుకున్న అక్కా, తమ్ముడు ?
మే 15వ తేదీన బేబీ కుటుంబ సభ్యులు, బాబు కుటుంబ సభ్యులు ఓ శుభకార్యానికి హాజరైనారు. శుభకార్యం ముగించుకుని భర్త బాబుతో పాటు అతని కుటుంబ సభ్యులు, భార్య బేబీ కుటుంబ సభ్యులు అందరూ బయటకు వచ్చేశారు. అయితే ఆ సమయంలో బేబీతో పాటు ఆమె తమ్ముడు ఓ రూమ్ లో నుంచి బయటకు రాలేదని తెలిసింది. ఆ సమయంలో బాబు వెళ్లి చూడగా బేబీ ఆమె తమ్ముడితో బెడ్ మీద చెయ్యరానిపని చేస్తున్న విషయం చూసి బాబు రగిలిపోయాడని తెలిసింది.

భార్యతో బలవంతంగా విషం తాగించిన భర్త
భార్య బేబీ చేసిన పనికి బాబు రగిలిపోయాడని తెలిసింది. తరువాత బాబు అతని భార్య బేబీకి చెరుకు రసంలో విషం కలిపి బలవంతంగా తాగించి ఆమెను ఓ రూమ్ లో పెట్టి బయట తాళం వేశాడు. భార్య బేబీ వెంటనే చనిపోకపోవడంతో ఆమెను రూమ్ లో నుంచి బయటకు రాకుండా చేసి ఆమె చనిపోయే వరకు వేచి చూడాలని బాబు డిసైడ్ అయ్యాడు.

ఆసుపత్రిలో డ్రామాలు.... భర్తకు బెండ్ తీస్తే మ్యాటర్ లీక్
అయితే మూడు రోజుల తరువాత బాబు అతని తండ్రి ప్లాన్ మార్చేశారు. మూడు రోజుల తరువాత బేబీ మాట్లాడలేనిస్థితిలో ఉన్న సందర్బంలో ఆమె భర్త బాబు ఆమెను ఆసుపత్రికి తరలించాడు. తన భార్య బేబీ మీద ఆమె బావ అత్యాచారం చేశాడని, ఆవేదనతో ఆమె విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిందని బాబు ఆసుపత్రిలో వైద్యులకు చెప్పాడు. చికిత్స పొందుతూ బేబీ చనిపోయింది.

నా భార్యకు ఆమె తమ్ముడితో అక్రమ సంబంధం..... అందుకే చంపేశాను
ఆసుపత్రి డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో వాళ్లు రంగంలోకిదిగారు. పోలీసులు కేసు విచారణ చెయ్యడంతో మతిపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో బేబీ భర్త బాబుతో పాటు అతని తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. నా భార్య బేబీ ఆమె చిన్న తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకుందని, ఇద్దరిని తాను రెడ్ హ్యాండెడ్ గా చూసి తట్టుకోలేక విషయం తాగించి చంపేశానని బాబు అంగీకరించాడని జబల్ పూర్ జిల్లా ఎస్పీ గోపాల్ ఖండేల్ స్థానిక మీడియాకు చెప్పారు.

బిత్తరపోయిన బంధువులు
బాబు అతని భార్య బేబీని హత్య చెయ్యడానికి అతని తండ్రి కూడా సహకరించాడని. అందుకే ఇద్దరిని అరెస్టు చేశామని జబల్ పూర్ జిల్లా ఎస్పీ గోపాల్ ఖండేల్ అంటున్నారు. అసలు మ్యాటర్ తెలుసుకున్న బాబు బంధువులు, చనిపోయిన బేబీ బంధువులు షాక్ అయ్యారు. అయితే బేబీ కుటుంబ సభ్యులు మాత్రం ఆమె భర్త బాబు ఆరోపణలను ఖండిస్తున్నారు.