వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక దాడి నిందితుడుతో సాక్షి మహారాజ్ ములాఖత్

|
Google Oneindia TeluguNews

సీతాపూర్ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించడమో ఏమో కానీ ఆ పార్టీ నేతల చేష్టలు అధినేతలకు విసుగు తెప్పిస్తున్నాయి. నిన్ననే గిరిరాజ్ సింగ్‌కు అమిత్ షా తలంటగా .. ఇవాళ మరో నేత సాక్షి మహారాజ్ అలాంటి పనే చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సాక్షి .. గుడికో, గోపురానిక వెళ్లాలి. అంత కాదంటే ప్రజలకు కృతజ్ఞతలు తెలుపాలి. కానీ అతను జైలుకెళ్లి సంచలనం సృష్టించాడు.

ఉద్యోగం పేరుతో వంచన

ఉద్యోగం పేరుతో వంచన

ఓ యువతిపై లైంగిక దాడి చేసి జైలు శిక్ష అనుభవిస్తోన్న నేత కుల్‌దీప్ సింగ్ సెంగార్‌తో సమావేశమయ్యారు సాక్షి మహారాజ్. జైలులో ఉన్న కుల్‌దీప్ వద్దకెళ్లి .. ఎన్నికల గురించి స్వయంగా వివరించానని మీడియాకు తెలిపారు. అంతేకాదు తాను ఎంపీగా మరోసాని ఎన్నికయ్యాయని .. ఇదే విషయం జైలులో తన స్నేహితుడికి తెలిపానని సెలవిచ్చాడు సాక్షి మహారాజ్. తన విజయానికి కృషిచేసిన కుల్‌దీప్ కు ధన్యవాదాలు తెలిపానని పేర్కొన్నారు. జైలులో ఉన్న కుల్ దీప్‌ను సాక్షి మహారాజ్ కలువడంపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఓ పార్లమెంటరీయన్ చేయాల్సిన పనులు ఇవేనా అనే ప్రశ్నిస్తున్నారు.

ఎవరీ కుల్‌దీప్ ?

ఎవరీ కుల్‌దీప్ ?

కుల్‌దీప్ సింగ్ సెంగార్ బీజేపీ నేత. కానీ అతనిపై ఓ యువతిని వేధించారనే అభియోగం కింద ప్రస్తుతం జైలులో ఉన్నాడు. యూపీలోని బంగారమై నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కానీ 2017లో ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. కొలువుకు ఆశపడ్డ ఆమెపై లైంగికదాడి చేశాడు. జరిగిన విషయం ఎక్కడ చెప్పొద్దని బెదిరించాడు. అయినా విషయం పేరెంట్స్‌కు తెలిసింది. దీంతో బాధితురాలి తండ్రిపై తిరిగి కేసు నమోదు చేయించాడు. ఆయుధాల కింద కేసు పెట్టించి .. జైలులో వేయించాడు. తర్వాత జైలులో పోలీసులు కొట్టడంతో రెండురోజుల తర్వాత చనిపోయాడు.

హత్యే ?

హత్యే ?

పోస్టుమార్టం నివేదికలో కూడా దెబ్బలకు తాళలేక చనిపోయారని నివేదిక వచ్చింది. ఈ అంశంపై దుమారం చెలరేగడంతో సీబీఐ చేత దర్యాప్తుకు ఆదేశించారు. జరిగిన ఘటనలో బాధితురాలిపై లైంగికదాడి చేశారనే అభియోగాలను సీబీఐ నమోదు చేసింది. దీంతో అతను జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. తండ్రి హత్య, 120 బీ ఇతర సెక్షన్లు, పోస్కో కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుల విచారణ క్రమం జరగుతుండగా .. జైలులో కుల్‌దీప్‌ను సాక్షి మహారాజ్ కలువడం విమర్శలకు దారితీసింది.

English summary
BJP parliamentarian Sakshi Maharaj on Wednesday visited party colleague and lawmaker Kuldeep Singh Sengar, who is lodged in jail over charges of rape and murder. "He is lodged in the jail for a long time. Sengar is one of the most popular lawmakers so I came to thank him after the elections," Sakshi Maharaj told reporters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X