• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Sadist lover: ప్రియురాలు, ఆమె తల్లి, చెల్లి నగ్న వీడియోలతో ?, ఎంజాయ్ చేసి మళ్లీ రివర్స్ !

|

చెన్నై/ తిరుచ్చి: బయట ఊర్లో ఉద్యోగం చేస్తున్న యువతి, యువకుడు ఒకే ఇంట్లో కలిసి ఉంటూ సహజీవనం సాగించారు. ప్రియురాలి నగ్న వీడియో తీసిన ప్రియుడు నువ్వు నా పెళ్లి విషయంలో అడ్డుపడితే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. ప్రియురాలిని బెదిరించిన ప్రియుడు వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. మళ్లీ ప్రియురాలితో టచ్ లోకి వచ్చిన కాలాంతకుడు నువ్వు మీ అమ్మ నగ్న వీడియో తీసుకురావాలని బెదిరించాడు. ప్రియురాలు ఆమె తల్లి బాత్ రూమ్ లో, బెడ్ రూమ్ లో పర్సనల్ గా ఉన్న సమయంలో వీడియో తీసి ప్రియుడికి ఇచ్చింది. నీ చెల్లి బాత్ రూమ్ వీడియోలు కావాలని ప్రియుడు అడగడంతో ప్రియురాలు సోదరి బాత్ రూమ్ వీడియోలు తీసి ప్రియుడికి ఇచ్చింది. ఒకే ఫ్యామిలీలో అమ్మా, కూతుర్ల నగ్న వీడియోలు సేకరించి ఎంజాయ్ చేస్తున్న కేటుగాడు వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ప్రియురాలిని మళ్లీ బ్లాక్ మెయిల్ చేస్తున్న స్టోరీ బయటకు రావడం కలకలం రేపింది.

Illegal affair: ప్రియురాలు నాటుకోడి, రివర్స్, బైపాస్ లో గొంతు కోసి పెట్రోల్ పోసి కాల్చేశాడు!Illegal affair: ప్రియురాలు నాటుకోడి, రివర్స్, బైపాస్ లో గొంతు కోసి పెట్రోల్ పోసి కాల్చేశాడు!

 ఒకే ప్రాంతంలో నివాసం

ఒకే ప్రాంతంలో నివాసం

తమిళనాడులోని తిరుచ్చి సమీపంలోని తువక్కుడి ప్రాంతంలో జ్యోతి (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. తిరుచ్చి సమీపంలోని ఎహిల్ నగర్ లో నివాసం ఉంటున్న సతీష్ కు, జ్యోతికి పరిచయం అయ్యింది. కొంతకాలం ఇద్దరు స్నేహితులుగా ఉన్నారు. జ్యోతి, సతీష్ ల పరిచయం రానురాను ప్రేమగా మారింది.

 ఉద్యోగాలు....ఒకే ఇంట్లో సహజీవనం

ఉద్యోగాలు....ఒకే ఇంట్లో సహజీవనం

కాంచీపురంలో ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీలో జ్యోతికి ఉద్యోగం రావడంతో ఆమె అక్కడికి వెళ్లిపోయింది. కాంచీపురంలో ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాధించుకున్న సతీష్ కూడా అక్కడికి వెళ్లిపోయాడు. సొంతఊర్లకు దూరంగా ఉంటున్న ప్రేమికులు జ్యోతి, సతీష్ కలిసి ఒకే ఇల్లు తీసుకుని ఉండాలని బావించారు. అద్దె ఇంటిని తీసుకున్న జ్యోతి, సతీష్ సహజీనం చెయ్యడం మొదలుపెట్టారు.

 గుడ్డిగా నమ్మిన ప్రియురాలు

గుడ్డిగా నమ్మిన ప్రియురాలు

తనను సతీష్ కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో జ్యోతి శారీరకంగా అతనికి దగ్గర అయ్యింది. అయితే సతీష్ మైండ్ లో క్రిమినల్ ఆలోచనలు ఉన్నాయి. జ్యోతి స్నానం చేస్తున్న సమయంలో కొన్ని వీడియోలు తీశాడు. బెడ్ రూమ్ లో జ్యోతి ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఆమె ప్రియుడు సతీష్ రహస్యంగా వీడియోలు తీసి పెట్టుకున్నాడు.

 ప్రియుడి దెబ్బకు మైండ్ బ్లాక్

ప్రియుడి దెబ్బకు మైండ్ బ్లాక్

రెండు సంవత్సరాల క్రితం సతీష్ అతని ప్రియురాలు జ్యోతికి షాక్ ఇచ్చాడు. తనకు ఇంట్లో పెళ్లి సంబంధం చూశారని, నేను ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నాతో సహజీవనం చేసి నన్ను పెళ్లి చేసుకోకుండా వేరే యువతిని ఎలా పెళ్లి చేసుకుంటావని జ్యోతి నిలదీసింది. మర్యాదగా ఉంటే సరిపోతుంది, లేదంటే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని సతీష్ అతని మొబైల్ ఫోన్ లో నగ్న ఫోటోలను జ్యోతికి చూపించడంతో ఆమె షాక్ అయ్యింది.

 పెళ్లి చేసుకుని మళ్లీ లైన్ లోకి వచ్చిన ప్రియుడు

పెళ్లి చేసుకుని మళ్లీ లైన్ లోకి వచ్చిన ప్రియుడు

2020లో సతీష్ వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రియుడు సతీష్ దగ్గర తన నగ్న వీడియోలు ఉన్నాయనే భయంతో జ్యోతి అతని పెళ్లికి అడ్డుచెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. పెళ్లి చేసుకున్న కొన్ని నెలల తరువాత సతీష్ మళ్లీ జ్యోతికి టచ్ లోకి వచ్చాడు. నగ్న వీడియోలు అడ్డం పెట్టుకుని ఆమెను లొంగదీసుకుని కొంతకాలం ఎంజాయ్ చేశాడు.

 మీ అమ్మ సూపర్ ఫిగర్..... నాకోసం ఒక్కసారి ?

మీ అమ్మ సూపర్ ఫిగర్..... నాకోసం ఒక్కసారి ?

కొన్ని నెలల క్రితం జ్యోతి దగ్గరకు వెళ్లిన సతీష్ మీ అమ్మ చాలా అందంగా ఉంటుందని, ఆమెను ఒక్కసారి నగ్నంగా చూడాలని ఉందని, ఆమె బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో, బెడ్ రూమ్ లో బట్టలు మార్చుకునే సమయంలో వీడియోలు తీసి ఇవ్వాలని సతీష్ చెప్పాడు. తల్లి నగ్న వీడియోలు తీసిఇవ్వడానికి జ్యోతి నిరాకరించింది. చెప్పిన పని చెయ్యకుంటే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని సతీష్ అతని ప్రియురాలు జ్యోతిని బ్లాక్ మెయిల్ చేశాడు.

 ప్రియురాలి తల్లి నగ్న వీడియోలు చూసి ఎంజాయ్ చేశాడు

ప్రియురాలి తల్లి నగ్న వీడియోలు చూసి ఎంజాయ్ చేశాడు

సతీష్ దెబ్బతో జ్యోతి ఆమె తల్లి బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో రహస్యంగా వీడియోలు తీసి ప్రియుడు సతీష్ కు ఇచ్చింది. ఆంటీ నగ్న వీడియోలు చూసి సతీష్ కొంతకాలం ఎంజాయ్ చేశాడు. నేను ఏమి చెప్పినా జ్యోతి కచ్చితంగా చేస్తుందని సతీష్ ఓ నిర్ణయానికి వచ్చాడు. తరువాత నీ చెల్లిలి నగ్న వీడియోలు తీసుకురావాలని సతీష్ అతని ప్రియురాలు జ్యోతిని బెదిరించాడు.

 ఇప్పుడు ప్రియురాలి చెల్లెలి వీడియో

ఇప్పుడు ప్రియురాలి చెల్లెలి వీడియో

చెల్లెలు బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో ఆమె నగ్న వీడియోలు తీసిన జ్యోతి వాటిని ప్రియుడు సతీష్ కు ఇచ్చింది. ప్రియురాలు, ఆమె తల్లి, చెల్లి నగ్నవీడియోలు చూస్తూ సతీష్ ఎంజాయ్ చేశాడు. జ్యోతి పదేపదే మొబైల్ చేతిలో పట్టుకుని ఇంట్లో వీడియోలు తియ్యడంతో ఆమె తల్లికి అనుమానం వచ్చి నిలదీసింది. బోరున వలపించిన జ్యోతి జరిగిన స్టోరీ మొత్తం ఆమె తల్లికి చెప్పింది. ఒకే ఇంట్లో తల్లీ, ఇద్దరు కూతుర్ల నగ్న వీడియోలు సతీష్ దగ్గర ఉండటంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెంది మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

 కేటుగాడు అరెస్టు......మొబైల్ ఫోన్ ?

కేటుగాడు అరెస్టు......మొబైల్ ఫోన్ ?

కేసు నమోదు చేసిన పోలీసులు సతీష్ ను అరెస్టు చేసి అతన్ని బెండ్ తీసి మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. సతీష్ మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి కేసు విచారణ చేస్తున్నామని తిరుచ్చి పోలీసులు తెలిపారు. ప్రియురాలిని అడ్డం పెట్టుకుని ఒకే ఇంట్లో ముగ్గురి నగ్న వీడియోలు తెప్పించుకున్న సతీష్ స్కెచ్ వెలుగు చూడటంతో తమిళనాడులో కలకలం రేపింది.

English summary
Sadist lover: A man who fell in love with a woman near Trichy has taken a pornographic picture on his cell phone and threatened to take a pornographic picture of the girl's mother and sister. Police have arrested a porn lover after filing a case under 3 sections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X