Sadist: పెళ్లైన 10 ఏళ్లకు కట్నం గుర్తుకు వచ్చింది. భార్య, అత్తను చితకబాదేశాడు, తలాక్ తలాక్ తలాక్ !
లక్నో/ఉత్తరప్రదేశ్: వివాహం చేసుకున్న దంపతులు కాపురం చేశారు. దంపతులు కాపురం చేసిన సమయంలో ఇద్దరు పిల్లలు పుట్టారు. పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత అత్తమామలు ఇస్తామని చెప్పిన కట్నం ఇవ్వలేదని భర్తకు గుర్తుకు వచ్చింది. అప్పటి నుంచి భార్య, పిల్లలకు అతను టార్చర్ పెట్టాడు. పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు అయిపోవడంతో కట్నం తీసుకురావడానికి భార్య నిరాకరించింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. రగలిపోయిన భర్త అతని భార్య, పిల్లలను ఆమె పుట్టింటికి పంపించేశాడు. అయినా భార్య మాత్రం కట్నం తీసుకురావడానికి నిరాకరించింది. అంతే బంధువులు, స్నేహితులను వెంటపెట్టుకుని భార్య పట్టింటి దగ్గరకు వెళ్లిన భర్త అక్కడ చిందులు వేశాడు. భార్యను, ఆమె తల్లిని చితకబాదేశాడు. పనిలోపనిగా వెళ్లిపోతూ భార్యను పట్టుకుని మరోసారి చితకబాదేసి ఆమెకు మూడుసార్లు తలాక్ తలాక్ తలాక్ అని చెప్పిన భర్తకు ఇప్పుడు సినిమా కష్టాలు ఎదురైనాయి.
Illegal
affair:
ఇల్లు
ఇచ్చి,
డబ్బులు
ఇచ్చిన
ఫ్రెండ్
భార్యతో
వీడు
?,
ప్రాణస్నేహితుడి
చేతిలో
!

కొన్ని సంవత్సరాలు భార్యతో హ్యాపీలైఫ్
ఉత్తరప్రదేశ్ లోని బరేలీలోని బరాదరి ప్రాంతంలో వాసీమ్ అనే వక్తి నివాసం ఉంటున్నారు. 12 సంవత్సరాల క్రితం వాసీమ్ అత్తరున్నీసా బేగం (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వాసీమ్, అత్తరున్నీసా బేగం దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత కొన్ని సంవత్సరాలు వాసీమ్ అతని భార్య అత్తరున్నీసా బేగం, పిల్లలతో సంతోషంగానే ఉన్నాడు.

కట్నం విషయం గుర్తుకు వచ్చింది
పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత అత్తమామలు ఇస్తామని చెప్పిన కట్నం ఇవ్వలేదని వాసీమ్ కు గుర్తుకు వచ్చింది. అప్పటి నుంచి భార్య అత్తరున్నీసా బేగం, ఇద్దరు పిల్లలకు వాసీమ్ టార్చర్ పెట్టాడు. పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు అయిపోవడంతో కట్నం తీసుకురావడానికి అత్తరున్నీసా బేగం నిరాకరించింది. ఇదే విషయంలో వాసీమ్, అత్తరున్నీసా బేగం దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

భార్య, అత్తను చితకబాదిన శాడిస్టు
అత్తరున్నీసా బేగం తీరుతో రగలిపోయిన వాసీమ్ అతని భార్య, పిల్లలను ఆమె పుట్టింటికి పంపించేశాడు. అయినా అత్తరున్నీసా బేగం మాత్రం కట్నం తీసుకురావడానికి నిరాకరించింది. అంతే బంధువులు, స్నేహితులను వెంటపెట్టుకుని భార్య అత్తరున్నీసా పట్టింటి దగ్గరకు వెళ్లిన వాసీమ్ అక్కడ చిందులు వేశాడు. భార్య అత్తరున్నీసా బేగంను, ఆమె తల్లిని చితకబాదేశాడు.

మూడుసార్లు తలాక్ చెప్పిన మొగుడు
పనిలోపనిగా వెళ్లిపోతూ భార్య అత్తరున్నీసా బేగంను పట్టుకుని మరోసారి చితకబాదేసిన వాసీమ్ ఆమెకు మూడుసార్లు తలాక్ తలాక్ తలాక్ అని చెప్పి వెళ్లిపోయాడు. వాసీమ్ మీద అతని భార్య అత్తరున్నీసా బేగం కేసు పెట్టిందని, వాసీమ్ కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు. భార్య దెబ్బకు వాసీమ్ కు ఇప్పుడు సినిమా కష్టాలు ఎదురైనాయి.