• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Sadist lover: నీకు ఏమీలేదు, పెళ్లి చేసుకోను, అడ్డం తిరిగిన అత్తకూతురు, నాకు కొత్తకాదు, నీకు !

|

చెన్నై/తూత్తుకుడి: మేనత్త కూతురితో ఓ యువకుడు ప్రేమలో పడ్డాడు. అప్పటికే యువతి తండ్రి, యువకుడి తండ్రికి అస్తి తగాదాలు ఉండటంతో రెండు కుటుంబాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైయ్యింది. ఎలాగైనా అత్తకూతురిని అపెళ్లి చేసుకోవాలని ఆ యువకుడు నిర్ణయించాడు. స్నేహితులతో చెడుతిరుగుళ్లు తిరిగిన యువకుడు నేరాలు చేసి జైలుకు వెళ్లి బయటకు వచ్చాడు. ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని హీరోలాగా బిల్డప్ ఇచ్చి అత్త ఇంటి దగ్గర నానాహంగామా చేశాడు. అప్పటికే నర్సుగా మంచి ఉద్యోగం చేస్తున్న యువతి తాను నిన్ను పెళ్లి చేసుకోనని, నీకు ఏమీ లేదని అత్తకూతురు అడ్డం తిరిగింది. జైలుకు వెళ్లడం నాకు మామూలే, చావడం నీకు కొత్త అంటూ ఆ యువకుడు కత్తి తీసుకుని ప్రియురాలిని కసాకసా అంటూ పొడిచి చంపేశాడు. అడ్డం వచ్చిన ప్రియురాలి అక్కకు కత్తిపోట్ల రుచిచూపించాడు.

Illegal affair: ఆంటీ టీచర్, బెడ్ రూమ్ లో రొమాన్స్ పాఠాలు, తట్టుకోలేని భర్త ఎడిటింగ్ చేశాడు!Illegal affair: ఆంటీ టీచర్, బెడ్ రూమ్ లో రొమాన్స్ పాఠాలు, తట్టుకోలేని భర్త ఎడిటింగ్ చేశాడు!

 రక్తసంబంధం

రక్తసంబంధం

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా అత్తూరు సమీపంలోని ముక్కాని ప్రాంతంలో మురగేశన్, అర్ముగఅమ్మళ్ దంపతులు నివాసం ఉంటున్నారు. మురగేశన్, అర్ముగఅమ్మాళ్ దంపతులకు ప్రేమ (27), కనక (23) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మురగేశన్ సొంత చెల్లెలు మీనా. మీనా, తంగరాజు దంపతులకు మారియప్పన్ (29) అనే కుమారుడు ఉన్నాడు. మురగేశన్, మారియప్పన్ కు చాలా సంవత్సరాలుగా ఆస్తి తగాదాలు ఉన్నాయి.

 మేనత్తకూతురితో లవ్

మేనత్తకూతురితో లవ్

కనక నర్సింగ్ విద్యాభ్యాసం పూర్తి చేసి తూత్తుకుడిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తూ మంచి జీతం సంపాదిస్తోంది. కనక, ఆమె బావ మారియప్పన్ ప్రేమించుకున్నారు. తల్లిదండ్రుల గొడవలు మామూలే అని, మనం పెళ్లి చేసుకుంటే అన్నీ సర్దుకుపోతాయని మారియప్పన్, కనక మూడు సంవత్సరాల క్రితం భావించారు. పెద్లలు అంగీకరించకపోతే ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని మారియప్పన్ నిర్ణయించాడు.

 దొంగఅల్లుడు వద్దేవద్దు... అంతే !

దొంగఅల్లుడు వద్దేవద్దు... అంతే !

స్నేహితులతో కలిసి విచ్చలవిడిగా తిరుగుతున్న మారియప్పన్ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ నటించిన మారి సినిమాలో హీరోలాగా రెచ్చిపోయి నేరాలు చెయ్యడం మొదలుపెట్టారు. మారయప్పన్ నేర చరిత్ర ఎక్కువ కావడంతో అతని బెండ్ తీసిన పోలీసులు జైలుకు పంపించారు. జైలుకు వెళ్లిన అల్లుడు మాకు వద్దు అంటూ కనక కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు.

 పోరా బావ నీకు అదిలేదు

పోరా బావ నీకు అదిలేదు

జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన మారియప్పన్ మనం పెళ్లి చేసుకుందామని కనక మీద ఒత్తిడి చేశాడు. అయితే నీకు నీతీనిజాయితీ లేదని, నేరాలు చేస్తూ పదేపదే జైలుకు వెలుతున్న నిన్ను పెళ్లి చేసుకుంటే నా జీవితం నాశనం అవుతుందని కనక ఎదురుతిరిగింది. మారియప్పన్ ను పెళ్లి చేసుకోవడానికి వీళ్లేదని కనక కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు.

 అడ్డం తిరిగిన అత్త కూతురు

అడ్డం తిరిగిన అత్త కూతురు

ఎలాగైనా కనకను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించిన మారియప్పన్ జోబులో ఓ కత్తి పెట్టుకుని నేరుగా ఆమె ఇంటి దగ్గరకు వెళ్లి ఇప్పుడే నన్ను పెళ్లి చేసుకోవాలని గొడవపెట్టుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకోనని, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కనక మారియప్పన్ కు వార్నింగ్ ఇచ్చింది. ఆ సమయంలో మాటామాట పెరిగిపోవడంతో జోబులో ఉన్న కత్తి తీసుకుని కనక మీద ఇష్టం వచ్చినట్లు పొడిచాడు.

 జైలు నాకు పాతదే... చావు నీకు కొత్తది చావు

జైలు నాకు పాతదే... చావు నీకు కొత్తది చావు

చెల్లెలు కనక మీద దాడి జరడంతో షాక్ కు గురైన ఆమె అక్క ప్రియ అడ్డు వెళ్లడంతో ఆమెకు కత్తిపోట్లు పడ్డాయి. తీవ్రగాయాలైన కనక అక్కడిక్కడే ప్రాణాలు వదిలింది. జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు రావడం నాకేం కొత్తకాదు... కాని చావడం నీకు కొత్త చచ్చిపో అంటూ మారియప్పన్ దర్జాగా అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి కనకను హత్య చేసిన మారియప్పన్ కోసం గాలిస్తున్నారు.

English summary
Sadist lover: Man killed her lover near Thoothukudi district in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X