Sadist: కాలేజ్ అమ్మాయి తల మీద బండరాయి వేసి చంపేసిక శాడిస్టు, వెంటపడినా ప్రేమించలేదని !
చెన్నై/సేలం: కాలేజ్ కు వెలుతున్న అమ్మాయి మీద ఓ యువకుడి కన్నుపడింది. ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్న యువతి వెంటపడిన యువకుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని, నువ్వు నన్ను ప్రేమించాలని ఆమె మీద ఒత్తిడి చేశాడు. కుటుంబ పరిస్థితులు గమనించిన కాలేజ్ అమ్మాయి వెంటపడుతున్న యువకుడిని ప్రేమించడానికి నిరాకరించింది. అయితే అమ్మాయి వెంటపడుతూనే ఉన్న అతను ఆమెను ప్రేమించాలని టార్చర్ పెట్టాడు. పెద్దలు పంచాయితీలు చేసి ఆ యువకుడిని ఆమె నివాసం ఉంటున్న ఇంటి వైపు, కాలేజ్ వైపు వెళ్లకూడదని వార్నింగ్ ఇచ్చారు. రాత్రి యువతి నివాసం ఉంటున్న ప్రాంతానికి వెళ్లి ఆమె ఇంటి వెనుక దాక్కొన్నాడు. రాత్రి ఇంటి నుంచి కాలేజ్ అమ్మాయి బయటకు రావడంతో తనను పెళ్లి చేసుకోవాలని వేధించాడు. అమ్మాయి కేకలు వెయ్యడంతో రగిలిపోయిన యువకుడు ఆమెను కిందకు తోసేసి పక్కనే ఉన్న బండరాయి తీసుకుని యువతి తల మీద వేశాడు. తీవ్రగాయాలైన యువతిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణం పోయింది.

ముగ్గురు కూతుర్లు, కొడుకు
తమిళనాడులోని సేలం జిల్లాలోని కూడమలై ప్రాంతంలో మురుగేషన్, జయలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. మురగేషన్, జయలక్ష్మి దంపతులకు నందిని, రోజా అనే కుమార్తెలు, విజయ్ అనే కుమారుడు ఉన్నాడు, కడంపూర్-కూడమలై రహదారిలో పొలంలోనే నివాసం ఉంటున్న మురగేషన్ దంపతులు వ్యవసాయం చేస్తున్నారు.

కాలేజ్ లో చదువుతున్న కూతురు
మురగేషన్ కూతురు రోజా అత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో డిగ్రీ చదువుతున్నది. ప్రతిరోజు ఇంటి నుంచి కాలేజ్ కు వెళ్లి వస్తున్న రోజా బాగా చదువుకుని మంచి ఉద్యోగం చెయ్యాలని ఆశపడుతోంది. తాండవరాయపురంలో నివాసం ఉంటున్న నీలక్రిష్ణన్ కుమారుడు సుమిత్ రాయ్ తాత చిన్నదురై కాలేజ్ అమ్మాయి రోజా నివాసం ఉంటున్న ఊరిలోనే ఉంటున్నాడు.

తాత ఇంటికి వెళితే కాలేజ్ అమ్మాయి రోజా కనపడింది
సుమిత్ రాయ్ తాత చిన్నదురై ఇంటికి వెళ్లి అక్కడే ఉంటున్నాడు. ఆ సమయంలో కాలేజ్ కు వెళ్లి వస్తున్న రోజా సుమిత్ రాయ్ కంట్లోపడింది. రోజా కుటుంబం ఊరికి శివార్లలోని పొలంలో ఒంటరి ఇల్లు కావడంతో సుమిత్ రాయ్ కి ఆ విషయం కలిసి వచ్చింది. చూడటానికి రోజా అందంగా ఉండటంతో ఆమెను ఎలాగైనా ప్రేమించాలని సుమిత్ రాయ్ డిసైడ్ అయ్యాడు.

నో చెప్పిన అమ్మాయి
ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్న రోజా వెంటపడిన సుమిత్ రాయ్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని, నువ్వు నన్ను ప్రేమించాలని ఆమె మీద ఒత్తిడి చేశాడు. కుటుంబ పరిస్థితులు గమనించిన రోజా మాత్రం వెంటపడుతున్న యువకుడిని ప్రేమించడానికి నిరాకరించింది. సుమిత్ రాయ్ మాత్రం రోజాను ఎలాగైనా ప్రేమించాలని మొండిగా డిసైడ్ అయ్యాడు.

టార్చర్ పెట్టాడు
కాలేజ్ అమ్మాయి రోజా వెంటపడుతూనే ఉన్న సుమిత్ రాయ్ ఆమెను ప్రేమించాలని టార్చర్ పెట్టాడు. పెద్దలు పంచాయితీలు చేసి సుమిత్ రాయ్ ని రోజా నివాసం ఉంటున్న ఇంటి వైపు, కాలేజ్ వైపు వెళ్లకూడదని వార్నింగ్ ఇచ్చారు. అయితే రెండు రోజులు మాత్రమే సైలెంట్ గా ఉన్న సుమిత్ రాయ్ తరువాత మళ్లీ సుమిత్ రాయ్ వెంటపడటం మొదలుపెట్టాడు.

కాలేజ్ అమ్మాయి తల మీద బండరాయి వేసిన కిరాతకుడు
రాత్రి రోజా నివాసం ఉంటున్న ఒంటరి ఇంటి దగ్గరకు వెళ్లిన సుమిత్ రాయ్ ఆమె ఇంటి వెనుక దాక్కొన్నాడు. రాత్రి ఇంటి నుంచి రోజా బయటకు రావడంతో ఇంటి వెనుకే ఉన్న సుమిత్ రాయ్ ఆమెను పట్టుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని రోజాను వేధించాడు. రోజా గట్టిగా కేకలు వెయ్యడంతో రగిలిపోయిన సుమిత్ రాయ్ ఆమెను కిందకు తోసేసి పక్కనే ఉన్న బండరాయి తీసుకుని ఆమె తల మీద వేశాడు.

ప్రాణం పోయింది
ఆ సమయంలో రోజా తండ్రి మురగేషన్ సుమిత్ రాయ్ ని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో అతని మీద దాడిచేసిన కిరాతకుడు తప్పించుకునిపారిపోయాడు. తీవ్రగాయాలైన రోజాను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణం పోయిందని వైద్యులు చెప్పారు. రోజాను దారుణంగా హత్య చేసిన సుమిత్ రాయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.