వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయి బాబా దేవుడు కాడు, కొలువొద్దు: శంకరాచార్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Sai Baba not a God, wrong to worship him: Shankaracharya
ముంబై: సాయిబాబా విషయంలో ద్వారకాపీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద వివాదాస్పదమైన వ్యాఖ్య చేశారు. సాయిబాబా దేవుడు కాడని, సాయిబాబాను ప్రార్థించవద్దని ఆయన అన్నారు. హిందువులను విభజించడానికే సాయిబాబాకు పూజలు చేయడమనేది వచ్చిందని ఆయన అన్నారు.

సాయిబాబా మానవుడు మాత్రమేనని, దేవుడు కాడని, అందువల్ల ప్రార్థించవద్దని ఆయన అన్నారు. సాయిబాబాకు గుడులు కూడా కట్టవద్దని ఆయన అన్నారు అది డబ్బులు చేసుకుంటున్న కొన్ని విదేశీ సంస్థల కుట్ర అని ఆయన అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

హిందూముస్లిం ఐక్యతకు ప్రతీకగా సాయిబాబాను గుర్తించడానికి కూడా ఆయన నిరాకరించారు. సనాతన ధర్మంలో విష్ణువుకు సంబంధించి కలియుగంలో 24 అవతారాలను చెప్పారని, కల్కి, బుద్ధ తప్ప ఇతర అవతారాల గురించి చెప్పలేదని, అందువల్ల సాయిబాబా విష్ణువు అవతారం కాదని ఆయన అన్నారు.

సాయిబాబాను గురువుగా గానీ ఆదర్శపురుషుడిగా గానీ పరిగణించకూడదని ఆయన అన్నారు. సాయిబాబా మాంసాహారి అని ఆయన అన్నారు.

English summary

 In a statement that could hurt sentiments of the followers of Sai Baba, Dwarakapeeth Shankaracharya Swami Swaroopanand said that worshipping the saint was a conspiracy to divide Hindus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X