Sadist Techie: ప్రియురాలు సజీవదహనం, టెక్కీకి యావజ్జీవ శిక్ష, రూ. 5 లక్షలు జరిమానా, పాపంపండింది!
కొచ్చి/ త్రిశూర్/ కల్లూరు: ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యాభ్యాసం పూర్తి చేసిన అమ్మాయి వెంటపడిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు తనను ప్రేమించాలని ఆమెకు చెప్పాడు. తాను మంచి ఉద్యోగం చెయ్యాలని, ఇప్పుడే ప్రేమ, పెళ్లి అంటే తనకు ఇష్టం లేదని కొంతకాలం అమ్మాయి తప్పించుకుని తిరిగింది. తనను ప్రేమించలేదని ప్రియురాలి మీద పగ పెంచుకున్న టెక్కీ తనకు దక్కని అమ్మాయి ఎవ్వరికీ దక్కకుండా చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. అమ్మాయి ఇంటి దగ్గరకు పెట్రోల్, కత్తి, విషం బాటిల్ తీసుకెళ్లి బెదిరించాడు. ప్రేమించడానికి అమ్మాయి నిరాకరించడంతో శాడిస్టు టెక్కీ ప్రియురాలిని ఆమె ఇంటిలోనే పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవదహనం చేశాడు. ప్రియురాలిని చంపిన శాడిస్టుకు కోర్టు యావజ్జీవ కారాగారశిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా విధించింది.
Illegal affair: ఆంటీకి ఆ నలుగురు, ఒకడికి మండింది, మిల్క్ ట్యాంకర్ లా ఉందని ఒకటే ఫాలోయింగ్!

టెక్కీ వన్ సైడ్ లవ్
కేరళలోని కల్లూరు సమీపంలోని కొట్టాయంలో నివాసం ఉంటున్న నిధీష్ (27) అనే యువకుడు ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీగా ఉద్యోగం చేస్తున్నాడు. కేరళలోని చియరతు వత్సాలయంలో నివాసం ఉంటున్న క్రిష్ణరాజ్ కుమార్తె నీతు (27) ఇంజనీరింగ్ పూర్తి చేసింది. 2018 నుంచి నీతును టెక్కీ నిధీష్ ప్రేమిస్తున్నాడు. అయితే నిధీష్ ను నీతు ప్రేమించలేదని తెలిసింది.

ఉద్యోగం చెయ్యాలి
నేను మంచి ఉద్యోగం చెయ్యాలని, ఇప్పుడే ప్రేమ, పెళ్లి అంటే తనకు ఇష్టం లేదని కొంతకాలం నీతు ఆమె వెంటపడుతున్న నిధీష్ ను తప్పించుకుని తిరిగింది. అయితే నిధీష్ మాత్రం తనను ప్రేమించాలని, తననే పెళ్లి చేసుకోవాలని, నువ్వు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి నేను అవకాశం ఇవ్వనని బెదిరించడం మొదలుపెట్టాడు.

శాడిస్టు టెక్కీ డిసైడ్
నీతు తనను ప్రేమించలేదని ప్రియురాలి మీద పగ పెంచుకున్న టెక్కీ నిధీష్ తనకు దక్కని అమ్మాయి ఎవ్వరికీ దక్కకుండా చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. చివరి ప్రయత్నంగా నీతుతో మాట్లాడి పెళ్లికి ఒప్పించాలని మరోసారి ఆలోచించాడు. సమయం కోసం వేచి చూసిన నిధీష్ 2019 ఏప్రిల్ నెలలో నీతు ఇంటి దగ్గరకు వెళ్లాడు.

ప్రియురాలు సజీవదహనం
నీతుతో మాట్లాడాలని నిధీష్ పట్టుబట్టాడు. అయితే నిధీష్ తో మాట్లాడటానికి నీతు అంగీకరించలేదు. అప్పటికే నిధీష్ అతని వెంట పెట్రోల్ క్యాన్, విషం బాటిల్, ఓ కత్తి తీసుకుని వెళ్లాడు. నీతు మాట్లాడటానికి నిరాకరించడంతో నిధీష్ సహనం కోల్పోయాడు. వెంటనే పెట్రోల్ తీసుకుని నీతు మీద పోసి నిప్పంటించడానికి ప్రయత్నించాడు. ఇంట్లో తప్పించుకున్న నీతు బాత్ రూమ్ లోకి పరుగు తీసింది. బాత్ రూమ్ లోకి వెళ్లిన నిధీష్ ప్రియురాలు నీతు మీద పెట్రోల్ పోసి నిప్పంటించి బాత్ రూమ్ బయట గడి పెట్టేశాడు. నీతు కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్లు ఆమెను రక్షించడానికి విఫలయ్నం చేసినా చివరి నీతు సజీవదహనం అయ్యింది.

శాడిస్టుకు యావజ్జీవ శిక్ష... రూ. 5 లక్షలు జరిమానా
నీతుకు నిప్పంటించి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన నిధీష్ ను స్తానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. కేసు విచారణ చేసిన పోలీసులు ప్రత్యక్షసాక్షులు ఇచ్చిన స్టేట్ మెంట్ నమోదు చేసి కోర్టులో సమర్పించారు. నీతును నిధీష్ సజీవదహనం చేశాడని వెలుగు చూసింది. త్రిశూర్ జిల్లా ప్రిన్సిపల్ కోర్టు నిందితుడు నిధీష్ కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా విధించింది. శాడిస్టు టెక్కీ నిధీష్ కు సరైన శిక్షపడిందని నీతు కుటుంబ సభ్యులు అంటున్నారు.